• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • VISAKHAPATNAM NEW TWIST IN VISAKHAPATNAM SIX FAMILY MEMBER MURDER CASE ONE CRORE OFFER TO POLICE VZM NGS

Visakhaptnam: పోలీసులకు కోటి ఆఫర్. విశాఖలో ఆరుగురి హత్య కేసులో కొత్త ట్విస్ట్

పోలీసులకు కోటి ఆఫర్ చేసిన విశాఖలో ఆరుగురుని హత్య చేసిన నిందితుడు అప్పలరాజు

విశాఖపట్నంలో ఆరుగురు కుటుంబ సభ్యులను హత్య చేసిన ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అప్పలరాజు కూతురి పెళ్లికి అడ్డుపడుతుండడమే ఈ హత్యలకు ప్రధాన కారణం అంటున్నారు. మరోవైపు తనను ఒక గంట పాటు వదిలిస్తే కోటి ఇస్తాను అంటూ నిందితుడు చెప్పడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.

  • Share this:
    విశాఖలో నరమేధం విషాద చాయలు ఇంకా వీడలేదు. నగరం ఇంకా ఉలిక్కిపడేలా చేస్తోంది. ఒకరు ఇద్దరు కాదు.. ఆరుగురు. అది కూడా ఒకే కుంటుబానికి చెందిన వారు. అందులో ఆరు నెలల పసిపాప, రెండేళ్ల బాలుడు కూడా ఉన్నారు. అయినా కనికరం చూపలేదు నరరూప రాక్షసుడు అప్పలరాజు. కసితో రగిలోపోయి మారణహోమానికి తెరలేపాడు. ఈ కేసుకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. మొదట అక్రమ సంబంధమే ఈ హత్యలకు కారణమని భావించినా.. తరువాత ఆస్తి గొడవలు ఉన్నట్టు గుర్తించారు. తరువాత విజయ్ కుమార్ భార్య వెటకారపు నవ్వే తనలో కసి పెంచిందంటూ నిందితుడు చెబుతున్నాడు. మరోవైపు ఈ ఆరుగురి హత్య కేసులో అప్పలరాజుతో పాటు మరికొందరు కూడా ఉన్నారని విజయ్ అనే వ్యక్తి ఆరోపిస్తూ దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కథలో నిందితుడు అప్పలరాజు పోలీసలకు కోటి రూపాయాలు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

    సినిమాల్లో మాదిరి.. ఆరుగురిని హత్య చేసిన తరువాత కూడా అప్పలరాజులో కసి తగ్గినట్టు లేదు. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు ఇంకా కసితోనే మాట్లాడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు అసలు తాను హత్య చేయాలని అనుకున్నది విజయ్ ని అని.. అతడు ఇంకా బతికే ఉన్నాడని పోలీసులతో అన్నట్టు సమాచారం. అందుకే తనను ఒక గంట పాటు వదిలేస్తే తిరిగి వచ్చి లొంగిపోతానని.. ఆ సమయంలో విజయ్ ను కూడా హత్య చేసి వస్తానని.. అలా తనను వదిలినందుకు కోటి రూపాయలు ఇస్తానంటూ వింత డిమాండ్ పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో షాక్ తిన్న పోలీసులు అతడిని ఏమాత్రం కదలకుండా మరింత భద్రత మధ్య పెట్టారు. అసలు అతడిలో అంత కసి ఎందుకు వచ్చిందనే కోణంలో కేసును విచారిస్తున్నారు.

    అసలు ఆరుగురుని తాను హత్య చేయడానికి విజయకిరణ్ కారణమని నిందితుడు చెబుతున్నాడు. విజయవాడ నుంచి విజయ్‌కిరణ్‌ అనే వ్యక్తి పెందుర్తి మండలం జుత్తాడ వచ్చాడని తెలియడంతోనే అప్పలరాజు కత్తి తీసుకొని వారింటికి వెళ్లినట్టు తెలుస్తోంది. తన కుమార్తెకు పెళ్లి కాకుండా విజయ్ కుమార్ అడ్డుపడుతున్నాడని.. అందుకే అతడి కుటుంబంలో ఎవరినీ వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతో కనిపించిన వారిని కనిపించినట్టుగా నరికేశాడని నిందితుడు పోలీసులు చెప్పినట్టు సమాచారం.

    తాను హత్య చేయడానికి అక్కడకు వెళ్లిన తరువాత విజయ్ కిరణ్ కనిపించకపోవడం.. అతడి భార్య వెటకారంగా నవ్వడంతో తనలో మరింత కసి పెరిగింది అంటున్నారు. అయితే సాయంత్రం విజయవాడ నుంచి విజయ్‌కిరణ్‌ వచ్చాడని పోలీసు మాటల ద్వారా విన్న నిందితుడు. తనను ఒక్క గంట వదిలిపెట్టండి. కోటి రూపాయలు ఇస్తాను. వాడిని కూడా వేసేసి వచ్చి మళ్లీ లొంగిపోతా అంటూ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో అతడి మానసిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది అంటున్నారు పోలీసులు.

    తాజాగా మరో కొత్త కోణం ఈ కేసులో వెలుగులోకి వస్తోంది. స్థానికులు చెబుతున్నదాన్ని బట్టి అప్పలరాజు స్థానికంగా ఎవరైనా సాయం కోరి వస్తే ఆదుకుంటాడని.. చాలా మంచిగా ఉండేవాడని చెబుతున్నారు. అయితే తన కుమార్తెను విజయ్‌కిరణ్‌ మభ్యపెట్టి లొంగదీసుకున్నాడని.. అంతే కాకుండా ఆమె ద్వారా అతడి కుటుంబ సభ్యులంతా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని అప్పలరాజు అనుమానం పెంచుకున్నడాని అదే విషయంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని కొందరు స్థానికులు చెబుతున్నారు. మూడేళ్ల కిందట ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు అంటున్నారు. తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు వస్తుంటే...వారే చెడగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంలో విజయ్ కిరణ్ భార్య కూడా ఎదురు కేసులు వేయడంతో.. ఆ కేసులో కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తున్నదనే అసహనం కూడా పెరిగిపోయింది. తప్పుచేసిన వారు బాగుండగా, అడపిల్ల తండ్రిగా తనకు ఆవేదన మిగిలిందనే బాధ అప్పలరాజులో ఎక్కువగా ఉండేదని, అందుకే ఆ కుటుంబంపై అంత కక్ష పెంచుకున్నాడని స్థానికులు అంటున్నారు.
    Published by:Nagesh Paina
    First published: