Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM MOTHER AND SON DIED IN ROAD ACCIDENT IN VISAKHAPATNAM VSJ NJ ABH

Vizag: అన్నయ్యలకు రాఖీ కట్టడానికి వెళ్లి.. కుమారుడితో సహా మృత్యుఒడిలోకి..!

రోధిస్తున్న మృతురాలు సత్యవతి భర్త

రోధిస్తున్న మృతురాలు సత్యవతి భర్త

అన్నయ్యలకు రాఖీ కట్టి వద్దామని తన కుమారిడితో కలిసి వెళ్లిన మహిళ..కుమారిడితో సహా కానరానిలోకాలకు చేరింది. మరోఘటనలో భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు..ఆ తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుతురి ఆత్మహత్యాయత్నం..!

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  (Setti Jagadesh, News 18, Vizag)

  రాఖీ పండగ రోజు విశాఖపట్నంలోని దుడ్డుపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అన్నయ్యలకు రాఖీ కట్టి వద్దామని తన కుమారిడితో కలిసి వెళ్లిన మహిళ.. కుమారిడితో సహా కానరానిలోకాలకు చేరింది. బైక్‌పై వెళ్తున్న తల్లీ కొడుకులను లారీ రూపంలో మృత్యువు వెంటాడింది.

  పోలీసుల కథనం ప్రకారం.. సబ్బవరం మండలం యాతపాలెం గ్రామానికి చెందిన శరగడం సత్యవతి (35)కి భర్త రాంబాబు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె కుందన ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ చదువుతుంతగా.. కొడుకు సుఖీష్రమ్‌ చెన్నైలో ఇంజనీరింగ్‌ జాయిన్‌ కావాల్సి ఉంది. సత్యవతికి ముగ్గురు అన్నయ్యలున్నారు.. రాఖీపండగ రావడంతో తన అన్నలందరికి రాఖీ కట్టేందుకు.. తన పుట్టిల్లు అయిన మునగపాకకు కుమారుడితో కలిసి గురువారం తెల్లవారుజామునే బయల్దేరింది.  అయితే వాళ్ల బైక్‌ దుడ్డుపాలెం జంక్షన్ సమీపానికి వచ్చేసరికి అనుకోని ప్రమాదం జరిగింది. వెంకన్నపాలెం నుంచి నర్సాపురం ఇసుక ర్యాంపుకు వెళ్తున్న లారీ వీరి బైకును ఢీకొట్టింది. లారీ రాంగ్‌ రూట్లో వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఆ లారీ వీరిద్దరిని కొంతదూరం ఈడ్చుకు పోయింది. గాయపడి కొనఊపిరితో ఉన్న వారిని వదిలేసి లారీ డ్రైవర్ రమణ అక్కడ నుంచి పరారయ్యాడు.

  వెంటనే స్థానికులు లారీ కింద ఉన్న సుఖీష్రమ్‌ను బయటకు లాగారు. అతడి మెడపై నుంచి లారీ టైర్‌ వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కొద్దిసేపటికే తల్లితో పాటు కుమారుడు ప్రాణాలు విడిచారు. భార్యాబిడ్డా ఒకేసారి దూరమయ్యారంటూ సత్యవతి భర్త రోదినతో అక్కడంతా విషాదచాయలు అలుముకున్నాయి.

  భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్య…తండ్రి మరణం తట్టుకోలేక...!

  భార్యతో గొడవపడి మనస్తాపం చెందిన భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మర్రిపాలెం శ్రీనివాస వీధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒడిశా నవరంగపూర్ ప్రాంతానికి చెందిన త్రిపూర్ణ రాంబాబు(42) భార్య లల్లి (40) తో గొడవల కారణంగా గత ఐదేళ్లుగా వేరుగా నివాసం ఉంటున్నాడు. రాంబాబు తన తల్లి భానుమతి (65), కుమార్తె మనీషా(18)తో కలిసి మర్రిపాలెంలో నివసిస్తున్నాడు. రెండు రోజుల క్రితం భార్య లల్లి ఒడిశా నుంచి వీళ్లు ఉంటున్న ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం రాంబాబు తల్లి, కుమారై బ్యాంకు పని కోసం బయటకు వెళ్లారు.

  ఆ సమయంలో భార్యాభర్తల మధ్య మాటమాట పెరిగింది. దీంతో రాంబాబు తీవ్ర మనస్తాపంతో ఇంటి లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నాడు. భార్య వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో తలుపు పగలకొట్టి చూడగా అప్పటికే మృతి చెందాడు.
  చిన్ననాటి నుంచి అన్ని తానై చూసిన నాన్న లేడని మనీషా కుంగిపోయింది. రాంబాబు మృతిని తట్టుకోలేక కూతురు మనీషా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తల్లి, స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాంబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు.

  Read This: Vizag News: రక్షా బంధన్ రోజు వృక్షా బంధన్.. ఆకట్టుకున్న విద్యార్థుల ప్రయత్నం
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Andhrapradesh, Crime news, Local News, Vizag

  తదుపరి వార్తలు