హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tiger Tension: వంద రోజులైనా చిక్కడం లేదు.. ఆడ పులి కోసం ఆరాటం.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు

Tiger Tension: వంద రోజులైనా చిక్కడం లేదు.. ఆడ పులి కోసం ఆరాటం.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు

కాకినాడ జిల్లాలో పులి (ఫైల్)

కాకినాడ జిల్లాలో పులి (ఫైల్)

Tiger Tension: ఒకటి రెండు కాదు.. వంద రోజులవుతోంది. అయినా పులి అంతు చిక్కడం లేదు.. జాడ తెలిసినా.. బోను చిక్కడం లేదు. దాన్ని ఎలా పట్టుకోవాలో తెలియక అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆడతోడు కోసం వెంపర్లాట..?

P Anand Mohan, News18, Visakhapatnam.

Tiger Tension:  ఈ పులి అలాంటి ఇలాంటిది కాదు.. ఎందుకంటే ఒకటి రెండు వారాలు కాదు.. వంద రోజులు అవుతోంది.. తనను పట్టుకోవడం కోసం చేసిన ప్రయత్నాలను అన్నింటినీ వమ్ము చేస్తోంది. అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. దమ్ముంటే టచ్ చేసి చూడండి అంటూ అందరికీ సవాల్ విసురుతోంది. ప్రజలను భయపెడుతోంది. అది కూడా ఒక్క ప్రాంతానికో.. ఒక్క జిల్లాకో పరిమితం కావడం లేదు.. అటు ఉమ్మడి ఈస్ట్ గోదావరి (East Godavari) నుంచీ ఇటు ఉమ్మడి విశాఖ జిల్లా (Visakha District) ల వరకూ సంచరిస్తూ.. అధికారులను పరుగులు పెట్టిస్తోంది. ప్రజలను భయపెడుతోంది. అయితే ఈ పెద్ద పులి ఇప్పుడు ఆట పులి స్నేహం కోసం వెంపర్లాడుతోంది అంటున్నారు అధికారులు. అయినా ఇప్పటి వరకు తనకు తోడు దొరకలేదని.. ఆ పులికి ఆడతోడు దొరికినంత వరకు ప్రమాదామే అంటున్నారు అధికారులు..

గత మూడు నెలలుగా టెన్షన్ పెడుతున్న ఈ బెంగాల్ టైగర్ (Bengal TIger) ను పట్టుకోవడం కోసం అధికారులు చేయని ప్రయత్నం లేదు. అయినా.. సరే చిక్కనంటోంది. పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ విసురుతోంది. దాని తీరు అర్థం కావట్లేదని అటవీ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా మూగజీవాల్ని చంపేసి తన ఆకల్ని తీర్చుకున్న బెంగాల్ టైగర్ మరో తోడు కోసం తిరుగాడుతోందని అటవీ అధికారుల నుంచీ వచ్చిన మరో కీలకమైన సమాచారం.

ఇదీ చదవండి : ఇది వింటే షాక్ అవుతారు.. దాడి చేసేందుకు సిద్ధమవుతున్న రాకాసి చేప..? ఎంత డేంజరో తెలుసా?

అంటే ఆడ తోడు కోసం తపించిపోతున్న మగపులి ఇది అంటున్నారు. అందుకే మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని అంటున్నారు.  గత వారం రోజులుగా ఉమ్మడి విశాఖలో ఈ పులి కల్లోలం మొదలైంది. కొత్తగా  ఏర్పడిన అనకాపల్లి జిల్లా గాలి భీమవరం ప్రాంతంలో పులి సంచారాన్ని ఈ మధ్యే అటవీ శాఖ అధికారులు కన్ఫార్మ్ చేశారు. టైగర్ ట్రాప్, డ్రోన్ కెమెరా టీం, వెటర్నరీ డాక్టర్ లు కూడా అక్కడే ఉన్నారు. పశువుల శాలల్లో పని చేస్తున్న వారిని, అక్కడ నివాసము ఉంటున్న వారిని అందరికి కూడా ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. పులి సంచారం అంతా కూడా అటవీ ప్రాంతంలోనే కనిపించింది.

పులి సంచారం మొదలైనప్పటీ నుంచి అనేక ప్రాంతాల్లో బెంగాల్ టైగర్ అడుగు జాడలు కనిపించాయి. వాటి ఆధారంగానే పులి సంచారాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. అనకాపల్లి జిల్లా కొండవాలు గ్రామాల్లో తిరుగుతూ, అక్కడ పశువుల శాలల్లో ఉండే పశువులను చంపేసింది. ఏఫ్రిల్ 11న విజయనగరంలోని మెంటాడ అటవీ ప్రాంతంలో తొలి సారి కనిపించిన పులి, మే 1న నర్సీపట్నంలోని నాతవరం, మే 29న తూర్పో గోదావరి పత్తిపాడులో కనిపించింది. అక్కడ ట్రాప్ కి చిక్కినట్లే చిక్కి మిస్సైయ్యింది.

ఇదీ చదవండి: ఏపీలో మంకీపాక్స్ లేదు.. చిన్నారి నమూనాలపై అధికారుల క్లారిటీ

జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా తుని, జూన్ 29న  తర్వాత నుంచి అనకాపల్లి జిల్లా కోటవురట్ల, గంధవరం, గాలి భీమవరం గ్రామాల్లో పులి పగ్ మార్క్ కనిపించాయి. పగ్ మార్క్ కనిపించిన ప్రతి చోటా కూడా దాని సైజు, అది నేలపై వేసిన అడుగుల ఒత్తిడి, రెండు అడుగుల మధ్య దూరం అన్నీ ఒకేలాగ ఉన్నాయి. అంటే ఇంత కాలంగా ఒక చోట నుంచి మరొక చోటుకు తిరుగుతున్నది ఒకే పులి. దాని వయసు కూడా నాలుగైదు ఏళ్లు ఉంటుందని అధికారులు అంటున్నారు.

ఇదీ చదవండి: కొడాలి నానిపై పోటీకి అభ్యర్థిని ఫైనల్ చేసిన టీడీపీ.. ఆయన ఒకే అంటారా..?

కొన్ని సార్లు కెమెరాలకు కనిపించినా, బోనుకు మాత్రం చిక్కలేదు. ఆ పులి ఆడతోడుని వెతుక్కూనే సమయంలో దానికి ఒక రోజులో ఇరవై నుంచి 30 కేజీల ఆహారం కావాలి. అందుకే ఆహారం కోసం జంతువులనే వేటాడుతోంది. మరో విషయం ఏంటంటే ఇది మేన్ ఈటర్ కానేకాదు. మనుషులకు దూరంగానే ఉండాలని ట్రై చేస్తోంది అంటున్నారు. ఎక్కడా ఈ వందరోజుల్లో మనుషులపై దాడి చేసినట్టు రికార్డ్ లేదు. అలాగే గ్రామాల్లో.. గ్రామస్థుల నుంచీ అలాంటి సమాచారం కూడా లేదని గుర్తు చేస్తున్నారు.  ఒకరకంగా మనుషుల జోలికి రాకపోవడం అనేది పెద్ద అడ్వాంటేజ్.. హ్యాపీ అనే చెప్పాలని అటవీ శాఖ అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tiger Attack, Vizag

ఉత్తమ కథలు