Kodi Kathi Case: గత ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో (AP Politics) సంచలనంగా మారింది కోడి కత్తి కేసు (KodiKatti Case) .. 2018లో విశాఖపట్నం విమానాశ్రయం (Visakha Airport) లో అప్పటి ప్రతిపక్ష నేత YS జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పై.. శ్రీనివాస రావు (Sriniviasa Rao)అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. ఈ కేసు అప్పటినుంచి కోర్టులో విచారణ కొనసాగుతోంది. నిందితుడు శ్రీనివాస రావు తల్లిదండ్రులు జగన్ చుట్టు తిరుగుతున్నారు. తమ కుమారుడికి బెయిల్ ఇప్పించటానికి సహకరించాలని కోరుతున్నారు. కానీ జగన్ మాత్రం కనీసం బాధిత కుటుంబ సభ్యులకు అపాయింట్ మెంట్ ఇవ్వటంలేదు. దీంతో వారు తమ కుమారుడి జీవితం అంతా జైల్లోనే గడిచిపోతోందని వాపోతున్నారు. ఆ ఘటన జరిగిన నాలుగేళ్ల తరువాత మళ్లీ తెరపైకి వచ్చింది.
తాజాగా ఎన్ఐఎ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసులో ప్రధానమైన కోడికత్తి ఇంతకాలం ఎక్కడుంది? నేరానికి వినియోగించిన ఆ కత్తి ప్రస్తుతం ఎక్కడ ఉంది. తమ ముందుకు తీసుకురండీ అంటూ తాజాగా NIA కోర్టు ఆదేశించింది. విజయవాడలో NIA కోర్టు కోడికత్తి కేసుకు సంబంధించి సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేశ్ కుమార్ ను కోర్టు విచారించింది.
ఈ కేసు తదుపరి విచారణ రోజున ఆ కత్తిని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 14వ తేదీకి వాయిదా వేసింది. 14న జరిగే విచారణకు ఆ కత్తిని తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అప్పట్లో ఈ దాడి అధికార వైసీపీ చేయిందనే ఆరోపణలు చేయడం వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యిందన్నది రాజకీయ విశ్లేషకులు భావన.. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఎలాంటి తీర్పు వస్తుంది. ఆ తీర్పు ఏ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందన్నది ఉత్కంఠగా మారింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోడికత్తి కేసు కోర్టులో విచారణలు కొనసాగుతునే ఉన్నాయి. నిందితుడు జైలులోనే కాలం వెళ్లదీస్తున్నాడు. ఈకోడికత్తి కేసులో అసలు బాధితుడు అప్పటి ప్రతిపక్ష నేత.. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మాత్రం ఇప్పటివరకు కోర్టుకు హాజరుకాలేదు. నిందితుడు ఇప్పటి వరకు కోర్టుకు హాజరుకాకపోవటంపై ఎన్ ఐఏ కోర్టు అసహనం వ్యక్తంచేసింది. బాధితుడిగా భావిస్తున్న జగన్ కోర్టుకు రావాల్సిందేనని గతంలో స్పష్టంచేసింది. అయినా జగన్ కోర్టుకు హాజరుకాకపోవడం ఏంటని అసహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇదీ చదవండి : ఉద్యోగులకు శుభవార్త.. రెండు మెట్లు దిగామన్న సజ్జల.. కొత్త హామీలు ఇవే
ఈ క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ కొనసాగుతున్న సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ ఘటనలో బాధితుడు న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Visakhapatnam