హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

నేలకూలే చెట్లకు ప్రాణం పోస్తున్నారు.. ఏకంగా బండరాళ్లతో వారధి కట్టేస్తున్నారు

నేలకూలే చెట్లకు ప్రాణం పోస్తున్నారు.. ఏకంగా బండరాళ్లతో వారధి కట్టేస్తున్నారు

విశాఖ

విశాఖ బీచ్‌లో కొబ్బరిచెట్లకు రక్షణ

విశాఖపట్నం (Visakhapatnam) సాగర తీరానికి మధ్యాహ్న సమయాల్లో కొద్ది సేపు సేదతీరడానికి అనువైన ప్రదేశం ఆర్కే బీచ్ (Vizag RK Beach).. పగటి వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పర్యాటకులు తీరానికి వచ్చే వారు కాదు , వచ్చినా ఇబ్బంది పడేవారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  విశాఖపట్నం (Visakhapatnam) సాగర తీరానికి మధ్యాహ్న సమయాల్లో కొద్ది సేపు సేదతీరడానికి అనువైన ప్రదేశం ఆర్కే బీచ్ (Vizag RK Beach).. పగటి వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పర్యాటకులు తీరానికి వచ్చే వారు కాదు , వచ్చినా ఇబ్బంది పడేవారు. పర్యాటకులకు ఉపశమనం కలిగించడమే కాకుండా తీరానికి కొత్త అందాలు అద్దాలనే ఉద్దేశంతో కొబ్బరిచెట్లు ఏర్పాటు చేశారు సన్ రే సంస్థ. సీఎస్ఆర్‌లో భాగంగా నగర శివారులో ఉన్న సన్‌ రే రిసార్ట్స్ అధినేత రాజాబాబు సామాజిక బాధ్యత కింద తాము వంద కొబ్బరిచెట్లు నాటి, తోటను పెంచుతామని జీవీఎంసీ అధికారులకు ప్రతిపాదనలు పంపి అదే విధంగా ఏర్పాటు చేశారు. ఈ కొబ్బరి చెట్లును పది నుంచి 15 ఏళ్ల వయసున్న సమయంలో వేళ్లతో తీసి లారీల్లో తీరానికి తీసుకొచ్చారు.

  బాగా పెరిగిన మొక్కను ఒక చోట నుండి వేరే చోట తీసుకువెళ్ళి నాటితే వాటికి భూమి నుంచి నీళ్లు, పోషకాలు అందేలోపే ఎండిపోతాయి చనిపోతాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొబ్బరి చెట్ల యొక్క మట్టలను 85 శాతం తీసేసారు. అలా వాటికుండే మట్టల నుంచి చెట్టులోని తేమ ఆవిరి పోకుండా నిరోధించారు. అదే సమయంలో ప్రతి కొబ్బరిచెట్టుకి గడ్డితో చేసిన తాడును చుట్టారు. వాటిని రోజు తడుపుతూ ఉంటే బీచ్‌లో ఆ చెట్టుకు అవసరమైన నీరందుతుంటుంది. చెట్టు ఆ ఇసుక ప్రాంతంలో బతకడానికి అవసరమైన అన్ని పోషకాలను కూడా ఇస్తున్నారు.

  ఇది చదవండి: అక్కడికి ఒక్కసారి వెళ్తే మీ ఇల్లు నందన వనమే..! అందుకే మహిళలు క్యూ కడతారు..!

  సాగర తీరంలో నందనవనంలా ఈ కొబ్బరి చెట్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇంతలో అలల ఉదృతకు భారీగా విశాఖ సాగర తీరం కోతకు గురవుతోంది. అందమైన ఆర్కేబీచ్‌లో కొబ్బరి చెట్లు నెల రాలుతున్నాయి. ఆర్ కె బీచ్ నుండి వై.ఎం.సి.ఎ వరకు ఉన్న బీచ్‌ని ఆస్వాదిస్తూ కొబ్బరి వనంలో ఆహ్లాదంగా పర్యాటకులు గడపేవారు. అయితే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కోతకు గురై కొబ్బరి చెట్లు పడిపోతున్నాయి. దీంతో స్పందించిన సన్ రే యాజమాన్యం గట్టి వారిదిలా రాళ్ళతో వేసి నేలకూలే చెట్లకు పునర్బలం అందిస్తున్నారు.

  ఇది చదవండి: కోర్కెలు తీర్చే కొంగు బంగారం కనకదుర్గ.. ఇంద్రకీలాద్రికి అంతటి విశిష్టత ఎందుకు..?

  గత వారం రోజులుగా బయట నుండి రాళ్ళు తీసుకువచ్చి చెట్లు ఉన్న ప్రాంతాల్లో సముద్రంకి చెట్లుకి మధ్య ఎక్కువ ఎత్తు ఉండే విధంగా రాళ్ళు వేసి మరలా ఇసుక కప్పెస్తున్నారు. దీంతో చెట్లకు మంచి రక్షణ అందుతుంది. చక్కటి ఆహ్లాద వాతావరణంలో కొబ్బరి చెట్లను సంరక్షించడం చాలా బాగుందని పర్యటకులు అంటున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు