Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM MORE DOUBTS IN MARRIED WOMEN MISSING CASE IN VISAKHAPATNAM BEACH NGS VSP

Missing Mystery: సాయి ప్రియ మిస్ అయిందా? మిస్ చేశారా? ఎన్నో అనుమానాలు.. ఇంతకీ ఏం జరిగింది?

పెళ్లి రోజునాడే గల్లంతైన వివాహిత కారణం ఏంటి..?

పెళ్లి రోజునాడే గల్లంతైన వివాహిత కారణం ఏంటి..?

Missing Mistory: ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన మిస్సింగ్ మిస్టరీపై అనుమానాలు పెరుగుతున్నాయి.. అసలు సాయి ప్రియ నిజంగానే మిస్ అయ్యిందా..? ఎవరైనా మిస్ చేశారా? రెండు రోజులు అవుతున్నా.. ఆమె ఆచూకీ ఎందుకు దొరకడం లేదు.

    P Anand Mohan, News18,Visakhapatnam.

    Crime News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వివాత మిస్సింగ్ (Women Missing) సంచలనంగా మారింది. అసలు ఆమె మిస్ అయ్యిందా..? లేక మిస్ చేశారా..? అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. విశాఖపట్నం (Visakhapatnam) ఆర్కేబీచ్‌ (RK Beach) లో అదృశ్యం అయిన సాయి ప్రియ ఆచూకీ కోసం సెర్చ్‌ ఆపరేషన్ ఇవాళ కూడా కొనసాగనుంది. మంగళవారం చీకటి పడ్డ దాకా గాలింపు కొనసాగినా.. సాయి ప్రియ ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో ఈ మిస్పింగ్ కేసులో అనుమానాలు  అంతకంతకూ పెరుగతున్నాయి.

    నిజంగానే భర్త చెప్పినట్టు.. సాయి ప్రియ (Saipriya) గల్లంతయ్యిందా? అక్కడినుంచి వేరే చోటికి వెళ్లిపోయిందా? లేకా కావాలనే ఆమెను మిస్ చేశారా..?  సోమవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అసలేం జరిగింది? అది కూడా భర్త పక్కనే ఉన్న.. భార్య నిమిషంలోనే ఎలా మాయమైంది..? ఒకవేళ అలల ధాటికి లోనికి కొట్టుకుని పోయినా.. 24 గంటలు దాటినా ఆచూకీ ఎందుకు లభించడం లేదు.. ఇలాంటి ప్రశ్నలు ఇప్పటికే అంతుచిక్కడం లేదు.   

    అసలు ఏం జరిగిందంటే..? సాయిప్రియ, శ్రీనివాస్ దంపతులకు పెళ్లై 25కు సరిగ్గా ఏడాది అయ్యింది. పెళ్లి రోజు కావడంతో సోమవారం ఉదయం 11 గంటలకు దంపతులు ఇంటి నుంచి బయలుదేరారు. 12 గంటలకు సింహాచలం గుడికి వెళ్లొచ్చారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు ఇంటికి చేరుకున్నారు. మళ్లీ సాయంత్రం మూడున్నర గంటలకు ఇంటి నుంచి బయలుదేరి నాలుగన్నర గంటలకు బీచ్ కు చేరుకున్నారు. 5గంటల 15 నిమిషాల వరకు బీచ్ మెట్లపై కూర్చుని సెల్ఫీలు దిగారు. 5 గంటల 20 నిమిషాలకు బీచ్ లో కి వెళ్లారు. గంటకు పైగా ఇద్దరూ నీటిలో ఇద్దరూ ఆడుకున్నారు. 6.30 గంటలకు తన వస్తువులను భర్తకు ఇచ్చిన సాయిప్రియ ఇంకొంత లోపలికి వెళ్లింది. 6గంటల 50 నిమిషాలకు ఓ మేసేజ్ రావడంతో అది చూసి వెనక్కి తిరిగి చూసేలోపే సాయిప్రియ మాయమైందని భర్త శ్రీనివాస్ చెబుతున్నాడు. చీకటి పడటం, చుట్టూ ఎవరూ చూడకపోవడంతో సాయిప్రియ మిస్సింగ్ మిస్టరీగా మారింది.

    ఇదీ చదవండి : వలతో పని లేదు.. చేపలు ఎలా పడుతున్నారో చూడండి.. ఎన్ని దొరికాయంటే?

    అసలు అనుమానాలు ఏంటంటే..? సముద్రం అన్నాక అలలు కామన్. కానీ, అడుగు లోతు నీటిలో ఉన్నప్పుడు అలలు వచ్చినా మనిషి కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంత బలమైన అల వచ్చినా అక్కడే కిందపడి వెంటనే లేవొచ్చు. కానీ, ఆ అల వెంటనే మనిషిని వెనక్కి లాక్కెళ్లే చాన్స్ చాలా తక్కువ. మరి, సాయిప్రియ విషయంలో ఏం జరిగింది? అలలే ఆమెను సముద్రంలోకి లాక్కెళ్లాయా? లేక సాయిప్రియ అక్కడి నుంచి మాయమైందా? ఇప్పుడీ వ్యవహారం సస్పెన్స్ గా మారింది. అడుగు నీటిలో నిలబడ్డప్పుడు అలల తాకిడి తక్కువే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సాయి ప్రియ మిస్ అయిన సమయంలో చీకటి పడటం, ఎవరూ చూడకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. అప్పటివరకు నీటిలోనే ఉన్న సాయిప్రియ తన వస్తువులన్నీ భర్తకు ఎందుకిస్తుంది? సాయిప్రియ ఇంకా లోతుకు వెళ్తుంటే భర్త శ్రీనివాస్ ఎందుకు ఆపలేదు? ఫోన్ చూసి తిరిగే లోపు సాయిప్రియ మాయమయ్యేందుకు ఇదేమైనా సినిమానా? సాయిప్రియ మిస్సింగ్ మిస్టరీలో ఇలా ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Vizag, Women missing

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు