P Anand Mohan, Visakhapatnam, News18.
No Fish Hunting: సముద్ర చేపలను ఇష్టంగా తింటారా..? (Sea Food Lovers) అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్.. సీ ఫుడ్ లవర్స్ కు మాత్రమే కాదు.. మత్స్యకారులకు (Fisherman) ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.. సముద్ర చేప (Sea Fish) ఇక దొరకదు.. అయితే ఇది తాత్కాలిక విరామం మాత్రమే.. ఎందుకు అంటే.. సముద్రంలో చేపల వేట నిషేధం అమలు కానుంది. ఒకటి రెండు రోజులు కాదు.. దాదాపు రెండు నెలల పాటు.. చేపల వేటపై నిషేదం ఉంది.. అంటే ఈ నెల 15 నుంచి జూన్ 22 వరకూ సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలా నిషేధం విధించడానికి పెద్ద కారణమే ఉంది.
ఎందుకంటే.. సాధారణంగా చేపలు గుడ్లు పెట్టే సీజన్ కావడంతో ఈ 61 రోజుల పాటు మర, మోటారు బోట్లతో వేటకు వెళ్లకూడదు. మత్స్య సంపద వృద్ధికి ఇది చాలా అవసరం అంటున్నారు. అందుకే ప్రతి ఏడాది ప్రభుత్వం ఈ ఆదేశాల్ని జారీ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం నాటు పడవల్లో కూడా వేట నిషేధం అమలు చేయనున్నారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారులు ఉపాధి కోల్పోనున్నారు.
విశాఖ జిల్లా (Visakha) తో పాటు ఉత్తరాంధ్ర (Utharandhra) ప్రాంతంలోని విజయనగరం (Vizianagaram) శ్రీకాకుళం (Srikakulam), ఇటు తూర్పు గోదావరి (East Godavari), పశ్చిమగొదావరి జిల్లా (West Godavari) ల్లో తీర ప్రాంతం ఉంది. వందల కిలోమీటర్ల పొడవునా సుదూర సముద్ర తీరముంది. దాదాపు యాభై మండలాల్లో 400పైనే మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో మెకనైజ్డ్ బోట్స్, సంప్రదాయ తెప్పలు ఎక్కువ.
ఇదీ చదవండి : టీటీడీకి భారీగా విదేశాల్లో భూములు.. ఎన్ఆర్ఐలు సిద్ధం.. మరి పాలకమండలి నిర్ణయం ఏంటి.
ఇక విశాఖ కాకినాడ హార్బర్ల (Kakinada harbour)లో మరబోట్లు.. ఇతరత్రా భారీ సైజు బోట్స్ లాంచిలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో ఒక్క సంప్రదాయ మత్స్యకారులు తప్ప.. ఇతరులు ఎవరూ వేటకు వెళ్లే అవకాశం ఉండదు ఈ రెండు నెలలు.. ఏపీ మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్ -1995 (AP Marin fishing regulation act-1995) ప్రకారం.. వేట నిషేధ సమయంలో సముద్రంలోకి ఎటువంటి బోట్లు అనుమతించరు. అంటే లోతైన సముద్రజలాల్లో వేటకు వెళ్లే మెకనైజ్డ్ బోట్లు, మోటరైజ్డ్ బోట్లు, నాన్ మోటరైజ్డ్ బోట్లతో సాగించే చేపలవేటకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తారు.
ఇదీ చదవండి : మంత్రి పదవులు ఇచ్చినా అసంతృప్తే.. సీనియర్ల అలకపాన్పుకు కారణం అదేనా..?
ఈ సమయంలో సముద్రంలో చేపలు గుడ్లుపెట్టి తమ సంతతిని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తాయి. అందుకే ఈ సమయంలో వేటను విరమిస్తూ వస్తున్నారు. రాబోయే కాలంలో నిర్వహించే చేపలవేటలో పుష్కలంగా మత్స్యసంపద లభిస్తుందని అంచనా వేస్తున్నారు. వేట నిషేధం సరే.. మరి ఈ సమయంలో ఇదే వృత్తిని నమ్ముకుని జీవించే వారి పరిస్థితి ఏంటి. వేటను పక్కన పెట్టి ఇళ్ల దగ్గరే ఉండిపోయే మత్స్యకారుల కడుపు నిండేది ఎలా? అయితే అలాంటి వారిని ఆదుకోవడానికి వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ఒక్కో కుటుంబానికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. (AP Government)
ఈ పరిహారం ఎవరికి లభిస్తుంది. నిబంధనలు ఏం చెబుతాయి. అధునాతనమైన యాంత్రిక పడవలు, వెసల్స్‌లో పనిచేసే వారిలో ఒక్కోదానిలో ఎనిమిది మందికి ప్రభుత్వం ఈ పరిహారాన్ని అందిస్తోంది. అలాగే ఆయిల్ ఇంజను బోట్లు, తెప్పల ద్వారా మర పడవల్లో వేట సాగించే వారిలో ఒక్కో దానిలో ఆరుగురుకి ఈ పథకం వర్తిస్తుంది. తెరచాప సాయంతో రెక్కల కష్టంతో సంప్రదాయక కుట్టు పడవల్లో వేటచేసే వారిలో ముగ్గురికి నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈ నెల 20, 21 తేదీల్లో నవశకం సర్వే వివరాలు పరిశీలించి, 22, 23 తేదీల్లో సంబంధిత సచివాలయాల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. 25న ఆన్‌లైన్‌లో వివరాలను అప్‌లోడ్ చేస్తారు. మే 18న మత్స్యకారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు భరోసా మొత్తం జమ అవుతుంది.
ఈ పరిహారం మత్స్యకారులు అని చెప్పుకునే అందరికీ వర్తించింది. చేపలవేట కోసం తమ శాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న యాంత్రిక, మర, సంప్రదాయక పడవలకు మాత్రమే పరిహారం సొమ్మును అందిస్తాం. నిషేధం అమల్లోకి వచ్చే నాటికి ఆయా బోట్లని సంబంధిత ఫిషింగ్‌హార్బర్‌తోపాటు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లకు తీసుకొచ్చి లంగర్లు వేయాలి. పరిహారం కోసం నిర్దేశించిన 10వేల రూపాయల ఆ నగదును ఆయా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు అధికారులు. మహోన్నత ఉద్దేశంతో చేపడుతున్న మత్స్యవేట నిషేధాన్ని పక్కాగా అమలయ్యేందుకు ఆయా మత్స్యకారులు తమకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : థ్యాంక్స్ గివింగ్ నోట్ ఇస్తే.. రాజీనామా అన్నారు.. మాజీ హోం మంత్రి క్లారిటీ
విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే.. యాంత్రిక పడవలు 739, మరపడవలు 3,338, సంప్రదాయ పడవలు 907, వీటిమీద జీవనం సాగిస్తున్న మత్స్యకారుల సంఖ్య 28 వేల661 మందిగా రికార్డుల్లో ఉంది. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నవారికి మాత్రమే ఈ పరిహారం అందుతుంది. అప్పటికే ప్రభుత్వ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి అకౌంట్లు ఉంటాయి కాబట్టి నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకే ఈ నగదు జమ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Fish, Fishermen, Visakhapatnam, Vizag