హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: ఏయూ పరిధిలోని 18 డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు బ్రేక్‌..! కారణం ఏంటంటే..?

Vizag: ఏయూ పరిధిలోని 18 డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు బ్రేక్‌..! కారణం ఏంటంటే..?

ఏయూ పరిధిలోని 18 డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు బ్రేక్

ఏయూ పరిధిలోని 18 డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు బ్రేక్

Andhra University: డిగ్రీ చదువుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం కొంత మేరకు ఏయూ అనుసంధానం అయిన డిగ్రీ కళాశాలలు లేనందున సీట్లు కొరత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసుకుని ఏదో ఒక కళాశాలలో సీటు సంపాదించకపోతే కష్టమే.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

    Setti Jagadeesh, News 18, Visakhaptnam

    డిగ్రీ చదువుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం కొంత మేరకు ఏయూ అనుసంధానం అయిన డిగ్రీ కళాశాలలు లేనందున సీట్లు కొరత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసుకుని ఏదో ఒక కళాశాలలో సీటు సంపాదించకపోతే కష్టమే. అసలు ఈ డిగ్రీ కళాశాలలు ఎందుకు తగ్గాయి కారణం ఏంటో చూద్దాం. నిబంధనలు పాటించకుండా విది విధానాలకు విరుద్ధంగా నడుస్తున్న డిగ్రీ కళాశాలలపై ఉన్నత విద్యా శాఖ కొరడా బిగించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని 18 కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం అన్ని అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... రాష్ట్రవ్యాప్తంగా ఏయూ పరిధిలో అనేక డిగ్రీ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో ఆయా కళాశాలలో తనిఖీలు చేపట్టాలని ఆంధ్ర యూనవర్సిటీ ఉన్నత విద్యా శాఖ ఆదేశించింది.

    కొన్నిరోజుల కిందట వర్సిటీ అధికారులు బృందం తమ పరిధిలోని డిగ్రీ కళాశాలలను వర్చువల్‌ విధానంలో పరిశీలించి అన్నీ బాగానే ఉన్నాయంటూ ఉన్నత విద్యాశాఖకు నివేదిక సమర్పించారు. అయితే, లోపాలున్న కళాశాలలను గుర్తించకపోవడం పట్ల ఆ బృందంపై వర్సిటీ అధికారులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ... మరోసారి తనిఖీలు నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది. దీంతో మళ్లీ ప్రత్యేక బృందాలను నియమించి ఆయా కాలేజీలను అధికారులు తనిఖీ చేయగా, కొన్ని డిగ్రీ కళాశాలు నుండి పలు లోపాలు బయటపడ్డాయి.

    ఇది చదవండి: ఈ చిన్నారి మల్టి టాలెంట్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కాకినాడ నుంచి అంతర్జాతీయ స్థాయికి..!

    ఏయూ పరిధిలో 168 కళాశాలలకుగాను 78 కాలేజీల్లో లోపాలు వున్నట్టు గా ఆ ప్రత్యేక బృందం గుర్తించింది. వర్సిటీ ఉన్నత విద్యా శాఖ నిబంధనల ప్రకారం.., డిగ్రీ కళాశాల నిర్వహణ చేసేటప్పుడు కనీసం ఎకరా స్థలం ఉండాలి. అలాగే తరగతుల నిర్వహణకు అనుగుణంగా తరగతులు గదులు, బోధన సిబ్బంది ఆశించిన స్థాయిలో ఉండాలి. ఇంకా ప్రిన్సిపాల్స్‌, గ్రంథాలయం, ఇతర మౌలిక వసతులు కలిగి ఉండాలి.

    ఇది చదవండి: అందమైన బుట్ట బొమ్మలు..! మనసును దోచే వయ్యారిబొమ్మలు..! కావాలంటే అక్కడికెళ్లాల్సిందే..!

    అయితే ఇవన్నీ ప్రత్యేక బృందం వెళ్ళినప్పుడు అనేక కాలేజీల్లో ఆశించిన స్థాయిలో సిబ్బంది లేకపోవడం, కొన్ని కాలేజీలకు ఎకరా స్థలం లేకపోవడం వంటి అంశాలను తనిఖీల్లో గుర్తించి ఆ బృందం ఉన్నత విద్యాశాఖకు నివేదించింది. ఉన్నత విద్యా శాఖ ఆదేశాల మేరకు ఆయా కళాశాలలకు షోకాజ్‌ నోటీసులను జారీచేశారు. లోపాలను సరిదిద్దుకునేందుకు కొంత గడువు ఇచ్చారు. అలా గడువు తేదిలోగా సరిచేసుకున్న కళాశాలల వివరాలను ఉన్నత విద్యా శాఖకు పంపించారు. ముందుగా గుర్తించిన 78 కాలేజీల్లో 60 కాలేజీలు లోపాలను సవరించుకోగా, మిగిలిన 18 కాలేజీలు హెచ్చరించినా ఎటువంటి చర్యలను చేపట్టలేదు. దీంతో ఆయా కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్లు నిలిపివేయాలని వర్సిటీ ఉన్నత విద్యా శాఖ ఆదేశాలు జారీచేసింది.

    ఇది చదవండి: ఏపీలో మహీష్పతి సామ్రాజ్యం.. అప్పటి ఆలయం ఇంకా ఉంది.. మీరూ చూస్తారా..?

    ఈ మేరకు ఈ సంవత్సరం అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ జాబితా నుంచి సదరు కాలేజీలను అన్నిటిని అధికారులు తొలగించారు. ఈ విధంగా ఏయూ పరిధిలోని ఉన్న 18 కాలేజీల్లో ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోనుంది. ఇందులో వున్న కళాశాలలు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15-16, విజయనగరం జిల్లాలో రెండు, మూడు కళాశాలలు ఉన్నట్టు తెలిసింది.

    వచ్చే ఏడాది నాటికి హెచ్చరించిన ఆయా లోపాలను సరిచేసుకుంటే మళ్లీ అడ్మిషన్లకు అవకాశం ఇస్తారు. లేనిపక్షంలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కోర్సు అంతా పూర్తయిన తరువాత ఆయా కాలేజీల గుర్తింపును పూర్తిగా రద్దు చేయనున్నారు. కళాశాలలపై చర్యలు అనే అంశాన్ని ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో పెట్టి ఆమోదం తీసుకోనున్నట్టు ఏయూ కాలేజీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (సీడీసీ) డీన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌ సత్యనారాయణ తెలిపారు.

    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra university, Local News, Visakhapatnam

    ఉత్తమ కథలు