Setti Jagadeesh, News 18, Visakhaptnam
విశాఖపట్నం (Visakhapatnam) పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు. అలాంటి విశాఖలోని బీచ్‌రోడ్డులో (Vizag beach Road) నేచర్ లవర్స్‌తో పాటు ఫుడ్ లవర్స్‌కు కూడా అదరిపోయే వెరైటీ ఫుడ్స్ దొరుకుతాయి. అందులో అందరూ ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ మూరి మిక్చర్. విశాఖ బీచ్‌కి వచ్చే వాళ్లెవ్వరూ..ఈ మిక్చర్‌ని టేస్ట్ చేయకుండా వెళ్లరంటే నమ్మండి..! విశాఖపట్నం భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరం. బ్రిటిషు పాలనలో వాల్తేరుగా కూడా పిలువబడింది ఈ నగరం. విశాఖలో దొరకని ఫుడ్ వెరైటీ అంటూ ఉండదు..ఎన్నో రుచికరమైన వంటకాలకు వైజాగ్ పెట్టింది పేరు. విశాఖ బీచ్‌కి వచ్చే వారికి ఎన్నో రుచికరమైన వంటకాలు అందిస్తూ ఆహా అనిపిస్తున్నారు చిరు వ్యాపారులు.
మూరి మిక్సర్ .. ఆ పేరు వింటే చాలు విశాఖ బీచ్ గుర్తొస్తుంది. సుందర సాగర తీరంలో అలా బీచ్‌లో నడుచుకుంటూ ఈ మూరి మిక్సర్ తింటే ఆ కిక్కే వేరు. అమ్మేది చిన్న బల్ల మీద అయినా ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగే బిజినెస్ జరుగుతూ లాభాలతో నడుస్తుంది. విశాఖ సాగర తీరానికి కారులో వచ్చినా, కాలి నడకన వచ్చినా ఈ బల్ల దగర అమ్మే మూరీ మిక్సర్ తినకుండా వెళ్లరు. ఇంకా చెప్పాలంటే ఇదో టైమ్‌పాస్ స్నాక్..!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటున్నారు చిరు వ్యాపారులు. రోజు వారీ రూ.500 పెట్టుబడి పోను రూ. 1000 రూపాయలు వరకు సంపాదిస్తారు. విశాఖ వచ్చే టూరిస్టులు బీచ్ కి వచ్చి ఈ మూరి మిక్సర్ తినకుండా వెళ్లరు. అటు పర్యాటకులకు మంచి టేస్ట్ ఇస్తూ మంచి బిజినెస్ చేస్తున్నారు.
అడ్రస్: ఆర్కే బీచ్ రోడ్, వైజాగ్, విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్- 530003.
ఎలా వెళ్లాలి: విశాఖ బస్టాండ్ నుంచి 10 నిమిషాల్లో ఈ బీచ్‌రోడ్డుకు వెళ్లొచ్చు. ఆర్.కే బీచ్‌కి బస్సు, ఆటో సౌకర్యం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam