Andhra Pradesh: పల్సర్ బైక్ ను పార్క్ చేస్తున్నారా? బీకేర్ ఫుల్. ఏం జరుగుతుందో తెలుసా?

పల్సర్ బైక్ పార్కింగ్ చేస్తే అంతే సంగతులు

పల్సర్ బైక్ లు ఉన్నవారు ఇకపై బీ కేర్ ఫుల్ గా ఉండాలి. పార్కింగ్ చేసినా అనుక్షణం దాన్ని చూసుకోవాల్సిందే. సైడ్ లాక్ వేశామని రిలాక్స్ అయ్యారో అంతే సంగతులు. తాజాగా విశాఖపట్నం జిల్లా పాడేరు మండలంలో ఇద్దరు యువకులు చెప్పిన సమధానాలు పోలీసులే షాక్ కు గురైనట్టు చేశాయి.

 • Share this:
  సాధరాణంగా బైక్ పై బయటకు వెళ్లినప్పుడు రోడ్డుపై పార్క్ చేస్తుంటాం.. కానీ కొందరు ఆ బైక్ కే తాళాలు మరిచిపోతూ ఉంటారు. అయినా అవి సేఫ్ గా ఉండడంతో చాలామంది నిర్లక్ష్యం వీడడం లేదు. ముఖ్యంగా ప్రతి ప్రాంతాల్లోనూ నిఘా గట్టిగా ఉంది. చాలాచోట్ల సీసీ  కెమెరాలు ఉండడంతో బైక్ ల గురించి పెద్దగా టెన్షన్ పడడం లేదు. పొరపాటున పల్సర్ బైక్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి..

  బయటకు వెళ్లినప్పుడు ఖాళీ ప్రదేశం కనిపించిందనో.. అంతెందుకు పార్కింగ్ ప్లేస్ ఉందనే ధైర్యంతో పల్సర్  బైక్ ను పార్క్ చేసినా..  జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటారా? తాజాగా విశాఖపట్నం జిల్లా పాడేరులో షాకింగ్ విషయాలను గుర్తించారు పోలీసులు.  పార్కింగ్ ప్లేస్ లో పెట్టిన పల్సర్ బైకులు కూడా అక్కడి నుంచి మాయమవుతున్నట్టు తెలుసుకున్నారు.

  విశాఖపట్నం జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో ఇటీవల బైక్ చోరీలపై ఫిర్యాదులు పెరిగాయి. గత కొన్ని నెలులుగా ముఖ్యంగా పల్సర్ బైకులు చోరికి గురవుతున్నట్టు వరుస ఫిర్యాదులు అందడం ఆందోళన పెంచింది.  పార్క్ చేసి ఉన్న పల్సర్ వాహనాలు  ఎలా క్షణాల్లో మాయమైపోతున్నాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

  ఈ పల్సర్ల మాయమైపోతున్న కేసుల విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలు గుర్తించారు. విశాఖ ఏజెన్సీతో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు మొత్తం 22 పల్సర్ బైకులు చోరికి గురయ్యాయంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే ఇంకా కంప్లైట్ చేయని కేసులు ఎన్నో ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

  ఇలా పల్సర్ బైక్ లు పోతున్నాయంటూ వరుసగా ఫిర్యాదులు రావడంతో.. వాహనదారులు చెప్పిన వివరాలను సేకరించారు. దాదాపు అందరూ ఒకేలాంటి సమాధానాలు చెప్పినట్టు గుర్తించారు. బైక్ కు సైడ్ లాక్ వేశామని.. కానీ తిరిగి వచ్చిన ఐదు నిమిషాల్లోనే బైక్ అక్కడ లేకపోవడంతో.. ఫిర్యాదు చేస్తున్నామని చాలామంది చెప్పినట్టు గుర్తించారు.

  వరుస ఫిర్యాదుల నేపథ్యంలో పల్సర్ వాహనాల చోరిపై పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. పాడేరులో ఉన్న ఇద్దరు యువకులు పల్సర్ బైక్ లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. తాజాగా ఒడిశాలో వాహనాలను అమ్మేందుకు నిందితులు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు.  గేమ్మేలి సురేష్, మర్రి రాజు అనే ఇద్దర్నిపోలీసులు పట్టుకున్నారు. వారిద్దర్నీ పట్టుకుని ప్రశ్నిస్తే అసలు విషయం ఒప్పుకున్నారు. అయితే సైడ్ లాక్ వేసినా పల్సర్ ను దొంగలించడం చాలా ఈజీ అని.. అందుకే తాము కేవలం పల్సర్ బైకులనే దొంగతనం చేస్తున్నామని వారు పోలీసులకు చెప్పారు.

  ఆ ఇద్దరే తూర్పుగోదావరి జిల్లాలో కూడా వారు పల్సర్ బైకులను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. అలా దొంగిలించిన 25 బజాజ్ పల్సర్ బైక్ లను చింతపల్లి మండలం పెద్ద గొంది గ్రామ శివారులో స్వాధీనం చేసుకున్నారు. వాహన యాజమానులు తగిన ఆధారాలతో వచ్చి బైకులను తీసుకుని వెళ్లవచ్చు అని పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ చెప్పారు.
  Published by:Nagesh Paina
  First published: