హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tigers: ఏపీలో పెరుగుతున్న పులుల సంఖ్య.. ఎన్ని ఉన్నాయంటే..

Tigers: ఏపీలో పెరుగుతున్న పులుల సంఖ్య.. ఎన్ని ఉన్నాయంటే..

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

Tigers: పెద్దపులి. ఈ పేరులోనే గొప్పతనం.. నడకలో రాజసం.. వేటలో గాంభీర్యంతో అడవికి రారాజుగా వెలుగొందే పెద్ద పులుల అంటే అందరికీ మక్కువ.

M.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

పెద్దపులి. ఈ పేరులోనే గొప్పతనం.. నడకలో రాజసం.. వేటలో గాంభీర్యంతో అడవికి రారాజుగా వెలుగొందే పెద్ద పులుల అంటే అందరికీ మక్కువ. ఇక ఈ పులుల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన వెరసి పెద్ద పులులు ఊపిరి తీసుకుంటూ సంతానాన్ని పెంచుకుంటున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా.. పశ్చిమ గోదావరి జిల్లా పాపికొండలు అభయారణ్యం పరిధిలోనూ వాటి కదలికలు మెరుగుపడ్డాయి. వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 3,900 పులులు మాత్రమే మిగిలి ఉండగా.. మన దేశంలో 2,967 పులులు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని 80 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయి. వాటి సంఖ్య మన రాష్ట్రంలో క్రమంగా పెరుగుతుండటం విశేషం.

నల్లమలలో..!

మన రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ దేశంలోనే అతి పెద్దది. ప్రస్తుతం ఇక్కడ 63 పులులను కెమెరా ట్రాప్‌ ద్వారా గుర్తించారు. దీనిని బట్టి వీటి సంఖ్య 80 వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2014లో కేవలం 40 పులులు మాత్రమే ఉండగా.. ఏడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపైంది. నల్లమల అడవుల నుంచి శేషాచలం అడవుల వరకు పులులు విస్తరించాయి. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు భద్రాచలం వరకు విస్తరించి ఉన్న పాపికొండలు అభయారణ్యం పరిధిలోనూ పులుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతంలో నాలుగు పులులు, ఐదు చిరుత పులులను అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం 1973 నుంచి ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ పేరుతో వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టింది. ఫలితంగానే దేశంలో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నాయి.

Tigers, Tigers reserve Forest, Number of Tigers, Wild Animals in Andhra Pradesh, Andhra Pradesh Forest department, Forests in Andhra Pradesh, Nallamala Forest, Papikondalu Forest, Royal Bengal Tigers, Andhra Pradesh Government, Andhra Pradesh News, Andhra News, AP News, Telugu News, పులులు, పెద్దపులులు, ఆంధ్రప్రదేశ్ లో పులుల సంఖ్య, అడవి జంతువులు, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, నల్లమల అడవులు, పాపికొండలు అడవలు, రాయల్ బెంగాల్ టైగర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, తెలుగు వార్తలు, ఏపీ వార్తలు
ఏపీలో పెరుగుతున్న పులుల సంఖ్య

జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్న పులులకు మన రాష్ట్రంలోని పాపికొండల అభయారణ్యం ఆవాసంగా మారింది. అభయారణ్యం పరిధిలోని ఉభయ గోదావరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరిధిలో 1,012.86 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 1,01,200 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని అభయారణ్యంగా 2008లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో జాతీయ పార్కు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మరోవైపు వన్యప్రాణుల సంరక్షణపై అటవీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మ గుడి ప్రాంతంలోని గోగులపూడి, పోలవరం మండలం టేకూరు ప్రాంతాల్లో బేస్‌ క్యాంపులు ఏర్పాటయ్యాయి. అభయారణ్యం సంరక్షణ, జంతువుల జాడ కోసం ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలవరం మండలం టేకూరు ప్రాంతాల్లో బేస్‌ క్యాంపులు ఏర్పాటయ్యాయి. అభయారణ్యం సంరక్షణ, జంతువుల జాడ కోసం ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Nallamala forest, Tigers

ఉత్తమ కథలు