హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Omicron Alert in AP: ఏపీలో చాపకింద నీరులా ఒమిక్రాన్..? కోనసీమలో కొత్త వేరియంట్ కలకలం..!

Omicron Alert in AP: ఏపీలో చాపకింద నీరులా ఒమిక్రాన్..? కోనసీమలో కొత్త వేరియంట్ కలకలం..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఒమిక్రాన్ (Omicron) టెన్షన్ కొనసాగుతోంది. ఇప్పిటవరకు రాష్ట్రంలో ఒకే ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదైనా.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ విదేశీ ప్రయాణికులున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కొత్త వేరియట్ వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఒమిక్రాన్ (Omicron) టెన్షన్ కొనసాగుతోంది. ఇప్పిటవరకు రాష్ట్రంలో ఒకే ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదైనా.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ విదేశీ ప్రయాణికులున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కొత్త వేరియట్ వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజులుగా ఎక్కడ విన్న ఒమిక్రాన్ పైనే చర్చ జరుగుతోంది. కోనసీమకు చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో అది ఒమిక్రాన్ అని జనం హడలిపోతున్నారు. ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లాకు 2,746 మంది విదేశీ ప్రయాణికులు రాగా.. వారిలో 2,673 మందిని గుర్తించారు. వారిలో 928 మందికి కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా ముగ్గురికి మాత్రమే పాజిటివ్ గా తేలింది.

  బంగ్లాదేశ్‌ నుంచి అయినవిల్లి మండలం సిరిపల్లి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ఇక్కడ ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతడికి ఒమిక్రాన్ సోకినట్లో సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడి నుంచి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్ లోని సీసీఎంబీకి పంపారు. అలాగే అతడి ప్రైమరీ కాంటాక్టులను కూడా గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

  ఇది చదవండి: అల్లు అర్జున్ పుష్పకు లైన్ క్లియర్.. ఏపీలో టికెట్ల రేట్లపై విచారణ వాయిదా..


  ఇదిలా ఉంటే సిగపూర్ నుంచి వచ్చిన జంటకు పాజిటివ్ గా నిర్ధారణ కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. భార్యాభర్తలు ఈనెల 7వ తేదీన సింగపూర్ నుంచి చైన్నె చేరుకున్నారు. వారికి అక్కడ వైద్య పరీక్షలు నిర్వ హిస్తే నెగిటివ్‌ వచ్చింది. అక్కడి నుంచి 8వ తేదీకి స్వగ్రామమైన రావులపాలెం మండలం గోపాలపురం చేరుకున్నారు. ఇక్కడ వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తే కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముందు జాగ్రత్తగా వీరిని హోం ఐసోలేషన్‌లో ఉంచి వీరి ప్రైమరీ కాంటాక్టులను పరిశీలిస్తున్నామని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

  ఇది చదవండి: రోజాకు చెక్ పెట్టేందుకు అసమ్మతి వర్గం స్కెచ్.. ఫైర్ బ్రాండ్ ధైర్యంగా ఎదుర్కొంటారా..?


  ఇదిలా ఉంటే బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులిటెన్లో తూర్పుగోదావరి జిల్లాలోనే అధికంగా పాజిటివ్ కేసులు నమోదవడంతో జిల్లావాసులను కలవరపెడుతోంది. వీటిలో అమలాపురం డివిజన్‌లోనే ఐదు కేసులు నమోదుకాగా.. వాటిలో అయినవిల్లి మండలంలో మూడు కేసులు, అమలాపురంలో రెండు కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. కాగా విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో ప్రచారాన్ని నమ్మొద్దని.. వారికి కరోనా సోకినా.. ఒమిక్రాన్ గా నిర్ధారణకు రావొద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

  ఇది చదవండి: మంత్రి పేర్ని నానికి అదనపు బాధ్యతలు.. తనదగ్గరున్న కీలక శాఖను అప్పగించిన సీఎం జగన్


  ఇటీవల విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ గా నిర్ధారణ అయినా.. ఎలాంటి లక్షణాలు లేకపోగా.. కొన్నిరోజుల తర్వాత అతడికి నెగెటివ్ వచ్చింది. అటు తిరుపతిలో కూడా ఫారిన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకడంతో ఒమిక్రాన్ గా ప్రచారం జరిగింది. ఐతే అధికారులు అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East Godavari Dist, Omicron corona variant

  ఉత్తమ కథలు