హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Bengal Tiger: ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ షాకిస్తున్న బెంగాల్ టైగర్.. బోనులోకి వచ్చేదెలా..?

Bengal Tiger: ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ షాకిస్తున్న బెంగాల్ టైగర్.. బోనులోకి వచ్చేదెలా..?

కాకినాడలో కెమెరాకు చిక్కిన పులి

కాకినాడలో కెమెరాకు చిక్కిన పులి

Bengal Tiger: బెంగాల్ టైగర్ అన్న పేరుకు తగ్గట్టే.. ఇటు జనాలను.. అటు అధికారులను భయపెడుతోంది.. దాదాపు నెల రోజులు అవుతున్నా.. పులిని పట్టుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు.. చిక్కినట్టే చిక్కీ తప్పించుకుంటోంది. దాన్ని పట్టుకోడానికి వేసే ఎత్తులకు అది పై ఎత్తులు వేస్తోంది.

ఇంకా చదవండి ...

    Bengal Tiger :  ఒకటి రెండు కాదు.. 25 రోజులు దాటింది. అయినా ఆ పెద్దపులి ని పట్టుకోవడం సాధ్యం కావడం లేదు.  కాకినాడ జిల్లా (Kakinada District)లో పులి (Tiger) కోసం దాదాపుగా నెలరోజులు అవుతున్నా.. ఏ మాత్ర ఫలిత ఆశాజనకంగా కనిపించడం లేదు.  బెంగాల్ టైగర్ అందరికీ కంటిమీదు కునుకు లేకుండా చేస్తోంది. అధికారులను పరుగులు తీస్తోంది.  వారి వ్యూహాలను అన్నింటినీ తిప్పికొడుతోంది. అటవీశాఖ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పరుగులు పెట్టిస్తోంది. చిక్కినట్టే చిక్కి చేజారిపోతోంది.  దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరా (CC Cemara) లో రికార్డు అయ్యాయి. ఎక్కడి నుంచో వచ్చింది.. కానీ కోనసీమలో తిష్ట వేసింది.  ఆ పులిని బంధించేందుకు ఎన్ని ఎత్తులు వేసినా అన్నింటినీ చిత్తు చేస్తోంది. పులి తెలివి తేటలకు అధికారులే అవాక్కవుతున్నారు. భయంతో పరిసర ప్రాంతాల జనం నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు.

    సరిగ్గా నేటికి 25 రోజుల క్రితం కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎంట్రీ ఇచ్చింది పులి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులు పన్నని వ్యూహం లేదు.. సాధారణంగా రెండు వారాల లోపే ఎలాంటి పులినైనా చిక్కేట్టు చేస్తారు. కానీ ఈ పులి మాత్రం అంచనాలకు అందడం లేదు. వారి వ్యూహాలన్నింటినీ తిప్పికొడుతోంది. దాదాపు నెల రోజులు కావస్తున్నా పులిజాడ దొరక్కపోవడంతో అధికారులకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఆ పెద్ద పులిని బంధించడం ఫారెస్ట్ అధికారులకి బిగ్‌ టాస్క్‌ అవుతోంది. దాని అడుగు జాడలు ఓ వైపు కనిపించాయని అటు మాటు వేస్తోంది.. అది మరోవైపు వెళ్తోంది. నాలుగు అడుగుల పొడవు..

    కాకినాడ జిల్లాలోని పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవుల పాలెం పరిసరాల్లో పులి అడుగుజాడలు నిత్యం కనిపిస్తుండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఎటువైపు నుంచి పులి పంజా (Tiger Attack) విసురుతుందో తెలియక జనం భయపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో బోనుల్లో మాంసాన్ని ఎరగావేసినా.. ఆ దగ్గరగా వచ్చి.. దూరంగా వెళ్లిపోతోంది. ఆ బోనును ముందే పసిగట్టేస్తోంది. అసలెందుకు ఈ పులి బెబ్బులి ఇక్కడికొచ్చింది? ఇంత పకడ్బందీ ప్రణాళికను కూడా ఎలా తప్పించుకుతిరగ్గలుగుతోంది? ఇప్పుడిదే ప్రశ్న కాకినాడ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను హడలెత్తిస్తోంది.

    ఇదీ చదవండి : వేసవిలో సైతం చల్లని ఆహ్లాదాన్ని పంచే ప్రాంతం.. విశాఖ మణిహారమైన కైలాసగిరికి మరో పేరు ఉందని తెలుసా..?

    మన రాష్ట్రంలో ఓ పులిని పట్టుకోవడం ఇంత ఆలస్యం కావడం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. ఎంత వేగం ఉన్నా, దాన్ని ఒడిసిపట్టుకోగలిగే వేటగాళ్ళున్నారు. అయినా దీని అంతుచిక్కడం లేదంటున్నారు. కారణాలేవైనా ఒకటి కాదు రెండు కాదు 11 గ్రామాల ప్రజలు.. ప్రాణాలరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. గత 25 రోజులుగా నాన్‌స్టాప్‌గా వేటాడుతున్నా దాన్ని బంధించడం ఎవరి తరం కావడంలేదు. 40 కిలో మీటర్ల పరిధిని తన అడ్డాగా మలుచుకుంది. వేడి నెత్తురు మాత్రమే పులి గుర్తెరిగిన రుచి. అందుకే బోన్లలో వేసిన మాంసాన్ని అది టచ్ కూడా చేయడం లేదంటున్నారు. ఇప్పటికి ఆ పులి ఐదు పశువులపై దాడిచేసింది. మరి ఎప్పటికి బోనులోకి చిక్కుతుందో చూడాలి..

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Kakinada, Tiger

    ఉత్తమ కథలు