విశాఖలో రుషికొండ మరోసారి పచ్చగా మారిపోయింది. బయటకు బహిరంగంగా కనిపించే రుషికొండ విషయంలోనూ అదే చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నయి. రుషికొండపై గతంలో ఉన్న రిసార్టును కూలగొట్టి కొండను తవ్వేసి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. కొండను తవ్వేయడం నిబంధనలకు విరుద్ధమని.. అనుమతించిన దాని కన్నా ఎక్కువ తవ్వేశారని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన హైకోర్టు ఐదుగురు కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో కమిటీని నియమించాలని ఆదేశించింది.
దీంతో కొందరు అధికారులు తవ్వేసిన చోట కనిపించకుండా దానిపై గ్రీన్ మ్యాట్లు పరిచేశారు. రుషికొండ అంతా పచ్చగా కనిపించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తవ్వేసిన చోట మొత్తం తవ్వినట్లుగా కనిపించకుండా గ్రీన్ కార్పెట్‌ను అధికారులు రాత్రికి రాత్రి పరిచేశారు. గతంలో తవ్విన చోట.. తవ్వినట్లుగా స్పష్టంగా కనిపించేది. కానీ ఈ గ్రీన్ కార్పెట్ ను ఇలా పరిచేయడం వల్ల దూరం నుంచి చూసిన వారికి కొండ అంతా పచ్చగా కనిపిస్తోంది. అయితే ఇలా ఎందుకు చేశారన్న దానిపై అధికారవర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. తవ్వేసిన కొండ ను గ్రీన్ కార్పెట్‌తో కవర్ చేయడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
రుషికొండపై గతంలో ఉన్న రిసార్టును కూలగొట్టి కొండను తవ్వేసి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలు సీఎం క్యాంప్ ఆఫీస్ అన్న ప్రచారం జరుగుతోంది. అవి సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయాలు అయితే తప్పేంటి అని బొత్స సత్యనారాయణ కూడా ఓ సారి ప్రకటించడంతో వాటి నిర్మాణం అందుకే అనుకుంటున్నారు. అయితే కొండను తవ్వేయడం నిబంధనలకు విరుద్ధమని.. అనుమతించిన దాని కన్నా ఎక్కువ తవ్వేశారని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
విచారణ జరిపిన హైకోర్టు ఐదుగురు కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో కమిటీని నియమించాలని ఆదేశించింది. సమగ్ర సర్వేకు నియమించే బృందంలో ఐదుగురు సభ్యులను నియమించాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అక్రమ తవ్వకాలను నిగ్గు తేల్చేందుకు సమగ్ర సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. జనవరి 31 లోపు నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Visakhapatnam, Vizag