Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM MYSTERY REVELED ON GOLD COLORED CHARIOT AT SRIKAKULAM ON CYCLONE TIME NGS VSP

Gold Chariot: తుఫానులో కొట్టుకొచ్చిన బంగారు రథం మిస్టరీ వీడింది.. దీని వెనుకు ఇంత పెద్ద కథ ఉందా..?

బంగారు రథం మిస్టరీ వీడింది

బంగారు రథం మిస్టరీ వీడింది

Gold Catham: అసాని తుఫాను ముప్పు ఏపీకి తప్పింది.. అదే సమయంలో తుఫాను తీసుకొచ్చిన బంగారు రథం మిస్టరీ కూడా వీడింది. ఈ బంగారం కోటెడ్ రథం ఎక్కడ నుంచి వచ్చిందని ఎలా గుర్తించరో తెలుసా..? దీని వెనుక కథ కూడా వినడానికి చాలా వింతంగా ఉన్న.. అక్కడ అదే ఆచారం ఎప్పటినుంచో కొనసాగుతోందంట... ఇంతకీ ఏంటా కథ అనుకుంటున్నారా?

ఇంకా చదవండి ...
  P Anand Mohan, Visakhapatnam, News18.

  Gold Catham: ఇటీవల బంగాళాఖాం (Bay of Bengal) లో ఏర్పడ్డ అసని తుపాను (Asani Cyclone Effet) అల్లకల్లోలం సృష్టించింది. ఏపీని తీవ్రంగా భయపెట్టింది. ప్రస్తుతానికి ఆ తుఫాను ముప్పు అయితే తొలిగింది. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లో ఓ వింత రధం కొట్టుకువచ్చింది. అయితే ఆ రథం ఎక్కడ నుంచి వచ్చింది..? అసలు రథ ఎలా వచ్చింది..? అంటూ పలు రకాల అనుమానాలు కలిగాయి. చాలా వింతగా.. కొత్తగా ఉన్న ఆ రథాన్ని చూసేందుకు భారీగా జనం కూడా ఎగబడ్డారు. సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి సముద్ర తీరాని (M Sunnaplli beach) కి కొట్టొకొచ్చిన ఈ బంగారం రథం (Gold Coloured Chariot) హిస్టరీ తెలుసుకోవడానికి పోలీసులు.. అధికారులు భారీగానే కసరత్తు చేయాల్సి వచ్చింది. అయితే మన దేశంలో ఎప్పుడు ఇలాంటివి చూడకపోవడంతో.. అసలు ఈ బంగారం రథం కథ ఏంటి అని తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నాలు చేశారు. చివరికి ఆ మిస్టరీ వీడింది.

  బంగారు రంగుతో మెరిసిపోతున్న ఈ స్వర్ణ రథాన్ని స్థానికులు తాళ్లతో లాగి ఒడ్డుకు చేర్చారు. దేవుడి ఊరేగింపులో ఉపయోగించే వాహనం మాదిరిగా అది కనిపిస్తోంది. మొదట ఆ వింత వాహనం బంగారు రంగుతో మెరిసిపోతుండడంతో నిజంగా బంగారు రథమే అని స్థానికులు కొందరు భావించారు. దాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. దాంతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ రథం వెనుక చాలా హిస్టరీనే ఉంది.

  ఇదీ చదవండి : వల్లభనేని వంశీ సైలెంట్ కు కారణం ఏంటి..? గన్నవరంపై టీడీపీ స్పెషల్ ఆపరేషన్!

  ఈ బంగారు రథాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు.. మయన్మార్ నుంచి కొట్టుకువచ్చినట్టు నిర్ధారణకు వచ్చారు. మయన్మార్ లో యువతి యువకులు చాలామంది సన్యాసం తీసుకుంటూ ఉంటారు.. వారి వ్యక్తిగత కారణాల వల్లో లేక.. దేవుడిపై నమ్మకంతోనూ.. కొందరు సంప్రదాయంగా భావించి.. ఇలా పలు కారణాలతో అక్కడ సన్యాసం తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలా సన్యాసంలో చేరే వారి కోసం ప్రత్యేకంగా ఈ బంగారు రథాలను తయారు చేస్తుంటారని తెలుస్తోంది. ఆ రథాల్లోనే ఎవరైతే సన్యాసం తీసుకుంటారో వారిని ఊరేగిస్తూ ఉంటారని సమాచారం. ఆ తతంగం పూర్తైన తరువాత.. రథాన్ని సముద్రంలో నిమజ్జనం చేస్తారంట..?

  ఇదీ చదవండి : టీడీపీ-జనసేన-బీజేపీ కలిస్తే గెలుపు గ్యారంటీ..? పవన్ కు కాపు సంక్షేమ నేత

  ఆ నిమజ్జనం అయిన బంగారు రథాన్ని శ్రీకాకుళం జిల్లాలో సముద్రతీరానికి కొట్టుకు వచ్చిన రథం పోలినట్టు అధికారులు గుర్తించారు. అయితే నిమజ్జనం సమయంలో అది పూర్తిగా అయ్యి ఉండదని.. అందుకే తుపాను తీవ్రతకు ఇలా కొట్టుకుని వచ్చి ఉంటుందంటున్నారు. అలాగే ఈ రథంపై ఈ ఏడాది జనవరి 16 తేదీ ఉండడంతో నాలుగు నెలల క్రితమే దీన్ని తయారుచేసి ఉంటారని అంచనా వేస్తన్నారు. అందుకే కొత్తగా ధగధగలాడుతోందని భావిస్తున్నారు.

  ఇదీ చదవండి : ఒకటి ఆదానీ ఫ్యామిలీకి.. మరొకటి మెగా ప్రొడ్యూసర్ కు.. ఒక్క సీటుపైనే సందిగ్ధం.. విజయసాయి సంగతి ఏంటి..?

  ఈ బంగారు రథం రూపురేఖలు, డిజైన్లు అన్నీ కూడా బౌద్ధమతం ధీమ్ లోనే ఉన్నాయి. సరిగ్దా మూడు నెలల క్రితమే నెల్లూరు జిల్లా తీరప్రాంతానికి ఇలాంటి వాహనం ఒకటి కొట్టుకొచ్చింది. అది చాలా పాతగా కనిపించింది. ఆ వాహనంలో బుద్ధుని ప్రతిమ, చిత్రంతో, శివలింగం కూడా ఉన్నాయి. తాజాగా వచ్చిన రథంపై ఉన్న భాషను ఇంట‌ర్నెట్‌లో సెర్చ్ చేయ‌గా అది మయన్మార్‌ దేశానికి చెందిందని, ఇది బంగారు రథం కాదని తెలిపారు. రెండేళ్ల కిందట ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతానికి ఇలాంటి రథమే ఒకటి కొట్టుకొచ్చిందని, అప్పట్లో అది శ్రీలంక దేశానికి చెందిందిగా గుర్తించారు. ఇదిలా ఉండగా దీన్ని మందిరంగా వినియోగించుకునేందుకు తమకు అవకాశమివ్వాలని ఎం.సున్నాపల్లి మత్స్యకారులు అధికారులను అభ్య‌ర్థిస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Cyclone, Srikakulam

  తదుపరి వార్తలు