Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM NATIONAL TRIBAL DANCE FESTIVAL IN VIZAG ANDHRA UNIVIERSITY STUDENTS LIKE STEPS AGENCE PEOPLE NGS VNL NJ

Tribal dance festival: ఏయూలో గిరిజన జాతర.. ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు.. ప్రత్యేకత ఏంటంటే?

కొమ్మ

కొమ్మ కొయ్య నృత్యo

Andhra University: గిరిజనుల సంప్రదాయ నృత్యప్రదర్శనతో ఆంధ్రాయూనివర్సిటీ మురిసింది. 14 రాష్ట్రాలకు చెందిన 17 బృందాలు ఒక చోట చేరి ఇచ్చిన ప్రదర్శనలకు సందర్శకులు ఫిదా అయ్యారు. ఈ డ్యాన్సుల ప్రత్యేకత ఏంటో తెలుసా..?

  Neelima Eaty, News18 Visakhapatnam.
  Andhra University: గిరిజనుల సంప్రదాయ నృత్యప్రదర్శనతో ఆంధ్రాయూనివర్సిటీ (Andhra Univeristy) మురిసింది. దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన 17 బృందాలు ఒక చోట చేరి ఇచ్చిన ప్రదర్శనలకు సందర్శకులు ఫిదా అయ్యారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా బీచ్‌రోడ్డు (Beach Raod) లోని ఏయూ కన్వెన్షన్‌ హాల్లో (AU Convention Hall) జరిగిన జాతీయ నృత్య ప్రదర్శన అంగరంగ వైభవంగా కొనసాగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 500 మంది గిరిజన కళాకారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వారు వారి నృత్యాలనలతో ఆహుతలను అలరించారు. తొలి మూడు స్థానాలకు మాత్రమే బహుమతులను అందజేశారు. తొలి స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) బృందాని కి  లక్షరూపాయల నగదు బహుమతి. రెండో స్థానంలో నిలిచన కర్ణాటక (Karnataka) బృందానికి రూ. 75,000 నగదు బహుమతి....మూడో స్థానంలో ఉన్న ఒడిస్సా  (Odisha) బృందానికి రూ. 50,000 నగదు బహుమతి అందించారు. అంతేకాదు పార్టీసిపేట్‌ చేసిన అన్ని బృందాలకు కాంప్లిమెంటరీగా రూ.25,000 బహుమతి అందించారు.


  17 రాష్ట్రాల గిరిజనులు                                                                             ఇందులో దేశం మొత్తం మీద 17 రాష్ట్రాల గిరిజనలు పాల్గొన్నారు. జానపద పాటలు, నృత్యంతో కూడిన సాంప్రదాయ సంగీతం గిరిజన సంస్కృతిలో భాగం. ఇది వారి జీవనశైలి. వస్త్రధారణ మరియు అభ్యాసాలను ప్రతిబింబిస్తుంది. విశాఖపట్నంలో 3 రోజుల పాటు జరిగిన ఈ జాతీయ గిరిజన నృత్యోత్సవంలో ఆంధ్రప్రదేశ్, సిక్కిం, గుజరాత్, గోవా, ఒరిస్సా, జార్ఖండ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక,ఛత్తీస్ గడ్,మద్యప్రదేశ్ ,మణిపూర్ ,మిజోరం,మహరాష్ట రాష్ట్రాలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు.  భారతదేశంలోని గిరిజన నృత్యాలు మరియు ప్రత్యేకమైన సంగీత వాయిద్యాలతో ప్రదర్శన చేశారు. గిరిజనుల సంస్కృతి అభివృద్ధి దేశ అభివిద్దికి ఎంతో అవసరమని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి రాజన్న దొర అన్నారు. ఈ నేషనల్ డాన్స్ కాంపిటీషన్ వల్ల ఎక్కడెక్కడి నుంచో వచ్చిన గిరిజనులు మంచి మంచి స్టాల్స్‌ పెట్టారని తెలిపారు.

  ఇదీ చదవండి : సీఎం సొంత జిల్లాల్లో టీడీపీలో చేరికలకు ఎందుకంత డిమాండ్.. ఆ నియోజకవర్గంపై ముగ్గురు కర్ఛీఫ్..

  1. ఆంధ్ర కొమ్ముకోయ నృత్యం: ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొమ్మ కోయ నృత్యం రేల నృత్యం. ఈ నృత్యం మూడు రకాలుగా ప్రదర్శిస్తారు. మొదటిది ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని నృత్యం చేస్తారు. రెండవది స్త్రీ పురుషులు గుండ్రంగా ఉండి విడిగా పక్కకి తిరిగి చేస్తారు. మూడోది స్త్రీ పురుషులు నుంచొని చేపట్లు కోట్టే నృత్యం.

  2. కేరళ- మలయ ప్రళయం అట్టం: ఈ నృత్యం లయబద్ధమయినది. లయబద్ధంగా దీనికి గిరిజనులు నృత్యం చేస్తారు. ప్రస్తుత కాలంలో పురుషులు పాంచలు, స్త్రీలు చీరలుతో అందం గా అలకరించుకుంటారు. కాని పూర్వం లో ఆకులు, చెట్ల కాండంను దరించేవారు.

