హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. వైజాగ్ వన్డే టికెట్స్‌పై కీలక అప్ డేట్..!

క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. వైజాగ్ వన్డే టికెట్స్‌పై కీలక అప్ డేట్..!

వైజాగ్ లో భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ టికెట్ల అమ్మకం

వైజాగ్ లో భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ టికెట్ల అమ్మకం

విశాఖపట్నం (Visakhapatnam) వేదికగా ఈ నెల 19న విశాఖపట్నంలో జరగనున్న భారత్ -ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ (India vs Australia ODI Match) ఆఫ్ లైన్ టికెట్లను నేటి నుండి విక్రయిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

విశాఖపట్నం (Visakhapatnam) వేదికగా ఈ నెల 19న విశాఖపట్నంలో జరగనున్న భారత్ -ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ (India vs Australia ODI Match) ఆఫ్ లైన్ టికెట్లను నేటి నుండి విక్రయిస్తున్నారు. ఆన్ లైన్లో ఈ నెల 10 నుంచే అందుబాటులో ఉంచగా.. ఆన్ లైన్లో నేటి నుంచి విక్రయిస్తున్నారు. ఆన్ లైన్లో టికెట్లు దొరకని వారికి ఈ అవకాశాన్ని కల్పించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association) సెక్రటరీ ఎస్. ఆర్. గోపినాథ్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆన్ లైన్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోవడంతో టిక్కెట్లు దొరకని వారు నిరాశకు లోనయ్యారు.

ట్విట్టర్ ద్వారా బీసీసీకి ఇదే విషయాన్ని అభిమానులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు అభిమానులకు శుభవార్తను అందించారు. ఈనెల 14న విశాఖలో మూడు ప్రాంతాలలో ఆన్ లైన్లో ద్వారా క్రికెట్ టిక్కెట్లను అమ్మకాలు చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి టికెట్ విక్రయాలు కొనసాగుతాయి. మధురవాడలో ప్రధాన క్రికెట్ స్టేడియం వెనుక బి. గ్రౌండ్ వద్ద, కొత్త రోడ్డు సమీపంలోని మున్సిపల్ స్టేడియం రాజీవ్ గాంధీ క్రీడా ప్రాంగణం వద్ద, గాజువాకలోని వికాస్ నగర్ వద్ద ఆఫ్ లైన్ లో టిక్కెట్ల విక్రయాలు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ఇది చదవండి: ఏపీని వ‌ణికిస్తున్న ఫ్లూ భ‌యం.. సర్వేలో సంచలన నిజాలు..!

విశాఖలో టికెట్ కౌంటర్ల వద్ద వేకువజాము నుంచే క్రికెట్ అభిమానులు బారులు తీరారు. టికెట్ల కోసం పలువురు మహిళలు పెద్ద ఎత్తున చంటి వచ్చారు. భారీగా తరలివచ్చిన క్రికెట్ అభిమానులతో క్రికెట్ విక్రయ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అన్ని కేంద్రాలు వద్ద రద్దీని నియంత్రించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుండి క్యూ లైన్ లో వుండి టికెట్లు దొరికిన అభిమానులు సందడితో ఇంటికి చేరుకుంటున్నారు.. ఇంకా టికెట్ల కోసం చాలామంది క్రికెట్ అభిమానులు క్యూలైన్లో నిలబడి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

First published:

Tags: Andhra Pradesh, India vs australia, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు