(నీలిమ, విశాఖపట్టణం, న్యూస్ 18 తెలుగు)
పన్నెండేళ్లకే పదో తరగతి పరీక్షను పూర్తి చేయడమే కాదు అత్యధిక మార్కులు కూడా సాధించి రికార్డు సృష్టించింది గాజువాక విద్యార్థి. తన ప్రతిభతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పదోతరగతి పరీక్షల్లో 600లకు గాను 525 మార్కులు సాధించింది.
టానీషాను ప్రోత్సహించిన తల్లిదండ్రులు
గాజువాకకు చెందిన పాలూరి లక్ష్మణస్వామి, దేవీల పెద్ద కొడుకు పూజేషా, చిన్న కూతురు టానీషా. స్వామి విద్యా నికేతన్ ప్రిన్సిపల్‌గా లక్ష్మణస్వామి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్ననాటి నుంచి అన్న చెల్లెళ్లు ఇద్దరు తన తండ్రి స్కూల్‌లోనే చదువుకున్నారు. టానీషా చిన్ననాటి నుంచే అన్ని విషయాల్లోనూ చాలా యాక్టీవ్‌గా ఉండేది. మొదట నుండి చదువులలో అడ్వాన్స్ గా ఉండే టానీషా టాలెంట్‌ను ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. చిన్నవయసులోనే పదోతరగతి పరీక్షలకు సిద్ధం చేశారు.
టానీషా అన్నయ్య పూజేషె కూడా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తుండటంతో అన్నతో కలిసి ప్రిపేర్ అయ్యింది. తనతోటి వయస్సు వారు ఇంకా ఆరో తరగతి చదువుతుండగా టానీషా మాత్రం తన అన్నతో కలిసి పదవ తరగతి పూర్తి చేసింది.
Read This : Guntur : పగలంతా రెక్కీ..రాత్రికి డ్యూటీ..! భక్తులుగా దండంపెడుతూనే దేవుడి సొమ్ముకు కన్నం..!
తల్లిదండ్రుల ప్రోత్సాహం, టీచర్ల సహకారంతో టానీషా 12 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసి రికార్డు సృష్టించింది. టానీషాను తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు ప్రాంతీయ రాజకీయ నాయకులు అభినందించారు. గాజువాక ఏరియా కమిటీ టానీషాకు అభినందన సభ ఏర్పాటు చేసి సన్మానించారు.
టానీషా మల్టీ టాలెంటెడ్ కిడ్..!
గాజువాకలోని హైస్కూల్ రోడ్డులోని స్వామి విద్యా నికేతన్‌లో పాలూరి టానీషా పదో తరగతి చదివింది. టానీషా చదువుతో పాటు మరిన్ని రంగాల్లో ప్రతిభ చాటుతోంది. స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో జాతీయ స్థాయిలో పలు ప్రాంతాల్లో జరిగిన క్యాంపుల్లో పాల్గొని ప్రతిభ చూపింది. అంతేకాదు కూచిపూడిలో ఆంధ్రప్రదేశ్ తరుపున పలు రాష్ట్రాలలో ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలు పొందింది.
టానీషా అన్నయ్య కూడా ప్రతిభావంతుడే..!
టానీషా అన్నయ్య పాలూరు పూజేషే కూడా ఇదే ఏడాది పదో తరగతి పరీక్షలు రాసి 539 మార్కులు సాధించాడు. చెల్లి కూడా తనతో పాటు 10th పరీక్షలు రాస్తుందని తెలిసి సంతోషించాడు. చెల్లికి ఏమైనా డౌట్స్ వస్తే వెంటనే క్లియర్ చేసేవాడు. ఒక్క చదువులోనే కాదు పూజేషే కూడా అనేక జాతీయ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇప్పటికే జాతీయంగా నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నాడు.
Also Read : తJagan : పంచె కట్టు.. నుదుటన నిలువు సింధూరం బొట్టు.. సీఎం ఆహార్యంలో ఇవి గమనించారా..?
హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో, సిక్కింలలో జరిగిన అంతర్జాతీయ సమైక్యత ర్యాలీలో మిగతా దేశాలతో పాల్గొని మన ఆంధ్రప్రదేశ్ యొక్క.. విధి విధానాలు వేష..భాషలు ఆహారఫు అలవాట్లు,ఆచార వ్యవహారాలు, వివాహ పద్ధతులు, వేష భాషలు మొదలైనవన్నీ ప్రపంచ దేశాలకు నాటకాలు, ఎగ్జిబిషన్ లాంటి వివిధ రూపాలలో ప్రదర్శించారు. అందుకుగాను మన ఆంధ్రప్రదేశ్ తరుపున పూజేషే రెండు జాతీయ అవార్డులు కైవసం చేసుకున్నాడు. ఈ అన్నాచెల్లెల్లిద్దరూ తమ ప్రతిభతో ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.
అన్నాచెల్లెళ్లకు స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో అవార్డులు:
గోవాలో జరిగిన జాతీయ యూత్ అడ్వెంచర్ క్యాంపులో వివిధ కేటగిరీల కింద అన్నాచెల్లెల్లు ఇద్దరు మన ఆంధ్రప్రదేశ్ తరుపున అద్భుత ప్రతిభ చూపించారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరుపున మన ఆంధ్రప్రదేశ్ లో పూజేషే రాష్ట్రపతి అవార్డు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా టానీషా (గవర్నర్ అవార్డు)రాజ్య పురస్కారం సంపాదించి, రాష్ట్రపతి అవార్డు కు అర్హత సాధించింది.
డాక్టర్ అవ్వాలన్నదే నా ఆశయం: టానీషా
చిన్న వయసులోనే పదో తరగతి ఉత్తీర్ణత సాధించడంతో పాటు అత్యధిక మార్కులు సాధించిన టానీషా.. భవిష్యత్‌లో డాక్టర్ కావాలన్నదే తన జీవిత లక్ష్యం అంటోంది. అందుకోసం జాతీయ స్థాయిలో జరిగే నీట్ ఎగ్జామ్‌లో మంచి స్కోర్ చేయడానికి సన్నద్ధం అవుతోంది. భవిష్యత్‌లో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టానీషా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Vizag