  3. బైసన్ హార్న్ మరియా డాన్స్:  వ్యవసాయం,  వివాహానికి సంబంధించిన పండుగల సమయంలో దీనిని నిర్వహిస్తారు. పూర్వం పురుషులు వేట వ్యాయామంలో భాగంగా డ్రమ్మింగ్ చేసేవారు. చంపడానికి ముందు జంతువును చుట్టుముట్టడానికి డ్రమ్మింగ్ సహాయపడింది. బైసన్ , మరియా డ్యాన్స్ అనేది సింక్రోనస్ రిథమిక్ డ్యాన్స్.

  4. మణిపూర్ నృత్యం:  ఇది శాంతిని సూచకంగా డాన్స్‌ వేస్తారు. అందమైన యువతి యువకులు దీన్ని ప్రదర్శించారు.

  5. గుడుం బాజా:  ప్రధానంగా మధ్యప్రదేశ్‌లోని దిండోరి, మాండ్లా, శార్దోలా జిల్లాల్లో కనిపిస్తుంది. దీనిని దిండోరిలోని ధులియా తెగలు ఆచరిస్తారు. బడే దేవ్, బడి దేవి, శేష్ నాగ్ మొదలైన స్థానిక దేవతలను పూజించడానికి ఈ నృత్య రూపాన్ని ఉపయోగిస్తారు. వివిధ రకాల మానవ పిరమిడ్‌లను ప్రదర్శకులు తయారు చేయడంతో డ్రమ్ బీట్‌ల వేగం మరియు స్టెప్పులు మారుతూ ఉంటాయి.

  6.ఒడిశా - బిర్లా నృత్యం: ఇది వివిధ పండుగలలో ప్రదర్శించబడుతుంది .ఈ నృత్యం ఎక్కువగా జనవరి మరియు ఫిబ్రవరి మధ్య కనిపిస్తుంది. సాధారణంగా ఈ నృత్యం వారికి జీవనోపాధిని అందిస్తుంది.

  7. తెలంగాణ గొంది గుస్సాడి నృత్యం: తెలంగాణకు చెందిన గోండు జాతి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. వారి వస్త్రధారణతో పాటు జీవనవిధానాన్ని ప్రతిబింబించిన నృత్యం ఆహూతులను అలరించింది. ఇందులో డ్యాన్స్ చేసే వారికి తలపాగా, దాని పై ఉన్న నెమలి ఈకలు, జింక కొమ్ములు చూడటానికి అంతే అందంగా ఉంటుంది.

  8. సిక్కిం నృత్యం: సీజనల్ హార్వెస్టింగ్ డ్యాన్స్ వరి పంట నృత్యం. ఇది వ్యవసాయ పొలాల్లో ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి నృత్యం చేస్తారు.

  9.కుంబీ డ్యాన్స్:  గోవాలోని కుంబి కమ్యూనిటీకి చెందిన గిరిజన జానపద నృత్యం, ఇది సామాజిక ఇతివృత్తాలను చిత్రీకరిస్తుంది. నృత్యం దాని ప్రదర్శనలో సరళంగా ఉంటుంది వివిధ సామాజిక సందర్భాలలో ప్రదర్శించబడుతుంది. కుంబి (ప్రత్యామ్నాయంగా కాన్బి) అనేది పశ్చిమ భారతదేశంలోని సాంప్రదాయకంగా శ్రేష్టులైన రైతుల కులాలకు వర్తించే సాధారణ పదం.

  ఇదీ చదవండి : చంద్రబాబుకు ఎమ్మెల్యే అభినందనలు.. కాదంటూ మంత్రి విమర్శ.. ఒకే వేదికపై ఇద్దరూ ఇలా?

   దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజనుల నృత్యాలను ఒకే వేదికపై చూసి ఆనందించే భాగ్యం కలగడం పట్ల నగరవాసులు సంతోషం చేస్తున్నారు. ఎంతో స్వచ్ఛంగా, ప్రేమగా వీరు చేస్తున్న నాట్యాలుగానీ, వాయిద్యాలుగానీ ఆకట్టుటకుంటున్నాయంటున్నారు. ఇలాంటి జాతీయ గిరిజన నృత్యోత్సవాలు విశాఖలో నిర్వహించడం ఇక్కడి వాసుల అదృష్టంగా భావిస్తున్నట్లు నృత్యాలను చూసేందుకు వచ్చిన పలువురు తెలిపారు.


  అడ్రస్‌ : ఆంధ్రాయూనివర్సిటీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌- 530003
  కాంటాక్ట్‌ నెంబర్‌ : 89197 88604 , గిరిజన సాంస్కృతిక పరిశోధన & శిక్షణ మిషన్ ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నం.

  ఇదీ చదవండి : వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభం.. 30 ఏళ్ల పాటు రాబడి..? ఇంకా ప్రయోజనాలు ఎన్నో

  ఎలా వెళ్లాలి?
  బస్టాండ్‌ నుంచి లోకల్‌ బస్సు, ఆటోలు ఆంధ్రాయూనివర్సిటీకి అందుబాటులో ఉంటాయి. క్యాబ్‌లు కూడా బుక్‌ చేసుకుని వెళ్లొచ్చు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు