Andhr Pradesh: అమానుషం.. క్యాష్ పేమెంట్ చేయలేదని ప్రాణం తీశారు?.. మరీ ఇంత కాసుల కక్కుర్తా?

క్యాష్ పేమెంట్ చేయలేదని ప్రాణం తీశారు

ప్రాణాలు పోయాల్సిన ఆస్పత్రులే కొన్ని మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కాసుల మీద ఉన్న కక్కుర్తితో మనుషులు ఎలా పోతే మాకేంటి అనుకుంటున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళ రోగి బంధువులు క్యాష్ పేమెంట్ చేయలేకపోయిన కారణంగా ఆమె మరణించింది.

  • Share this:
    అసలే ఒక వైపు కరానో కాటేస్తోంది. సెకెండ్ వేవ్ రూపంలో మనుషుల ప్రాణాలను తీసేస్తోంది మాయదారి కరోనా. రోజు రోజుకూ పెరుగుతున్న కేసలు, మరణాలతో ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటూ బ్రతుకుతున్నారు. ప్రస్తుతం కరోనా పేరు వినగానే ప్రజల్లో ఒకరకమైన భయం మొదలవుతోంది. కరోనా మరణాల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపించడంతో భయం ఇంకాస్త రెట్టింపు అవుతోంది. ప్రజల్లో ఉన్న ఈ భయాన్ని కొన్ని ఆసుపత్రులు, టెస్టింగ్ సెంటర్లు క్యాష్ చేసుకుంటున్నాయి.

    కరోనా కష్ట కాలంలో దేవుడిలా ఆదుకోవాల్సిన కొన్ని ఆస్పత్రులు కాసుల కక్కుర్తి కారణంగా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వాలు కరోనా చికిత్స విషయంలో అన్ని ఆసుపత్రులు చాలా ఉదారంగా వ్యవహరించాలని హెచ్చరించినా.. ప్రైవేటు ఆస్పత్రులు వాటిని చెవకి ఎక్కించుకోవడం లేదు. చాలా మంది కార్డులు పట్టుకుని వైద్యానికి వస్తే కుదరదని చెప్పేస్తున్నారు. తమ వద్ద డబ్బు లేదని డిజిటల్ పేమెంట్ చేస్తామన్నా వినిపించుకోవడం లేదు. ఓన్లీ క్యాష్ అంటూ రోగిని ఆసుపత్రి ఎదుటే నిలిపివేసి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

    ఆస్పత్రి సిబ్బంది కచ్చితంగా క్యాష్ కట్టమని చెప్పడంతో.. రోగి వెంట వచ్చిన వారు డబ్బుల కోసం ఏటీఎంల చుట్టూ తిరిగుతుండగానే ఆసుపత్రి ఎదుటే ఆ రోగి ప్రాణం పోయింది. ఈ అమానవీయ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. రాజాంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇటీవల కరోనా సోకిన అంజలి అనే మహిళను జిల్లాలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. కరోనా చికిత్స కోసం వచ్చిన మహిళను ముందుగా డబ్బు కట్టాలని ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేసింది. రోగి బంధువులు తమ వద్ద క్యాష్ లేదని డిజిటల్ పేమెంట్ చేస్తామని బ్రతిమాలినా కేవలం నగదు మాత్రమే తీసుకుంటామని ఆసుపత్రి సిబ్బంది ఖరాకండీగా చెప్పేశారు. క్యాష్ తెచ్చిన తరువాత తీసుకుని.. ముందు రోగిని ఆస్పత్రిలో చేర్చుకున్నా సరిపోయేది. కానీ రోగిని ఆసుపత్రి బయటే ఉంచారు. బంధువులు డబ్బు కోసం ఏటీఎంకు వెళ్లి వారు వచ్చే వరకు అటువైపు ఎవరూ చూడలేదు.

    ఇదీ చదవండి : కరోనా నిర్ధారణ అయ్యిందా? పాజిటివ్ లక్షణాలు ఉన్నాయా? ఇలా చేయండి. భయం వద్దు

    శ్రీకాకుళం టౌన్ లో మధ్యాహ్నం తర్వాత లాక్ డౌన్ నడుస్తుండడంతో ఏటీఎంలలో నగదు అయిపొయింది. దీంతో పరుగుల మీద వారు ఏటీఎంల చుట్టూ తిరుగుతునే ఉన్నారు. మూడు గంటల సమయం గడిచినా నగదు దొరకలేదు. డబ్బులు క్యాష్ రూపంలో కట్టలేదనే కారణంతో రోగిని ఆసుపత్రిలో చేర్చుకోలేదు. దీంతో రోగి మూడు గంటలపాటు నడి రోడ్డుపై తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంది.. చివరికి ఆ మహిళా పేషేంట్ నడిరోడ్డుపైనే ప్రాణాలు విడిచింది. కనీసం ఊపిరి పోయిన తరువాత కూడా మృతదేహాన్ని తరలించడానికి కూడా ఆసుపత్రి సిబ్బంది ముందుకు రాకపోవడం దారఉణం. కరోనా భయంతో చుట్టుపక్కల ప్రజలు కూడా ఎవరూ ముందుకురాలేదు. ఆసుపత్రి సిబ్బంది వల్లే తమ మనిషి చనిపోయిందంటూ రోగి బంధువులు ఆవేదన స్థానికంగా అందరినీ కలచివేసింది. 108కు కాల్ చేసినా స్పందించలేదంటూ ప్రభుత్వంపై కూడా మండిపడుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published: