హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఆ గ్రామంలోని వారికి ప్రభుత్వ పథకాలు కట్.. అధికారుల ఆదేశాలు.. కారణం ఇదే..!

Andhra Pradesh: ఆ గ్రామంలోని వారికి ప్రభుత్వ పథకాలు కట్.. అధికారుల ఆదేశాలు.. కారణం ఇదే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయనగరం జిల్లా (Vizianagaram District) సాలూరు మండలం శివాపురం గ్రామంలోని కొంతమంది ఖాతాల్లో గత ఏడాది డిసెంబర్లో అనుకోకుండా నగదు క్రెడిట్ అయింది. దీంతో వాళ్లంతా బ్యాంకుకు వెళ్లి డబ్బులు కూడా డ్రా చేసుకున్నారు. ఐతే ఏడాదిగా ఆ డబ్బుల కోసం అధికారులు గ్రామస్తులను అడుగుతూనే ఉన్నారు.

ఇంకా చదవండి ...

  సాధారణంగా ఏదైనా పని కావాలంటే ప్రజలు అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేయాల్సిఉంటుంది. చిన్నపని కోసం వెళ్లినా రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలాయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అదే దరఖాస్తులో ఏదైనా తప్పున్నా, సమాచారంలో లోపమున్నా.. మనకు జరగాల్సిన పనిపై ఆశలు వదులుకోవాల్సిందే. అదే అధికారులు తప్పుచేస్తే మాత్రం జనానికి అస్సలు భయపడరు. ఎంతపెద్ద తప్పుచేసినా క్షమించమని ఓ లేఖ ఇస్తే మొత్తం మాఫీ అయిపోయింది. ఐతే ప్రజల ఖాతాల్లో జమ చేయాల్సిన నగదు విషయంలో అధికారులు చేసిన పొరబాటు.. ఏడాదిగా ఓ గ్రామం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయనగరం జిల్లా (Vizianagaram District) సాలూరు మండలం శివాపురం గ్రామంలోని కొంతమంది ఖాతాల్లో గత ఏడాది డిసెంబర్లో అనుకోకుండా నగదు క్రెడిట్ అయింది. దీంతో వాళ్లంతా బ్యాంకుకు వెళ్లి డబ్బులు కూడా డ్రా చేసుకున్నారు. ఐతే ఏడాదిగా ఆ డబ్బుల కోసం అధికారులు గ్రామస్తులను అడుగుతూనే ఉన్నారు.

  గత ఏడాది డిసెంబర్లో శివాపురం గ్రామంలి 247 మంది ఖాతాల్లో రూ.13,500 చొప్పున నగదు జమయ్యాయి. తమ ఖాతాల్లో డబ్బులెందుకు పడ్డాయో తెలియక గ్రామస్తులు తికమకపడ్డారు. తొలుత అందరూ రైతు భరోసా (Raithu Bharosa Scheme) సొమ్ము పడిందని భావించారు. ఐతే వ్యవసాయ భూమి లేని వారి ఎకౌంట్లో కూడా నగదు జమ కావడం చర్చనీయంశమైంది. కొంత మంది నగదు జమ అయిన వ్యవహారాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా..కొంత మంది ఎందుకొచ్చి గొడవని సైలెంట్ గా ఉండిపోయారు. ఐతే దీనిపై అధికారులు విచారణ జరపగా.. కొదమ పంచాయతీలోని రైతుల ఖాతాల్లో జమకావాల్సిన నగదు.. పొరబాటున శివాపురం గ్రామస్తుల ఖాతాల్లో జమైనట్లు అధికారులు గుర్తించారు.

  ఇది చదవండి: కేంద్రాన్ని ఇరుకునపెట్టే పనిలో జగన్.. ఇకపై ఆ నినాదంతో ముందుకు.. అండగా థర్డ్ ఫ్రంట్..?


  ఐతే అప్పటి నుంచి ఆ నగదు తిరిగి ఇవ్వాల్సిందిగా అధికారులు గ్రామస్తులను కోరుతూనే ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 59 మంది డబ్బులు తిరిగివ్వగా... 188 మంది మాత్రం ఇంకా ఇవ్వలేదు. వారి నుంచి సొమ్ము రికవరీ చేసేందుకు ఏడాదిగా అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఇక చేసేదిలేక ఆ డబ్బు తిరిగి చెల్లించనివారికి పెన్షన్, రేషన్ తో పాటు నవరత్నాలు కింద అమలు చేసే పథకాలను నిలిపివేయాలని తహసీల్దార్ ఆదేశాలు జారీ చేశారు. అవి మరోగ్రామానికి చెందిన రైతులకు చెల్లించాల్సిన నగదు, పైగా అధికారుల పొరబాటు వల్ల జరగడంతో డబ్బులు తిరిగివ్వాలని వారికి విజ్ఞప్తి చేస్తూ వచ్చిన అధికారులు.. చేసేది లేక ప్రభుత్వ పథకాలు నిలిపేయాల్సిందిగా అదేసించాల్సి వచ్చింది. మరి ఇప్పుడైనా శివాపురం గ్రామస్తులు ఆ డబ్బులను తిరిగిస్తారో.. లేదో చూడాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Vizianagaram

  ఉత్తమ కథలు