Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM MONKEYPOX ALERT IN ANDHRA PRADESH AS SYMPTOMATIC YOUNG MAN GOES MISSING IN VISAKHAPATNAM FULL DETAILS HERE PRN

Monkeypox in AP: ఏపీలో మళ్లీ మంకీపాక్స్ కలకలం.. లక్షణాలున్న యువకుడు మిస్సింగ్.. అప్రమత్తమైన అధికారులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటికే విజయవాడ (Vijayawada), గుంటూరు (Guntur) లో ఇద్దరికి లక్షణాలు కనిపించినా ఆ తర్వాత టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. తాజాగా విశాఖపట్నం (Visakhapatnam) లో ఓ యువకుడిలో మంకీ పాక్స్‌ లక్షణాలు కనిపించడంతో అధికార, వైద్య వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  P Anand Mohan, News18, Visakhapatnam

  ఇప్పడిప్పుడే దేశంలోకి ఎంటర్ అవుతున్న మంకీపాక్స్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ కలకలం రేపుతోంది. ఇప్పటికే విజయవాడ (Vijayawada), గుంటూరు (Guntur) లో ఇద్దరికి లక్షణాలు కనిపించినా ఆ తర్వాత టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. తాజాగా విశాఖపట్నం (Visakhapatnam) లో ఓ యువకుడిలో మంకీ పాక్స్‌ లక్షణాలు కనిపించడంతో అధికార, వైద్య వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. గీతం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్న 22 ఏళ్ల యువకుడు కొద్దిరోజుల కిందట హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చాడు. అతను వచ్చినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతుండడంతోపాటు శరీరంపై ఎర్రని దద్దుర్లు రావడం గుర్తించిన సహచర విద్యార్థులు కళాశాల ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కళాశాలకు చెందిన వైద్యులు సదరు యువకుడిని పరిశీలించి శరీరంపై వున్న దద్దుర్లు, ఇతర లక్షణాలను బట్టి మంకీ పాక్స్‌గా అనుమానిస్తూ గీతం ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు.

  దీనిపై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జునకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఆయన తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి, ఆంధ్ర మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు. యువకుడిని పరిశీలించి నమూనాలు సేకరించేందుకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ (జనరల్‌ ఫిజీషియన్‌, డెర్మటాలజిస్ట్‌, మైక్రో బయాలజిస్ట్‌, మరో వైద్యుడు, ఇద్దరు సాంకేతిక సిబ్బంది)ను నియమించి గీతం ఆస్పత్రికి పంపించారు. అయితే ఐసోలేషన్‌ వార్డులో యువకుడు లేకపోవడంతో గీతం అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన గీతం ఆస్పత్రి అధికారులు స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించినట్టు తెలిసింది. ఆస్పత్రి పరిసరాలు, కళాశాల ఆవరణలో యువకుడి కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ వెనక్కి వచ్చింది.

  ఇది చదవండి: ఒక్కసారి అప్పుచేస్తే జీవితాంతం కట్టాల్సిందే.. వీళ్ల వడ్డీలకు అంతే ఉండదు..!


  యువకుడిలో మంకీ పాక్స్‌ లక్షణాలు ఉన్నందున నమూనాలను సేకరించి పూణెలోని ల్యాబ్‌కు పంపించాల్సి ఉంది. ఇందుకోసమే నిపుణులతో కూడిన బృందాన్ని అధికారులు నియమించారు. మంకీ పాక్స్‌ విషయంలో అప్రమత్తతంగా ఉండాలని, అనుమానిత కేసులుంటే వెంటనే పరీక్షలు చేయించాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం దీనిపై సీరియస్‌గానే దృష్టిసారించింది.

  ఇది చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని చికిత్సలు.. వివరాలివే..!


  మంకీపాక్స్ అనేది జూనోటిక్ వ్యాధి. ఎలుకలు, ప్రైమేట్స్ వంటి అడవి జంతువుల నుండి ఎక్కువగా ప్రజలకు వ్యాపిస్తుంది. ఇది మానవుని నుండి మానవునికి సంక్రమించే అవకాశం కూడా ఉంది. అనేక దేశాల్లో ఈ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఇది అరుదైన వ్యాధి, మశూచికి దారితీసే వైరస్ వంటి ఇతర పాక్స్ వైరస్ల మాదిరిగానే ఉంటుంది. మంకీపాక్స్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సోకే అవకాశం ఉంది. ఏదైనా గాయం, శారీరక సంపర్కం వల్ల కూడా ఇది వ్యాపిస్తుందట. ముఖ్యంగా మనషులకు అయితే.. ఒకరి నుంచి మరొకరికి కేవలం లైంగిక సంపర్కం వల్ల వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి మంకీపాక్స్‌కు గురైనప్పుడు, అది వెంటనే లక్షణాలను చూపించదు. వైరస్ కోసం పొదిగే కాలం ఏడు నుండి 21 రోజుల మధ్య ఉంటుంది.  జలుబు, దగ్గు, గొంతునొప్పితో పాటు శరీరంపై దద్దుర్లు వస్తాయి. ఆయా లక్షణాలకు అనుగుణంగా చికిత్స అందిస్తారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి వుండడంతో వైద్యం అందించేప్పుడు వైద్యులు పీపీఈ కిట్‌ ధరిస్తారు. రోగి కోలుకునేంత వరకు ఐసోలేషన్‌ గదిలో ఉంచుతారు. ఇదిలావుంటే అనుమానిత లక్షణాలున్నట్టు చెబుతున్న వ్యక్తికి సంబంధించిన వివరాలు చెప్పేందుకు జిల్లా అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Monkeypox, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు