Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM MORE NUMBER OF FISHES DIED IN FOUND AT VISAKHAPATANAM THIS IS THE REASON NGS VSP

Fish: ఆ చేపల చెరువుకు ఏమైంది..? భారీ సంఖ్యలో ఎందుకు చనిపోతున్నాయి? స్థానికులు ఏం చేశారంటే

ఆ చేపల చెరువుకు ఏమైంది

ఆ చేపల చెరువుకు ఏమైంది

Fish: ఆ చెరువులో చేపలకు ఏమైంది..? అందులోనూ అది తాగునీటి చెరువు.. అయినా అక్కడ వందల చేపలు చనిపోతున్నాయి. దీంతో స్థానికులు ఆ చేపలను ఎత్తుకెళ్లిపోతున్నారు. దీంతో అధికారులు ఏం చేశారంటే?

    P Anand Mohan, News18, Visakhapatnam

    AP Fish: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆక్వా సాగుకి రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది. లాభాలు రావడంతో చాలాచోట్ల ఆక్వా రంగాన్ని నమ్ముకున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) పిఠాపురంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. చిత్రాడలోని వాటర్‌వర్క్స్‌కు సంబంధించిన చెరువులో గత రెండు రోజులూ భారీగా చేపలు (Fish) చనిపోయాయి. ఆ విషయం తెలిసినా మునిసిపల్‌ అధికారులు సకాలంలో స్పందించ లేదు. దీంతో చెరువులో నీరు పూర్తిగా కలుషితమైంది. మరోవైపు ఈ చేపలను గుట్టుచప్పుడు కాకుండా పట్టి మునిసిపల్‌ ట్రాక్టర్లలో తరలించి గోతులు తీసి పూడ్చివేశారు. తాగునీరు కలుషితమైనా అదే నీటిని పట్టణ ప్రజలకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    పిఠాపురం పట్టణ (Pitapuram Town) ప్రజలకు సమగ్ర మంచినీటి పథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. ఈ పథకానికి సంబంధించి చిత్రాడలో స్టోరేజీ ట్యాంకు ఉంది. ఈ ట్యాంకుకు గోదావరి జలాలు మళ్లించి కుమారపురంలోని వాటర్‌వర్క్స్‌ (Water WOrks) ద్వారా ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తారు. అయితే ఒకేసారి భారీగా చేపలు చనిపోయాయి అన్న విషయం ఆలస్యంగా తెలిసింది కొందరికి.. దీంతో స్థానికులు కలుషితమైన మంచి నీరు తాగి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.



    మరోవైపు చనిపోయిన చేపలను పట్టించి  తెల్లవారు జామున, ఉదయం సమయాల్లో మునిసిపల్‌ ట్రాక్టర్ల ద్వారా తరలించారు. వీటిని గుట్టుచప్పుడు కాకుండా గోతులు తీయించి పూడ్చివేశారు. చిత్రాడ గ్రామస్తులు కొందరు ఈ చేపలను పట్టుకుని విక్రయించడం, ఇళ్లకు తీసుకువెళ్లడం చేశారు. మరోవైపు చెరువులో చేపలు చనిపోవడంతో నీరు కలుషితం కావడంతోపాటు ఆ ప్రాంతమంతా దుర్గంధపూరితంగా మా రింది. ఇదే నీటిని కుళాయిలు ద్వారా సరఫరా చేస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనివల్ల తాము అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ఇదీ చదవండి : స్నేహితుడిని హత్యా చేసిన మరో ఇద్దరు స్నేహితులు... కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

    అయితే గత నాలుగు అయిదు రోజులుగా  చేపలు చనిపోతున్నాయని కొందరు చెబుతున్నారు. చెరువులో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతోపాటు వ్యర్థాలు తొలగించాల్సిన మునిసిపల్‌ అధికారులు ఆ పని చేయడం లేదని, బిల్లులు మాత్రం పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయానికి పరిమితం కావడంతో కుళాయిలు ద్వారా కలుషితమయిన, వాసన వస్తున్న నీరు వస్తోందని పట్టణ ప్రజలు అంటున్నారు.  దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన ఉం డడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఇదీ చదవండి : బీజేపీ సీనియర్ నేత దారి ఎటు..? ఆయన తీరుపై సొంత కేడర్ అసంతృప్తిగా ఉందా..? కారణం ఏంటంటే?

     ఆక్సిజన్‌ అందకే చేపలు చనిపోయాయని మునిసిపల్‌ అధికారులు చెబుతున్నారు. చెరువులో నీటిని ప్రస్తుతం కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని, బోర్ల ద్వారా నీటినే అందిస్తున్నామని తెలిపారు. మొత్తం మీద చేపలు ఇలా చచ్చిపోవడం.. అధికారులు పట్టించుకోకపోవడం చర్చనీయాంశం అయ్యింది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Fish, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు