Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ONE FAMILY REPAIR ROAD IN VISAKHAPATNAM WHO HAD LOST THEIR PARENT IN ROAD ACCIDENT NGS

AP Roads: గుంతలో పడి వ్యక్తి మృతి.. ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?

మృతుడి కుటుంబ సభ్యులు చేసిన పనిపై ప్రశంసలు

మృతుడి కుటుంబ సభ్యులు చేసిన పనిపై ప్రశంసలు

AP Roads: ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. ఇటీవల రోడ్లపై ఉన్న గుంతలో పడి ఓ వ్యక్తి మరణించాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు చేసిన.. పని చూసి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    AP Roads: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి పై దుమారం కొనసాగుతోంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని విపక్షాలు పదే పదే ఆందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఏపీలో రోడ్లు (AP Roads) అద్భుతంగా ఉన్నాయని చెబుతోంది. అయితే ఆ విమర్శల సంగతి ఎలా ఉన్నా.. తాజాగా ఓ కటుంబం చేసిన పనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపై ప్రమాదం జరిగితే దాన్ని చూస్తూ పట్టించుకునే తీరిక లేకుండా ఉన్నారు జనం.. ఎవరి బిజీ వారిది.. పక్కవారు ఎలా ఉన్నా.. వారికి పట్టదు తమ స్వార్థం తప్పా ఏమీ పట్టించుకోరు. వెళ్తున్నప్పుడు పక్కన ప్రమాదం (Accident) జరిగినా మనకెందుకులే అని వదిలి వెళ్లిపోతారు తప్పా.. ఆ ప్రాణాలను కాపాడే ప్రయత్నం మాత్రం చేయరు. అదే పొరపాటున తమ కుటుంబ సభ్యులకు జరిగితే.. సమాజాన్ని అంతా దుమ్మెత్తి పోస్తారు. ఎవరూ సాయానికి ముందు రాలేదని విమర్శలు చేస్తంటారు. అదే మరొకరు సాయం కావాలని కోరితే.. మనకెందుకులే అంటూ చేతులు దులుపుకుని వెళ్లిపోతారు. కానీ ఓ కుటుంబం మాత్రం ఎవరి ఊహకు అందని పని చేశారు.

    అసలు ఏం జరిగిందంటే..? విశాఖపట్నం (Visakhapatnam) లో వ్యక్తిని రోడ్డుపై ఉన్న గుంత మింగేసింది. ఈ నెల 4వ తేదీన రవ్వా సుబ్బారావు (Rao Subbarao) అనే వ్యక్తి డీఆర్ఎం కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ కు బైక్ పై వెళ్తున్నారు. మధ్యలో రోడ్డుపై గుంతను చూసుకోలేదు. దీంతో ఆ గుంతలో పడ్డారు. బైక్ నడుస్తున్న వేగమో, గుంత లోతో తెలియదు కానీ రోడ్డుపై పడిపోయారు. అంతే ఆ రోడ్డు గుంత ఆయన్ను మింగేసింది. రవ్వా సుబ్బారావు ప్రాణాలు కోల్పోయారు.



    ఆయన కుటుంబానికి ఇంటి పెద్ద దూరమయ్యారు. రోడ్డుపై గుంతలో పడి తమ కుటుంబ సభ్యుడు చనిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. అలా అని వారు ప్రభుత్వాన్నో.. సాయం చేయలేదని మరెవరినో తిడుతూ ఉండలే... తమలా మరొకరికి ఆ కష్టం రావొద్దని భావించారు. ఆ గుంత వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు మరొకరికి ఆ కష్టం రాకూడదని భావించారు. వెంటనే దాన్ని పూడ్చే పని చేపట్టారు. తమ సొంత ఖర్చుతో సిమెంట్, ఇసుక, కంకర తీసుకెళ్లి దాన్ని విజయవంతంగా పూడ్చేశారు.

    అలా చేయడం ద్వారా మరో ప్రమాదం జరగకుండా అడ్డుకట్ట వేయగలిగారు. దీంతో ఈ ఘటన వైజాగ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అధికారులు చేయాల్సిన పనిని బాధితులు చేయడంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రముఖుల ప్రశంసల వెల్లువ రోడ్డుపై గుంతలో పడి తమ కుటుంబ సభ్యుడు చనిపోయాడని ఏడుస్తూ కూర్చుకుండా.. మరొకరికి ఆ కష్టం రాకూడదన్న సామాజిక స్పృహతో ఆ గుంతను పూడ్చేసిన రవ్వా సుబ్బారావు కుటుంబ సభ్యుల్ని ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు.

    తమ కుటుంబ సభ్యుడిని కోల్పోవడానికి కారణమైన రోడ్డుపై గుంతను పూడ్చడం ద్వారా అదే కష్టం మరొకరికి రాకూడదని ఆ కుటుంబం భావించింది. దీంతో ఆ గుంత మాయమైంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు చేసిన పనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Road accidents, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు