Setti Jagadesh, News18, Visakapatnam
విశాఖపట్నంలో ఏటా డిసెంబర్ 4న నేవీ డే(Navy Day) అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈవిన్యాసాలు అందరిని ఆకట్టుకుంటాయి. దీనికి సంబంధించి ముందుగా నేవీ అధికారులు వారం రోజులపాటు రిహార్సల్స్ చేయడం జరుగుతుంది.
దీనిలో భాగంగా తూర్పునౌకదళం విశాఖ ఆర్కే బీచ్లో ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు బుధవారం రిహార్సల్స్ ప్రారంభించారు. బీచ్ రోడ్లో ఈ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ప్రారంభించింది. బుధవారం రాత్రి విన్యాసాల రిహార్సల్స్ చేశారు. తీరానికి వచ్చిన సందర్శకులు ఈ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు.
Read Also : వామ్మో నాలుగేళ్లకే గుండెపోటు.. లక్షణాలు ఇవే..! ఈ జాగ్రత్తలు మస్ట్
ఈ నావి డే వేడుకలు, రిహార్సల్స్ అంతా కూడా నగరవాసులకు అబ్బుర పరిచే రీతిలో భూమి, ఆకాశంతో పాటు సముద్ర జలాలపై విన్యాసాలు చేయనున్నారు. విశాఖ నావికాదళ ఆయుధ సంపత్తిని, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు అన్ని కూడా విపత్తుల సమయాల్లో ఏ విధంగా సహాయక చర్యలు అందిస్తాయని ప్రజలకు ప్రత్యక్షంగా చూపించనున్నారు.
విశాఖ నావికాదళం
విశాఖపట్నం నేవి , భారత నావికా దళానికి వెన్నెముకగా తూర్పు నావికా దళం సేవలు అందిస్తోంది. లుక్ ఈస్ట్ పాలసీ వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు అన్నిటికీ తూర్పు తీర ప్రాంత భద్రతకు అంతా కూడా పెద్ద పీట వేస్తున్నాయి. విశాఖ తీరంలో 1968లో ప్రారంభమైన ఈ తూర్పు నావికాదళ పయనం.. 1971లో పాక్ పై భారత్ సాధించిన యుద్ధ విజయంలో అంతా కూడా ఇదే కీలక భూమిక పోషించే స్థాయికి ఎదిగింది.
యావత్ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకి కూడా ఆతిథ్యమిచ్చి.. అనేక దేశాలకు మన నేవీ శక్తి సామర్థ్యాల్ని పరిచయం చేసింది. ప్రస్తుతం మన వద్ద 45 యుద్ధనౌకలు, జలాంతర్గాములు తూర్పుతీరాన్ని అంతా కూడా పహారా కాస్తున్నాయి. వివిధ దశల వారీగా వచ్చే 15 ఏళ్లలో 90 యుద్ధనౌకలను సమకూర్చుకునే దిశగా పయనిస్తూ... మన భద్రతకు భరోసానిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam