హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tomato Price: మళ్లీ భయపెడుతున్న టమాట ధరలు.. కారణం ఏంటో తెలుసా..?

Tomato Price: మళ్లీ భయపెడుతున్న టమాట ధరలు.. కారణం ఏంటో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tomato: ఆంధ్రప్రదేశ్ లో సామాన్యులను మళ్లీ టమాటా ధరలు ఏడిపిస్తున్నాయి. రెండు నెలల ముందు కిలో ధర సెంచరీ దాటడంతో.. వాటి సంగతే అందరూ మరిచిపోయారు. తరువాత కిలో పది రూపాయలకు పడిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. కానీ ఇప్పుడు మళ్లీ టమాటాలు ఏడిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.

  Tomato Price: సామాన్యులు టమాట (Tomato) అంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఖరీఫ్‌లో టమాట సాగు చివరి దశకు చేరుకోవడంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. దాంతో టమాట ధర అమాంతం పెరిగిపోయింది (Tomato Price Hike). దిగుబడి కరువై మార్కెట్‌కు తక్కువ పరిమాణంలో వస్తుండటంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెల 1వ తేదీన కడప రైతు బజార్‌ (Kadap Raythu Bazar) లో కిలో 11 రూపాయలు ఉండగా..  ప్రస్తుతం 35 రూపాయలకు.. ఇక బయటి మార్కెట్‌లో కిలో ధర 50 రూపాయలకు చేరువైంది.  దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. కడప జిల్లా (Kadap District) లో ఖరీఫ్ సీజన్‌లో 470 ఎకరాల్లో టమాట సాగు చేశారు. మైలవరం, కలసపాడు, ఎర్రగుంట్ల, ఖాజీపేట, సింహాద్రిపురం, వీఎన్ పల్లె, లింగాల, తొండూరు, సీకేదిన్నె, పెండ్లిమర్రి, చక్రాయిపేట మండలాల్లో ఎక్కువగా టమాట సాగు చేశారు.

  అయితే  ఈ నెలాఖరుకు కోతలు ముగుస్తాయి. ఫలితంగా మార్కెట్‌కు  ఆశించినంతగా టమటా రావడం లేదు. దాంతో వీటి ధరలు ఆకాశాన్నంటేలా పెరిగిపోయాయి. జూలై 20 – 25 మధ్య కిలో  10 రూపాయలకు దొరికేది.. కానీ ఇప్పుడు 35 రూపాయలకు చేరింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది

  ఇదీ చదవండి : ఆ జిల్లాను భయపెడుతున్న పాములు.. ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి..

  కడప జిల్లాలో ఎక్కువగా సాగు చేసే టమాటలు హైదరాబాద్‌తో పాటు బెంగళూరు మార్కెట్‌కు వెళ్తుంది. అయితే, గత కొన్నిరోజులుగా ఖరీఫ్‌ సాగు చివరి దశకు చేరడంతో దిగుబడి తగ్గిపోయింది. ఇప్పుడు కడపలో దొరుకుతున్న టమాట కేవలం జిల్లా వాసులకే సరిపోయేదిగా ఉంది. అలాగే, దిగుబడి లేక ధర కూడా అమాంతం పెరిగిపోయింది. కొత్తగా టమాట నారు నాటి ఉత్పత్తి వచ్చే వరకు టమాట ధరలు మరింత పైకి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  ఇదీ చదవండి : అన్నపై పగ పెంచుకుంది.. ఆ కసితో మేనల్లుడ్ని మేనళ్లుడ్ని టార్గెట్ చేసింది.. చివరికి ఏమైందంటే?

  గతంలోనూ ఇలానే టమటా ధరలు భయపెట్టాయి. కేవలం బహిరంగ మార్కెట్లోనే కాదు.. హోల్ సేల్ మార్కెట్ లోనూ కూడా.. కిలో టమటా సెంచరీ దాటింది. దీంతో చాలామంది అటువైపు చూడాలి అంటేనే భయపడ్డారు.. టమటాకు ప్రత్యమ్నాయ ాలపైనా కొందరు ఫోకస్ చేశారు. ఇక టమటాలనూ పూర్తిగా మరిచిపోతున్న సమయంలో.. వాటి ధరలు పది రూపాయలకు పడిపోయింది. దీంతో రైతులు కన్నీరు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే హోల్ సేల్ మార్కెట్ లోనే టమాట పది రూపాయలకు దొరికింది అంటే.. రైతుల దగ్గర రూపాయి కంటే తక్కువే కొనే అవకాశాలు ఉంటాయి.

  ఇదీ చదవండి : అమ్మవారికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ.. ఘనంగా అనంత పద్మనాభ వ్రతం

  దీంతో చాలా చోట్ల టమటాకు ధర లేకపోవడంతో రోడ్లపైన పారేశారు కూడా.. మరోవైపు ఇలా ధరలు పడిపోవడంతో చాలామంది టమటా సాగుపై ఆసక్తి తగ్గించేశారు.. అందుకే మరోసారి టమటా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక భవిష్యత్తులో టమటాల గురించి మరిచిపోక తప్పదేమో..?

       

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Price Hike, Visakhapatnam

  ఉత్తమ కథలు