హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: ఆంధ్ర యూనివర్సిటీలో దుకాణాలు నేలమట్టం.. బాధితుల కన్నీరు మున్నీరు

Vizag: ఆంధ్ర యూనివర్సిటీలో దుకాణాలు నేలమట్టం.. బాధితుల కన్నీరు మున్నీరు

X
ఏయూ

ఏయూ సమీపంలో షాపులు కూల్చేసిన అధికారులు

విశాఖపట్నం (Visakhapatnam) లోని జోన్-3 పరిధిలో గల మూడవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో గల కరకచెట్టు పోలమాంబ సమీపంలో గల సుమారు 70 సంవత్సరాల నుండి నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్న 25 షాపులు, కార్ షెడ్లు, గ్యారేజ్, చికెన్ షాపులు, టి దుఖానాలు, టిఫిన్ అర్ధరాత్రి కూల్చివేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam | Andhra Pradesh

Setti Jagadeesh, News 18, Visakhapatnam

విశాఖపట్నం (Visakhapatnam) లో చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేత కలకలం సృష్టించింది. అర్థరాత్రి తర్వాత మూడో పట్టణ పోలీసు స్టేషన్ మార్గంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయం వసతి గృహాల సమీపంలో పోలీసు బందోబస్తు. మధ్య సాగిన విధ్వంసం వివాదాస్పదంగా మారింది. బాధితులకు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయలేదు. కనీసం ఆయా దుకాణాల్లోని సామగ్రిని భద్రపరచుకోవడానికైనా సమయం ఇవ్వలేదు. జేసీబీలతో దుకాణాలను నేలమట్టం చేయడంతో సామగ్రి ఎందుకూ పనికిరాకుండా పోయింది. విశాఖపట్నంలోని జోన్-3 పరిధిలో గల మూడవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో గల కరకచెట్టు పోలమాంబ సమీపంలో గల సుమారు 70 సంవత్సరాల నుండి నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్న 25 షాపులు, కారుషెడ్లు, గ్యారేజ్, చికెన్ షాపులు, టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, వాటి యజమానులు, పనివారి గృహాలను ఏయూ అధికారులు, పోలీసులు, జీవిఎంసి అధికార యంత్రాంగం సంయుక్తంగా కూల్చివేసింది. ఉదయం లేచి చూసేసరికి వారి దుకాణాలన్నీ నేలమట్టమయ్యాయి. ఏమి చేయాలో దిక్కుతోంది స్థితిలో బాధితులు ఉండిపోయారు. ముందస్తుగా ఫిర్యాదులు ఇస్తే కనీసం సామాన్లు అయినా భద్రపరుచుకునే వాళ్ళు మని బాధితులు వాపోతున్నారు.

బాధితురాలు సూర్యకాంతం.., తన తండ్రి అప్పారావు 70 ఏళ్ల కిందట సుప్రీంకోర్టువరకు వెళ్లి ఈ స్థలం పై పోరాడి భూమిని దక్కించుకున్నారు. నా వాటా 350 చదరపు గజాలు అప్పట్లో ఇచ్చారు. అందులో ఇప్పుడు రెండు దుకాణాలు వేసుకున్నాను. ఏ పని చేసుకోలేక ఈ వయసులో నా కుమార్తె దగ్గర ఉంటూ ఆ దుకాణాల మీద వచ్చే అద్దెలతోనే జీవిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్న భూమిని ఆక్రమణ అంటుంటే ప్రాణాలు పోయేలా ఉన్నాయనిఆవేదన చెందుతున్నారు.

ఇది చదవండి: మోదీ టూర్ ఎఫెక్ట్..! విశాఖ ఎలా మారిపోయిందో చూడండి..!

70 ఏళ్ల నుండి స్థానికంగానే ఉంటున్నమంటు మరోబాధితురాలు పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1998వ సంవత్సరంలో ఈ స్థలంపై ఆంధ్ర యూనివర్సిటీ అధికారులకు తమకు కోర్టులో విచారణ నడిచిందని, ఆ విచారణలో కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిందని, ఈ స్థలంపై హక్కులన్నీ తమకే ఉన్నాయని, కోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి విధ్వంసానికి పాల్పడటం సరైనది కాదని అంటున్నారు. దీనిపై మరొకసారి కోర్టుకు వెళ్లి పోరాటం చేస్తామని అన్నారు. రాజకీయ నాయకుల మాటలు విని జివిఎంసి కమీషనర్ కూడా ప్రభుత్వానికి వత్తాసు పలకడం సరైన పద్దతి కాదనిఅన్నారు.

: ప్రభుత్వంపై నమ్మకం పోయిందా..? గిరిజనులు చేసిన పని అలాగే ఉంది..!

జోన్ 3 పరిధి స్థానిక టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ... దుకాణాల కూల్చివేత ఘటన ప్రదేశానికివెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూల్చివేతల వెనుక రాజ్యసభ సభ్యులు విజయ్ సాయిరెడ్డి, ఏయూ వీ.సి. ప్రసాద్ రెడ్డిహస్తం ఉందని ఆరోపించారు. అంతే కాకుండా ఏపీ సీఎం జగన్ ప్రశాంత విశాఖ నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని, ప్రధాన మోదీసభ పేరు చెప్పి సామాన్యుల జీవనోపాధిపై దెబ్బ కొట్టడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.

ఎక్కడో ఇంజనీరింగ్ మైదానంలో సభ అయితే పెదవాల్తేర్ ఇళ్ళ కుల్చివేతలు చేశారో అర్ధంకావడం లేదని, ఈ కూల్చి వేతలతో విజయసాయి రెడ్డి మరో భూ కుంభ కోణానికి తెరలేపారని అన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, ఇల్లు కూల్చివేస్తున్న సమయంలో వారి సామాన్లు కూడా బయటకు తీసుకొని రావటానికి అనుమతించకుండా  దౌర్జన్యంగా కూల్చివేసారని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ద్వారా సుమారు 100 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.వీరికి తెలుగుదేశం అండగా ఉంటుందని, తమ పార్టీ ద్వారా బాధిత కుటుంబాలకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని వెలగపూడి రామకృష్ణ బాబు తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు