Home /News /andhra-pradesh /

Andhra Pradesh: నిన్ననిత్య, నేడు మౌనిక, టిక్ టాక్ భార్గవ్ గురించి లైవ్ లోకి యువతులు క్యూ

Andhra Pradesh: నిన్ననిత్య, నేడు మౌనిక, టిక్ టాక్ భార్గవ్ గురించి లైవ్ లోకి యువతులు క్యూ

టిక్ టాక్ స్టార్ భార్గవ్ కేసులో ట్విస్టులపై ట్విస్టులు

టిక్ టాక్ స్టార్ భార్గవ్ కేసులో ట్విస్టులపై ట్విస్టులు

టిక్ టాక్ స్టార్ భార్గవ్ బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులకు తమ బాధలు చెప్పుకుంటున్నారు. మరోవైపు అసలు భార్గవ్ తో తమకు సంబంధం లేదంటూ మరికొంత మంది యువతులు ఒక్కొక్కరూ లైవ్ లోకి వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

    విశాఖపట్నంలో టిక్ టాక్ భార్గవ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫన్ బకెట్ అంటూ టిక్ టాక్ లో హల్ చేసిన భార్గవ్ లీలలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా అందాయి. అయితే అందులో 14ఏళ్ల బాలికను నమ్మించి గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకి రావడంతో కామ క్రీడలు అందరికీ తెలిసాయి. టిక్ టాక్ తో వచ్చిన పేరును తన కోరికలు తీర్చుకునేందుకు వాడుకున్నాడు ఈ కామాంధుడు. బాలికపై అత్యాచారం కేసులో విశాఖ పోలీసులు భార్గవ్ ని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

    బాలిక తల్లి ఫిర్యాదుతో ఏప్రిల్ 16న పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో దిశ, పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. బాలిక బట్టలు మార్చుకునే టైంలో ఫొటోలు, వీడియోలు తీసిన భార్గవ్ వాటితో బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగికంగా అనుభవించాడని పోలీసులు తెలిపారు. అయితే భార్గవ్ బాధితులు ఇంకా చాలామందే ఉన్న్టట్టు పోలీసుల విచారణలో తెలిసింది. గతంలో కూడా చాలామంది యువతులను ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

    ఇప్పటి వరకు ఏ ఒక్క అమ్మాయి నేరుగా అతనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో భార్గవ్ బండారం బట్టబయలైంది. అయితే తాజాగా పలు యూట్యూబ్ ఛానల్స్ గతంలో భార్గవ్ తో కలిసి వీడియోలు చేసిన కొందరు అమ్మాయిల పేర్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అందులో ఇప్పటికే ఓ మై గాడ్ నిత్య పేరు తెరపైకి రాగా.. తనకూ ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, భార్గవ్‌తో మాట్లాడి ఏడాదిపైనే అయిందని ఆమె క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. భార్గవ్ చేతిలో బలైన బాధితురాలిని తాను కాదంటూ.. అయినా కొందరు తెలియక తన పేరుని, ఫొటోలను వాడుతున్నారని, వెంటనే ఆ వీడియోలు డిలీట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తన తల్లితో కలిసి ఓ వీడియో రిలీజ్ చేసింది నిత్య.

    నిత్యలానే గతంలో భార్గవ్‌తో వీడియోలు చేసిన యువతులు ఒక్కొక్కరుగా లైవ్ లోకి వచ్చి తమకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, తమ పేర్లు వాడకూడదని చెబుతున్నారు. తాజాగా భార్గవ్‌తో గతంలో అమ్మాయి –అబ్బాయి పేరిట వీడియోలు చేసిన మౌనిక అనే అమ్మాయి తెరపైకి వచ్చింది. ఓ వీడియో ద్వారా స్పందించింది. ఈ కేసుతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇంకా ఇంకెంతమంది బయటకు రావాల్సి వస్తుందో చూడాలి. అయితే మరోవైపు బాధితులు కూడా భారీగానే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు సమాచారం. వారి పేర్లు బయటపెట్టమని పోలీసులు చెప్పడంతో అతడి బాధితులు భారీగా ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది.

    మీ నగరం నుండి (విశాఖపట్నం)

    ఆంధ్రప్రదేశ్
    విశాఖపట్నం
    ఆంధ్రప్రదేశ్
    విశాఖపట్నం
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Crime, Crime news, Tiktok, Visakha, Visakhapatnam, Vizag

    తదుపరి వార్తలు