హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jai Sri Ram: శ్రీరామ నవమి వేడుకల్లో వానరం సందడి.. స్వామి దగ్గరకు వచ్చి ఏం చేసిందో చూడండి

Jai Sri Ram: శ్రీరామ నవమి వేడుకల్లో వానరం సందడి.. స్వామి దగ్గరకు వచ్చి ఏం చేసిందో చూడండి

శ్రీరామ నవమి రోజు వానరం సందడి

శ్రీరామ నవమి రోజు వానరం సందడి

Jai Sri ram: శ్రీరామ నవమి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో గణంగా జరిగాయి. భక్తులంతా ఎంతో ఆధ్యాత్మిక భావనతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతున్నసమయంలో అక్కడికి ఓ వానరం వచ్చింది. వచ్చి ఏం చేసిందో తెలుసా..?

ఇంకా చదవండి ...

  Jai Sri Ram: జై శ్రీరామ్ అంటే ఏదో తెలియని తన్మయత్వం ఉంటుందని భక్తులు నమ్మకం.. తమ ఆరాధ్య దేవుడిగా ఎక్కువమంది శ్రీరాముడ్ని (Lord Srirama) కొలుస్తారు. ఆదర్శపురుషుడు.. ఏకపత్నీవ్రతుడు.. తండ్రి మాట జవదాటని కుమారుడు.. ఇలా శ్రీరాముడు గురించి చెప్పుకోవాలి అంటే ఎన్నో సుగుణాలు.. అందుకే ఆయన అందరికీ ఆదర్శం అంటారు. రామాయణం (Ramayanam) గురించి తెలిసిన వారందరికీ రాముని అవతారం గురంచి కచ్చితంగా తెలిసే ఉంటుంది. 'రామ' (Rama) అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని హిందువు ఉండడు అంటే అతి శయోక్తి కాదు. ప్రతి గ్రామంలో కచ్చితంగా రాముడి మందిరం ఉండి తీరుతుంది. బడి లేకపోయినా రాముడు గుడి ఉంటుంది అంటే అతి శయోక్తి కాదు. ఎందుకంటే రాముడుని నమ్మినట్టు హిందువులు మరే దేవుడిని నమ్మరేమో..? అందుకే శ్రీరమ నవమి (Sri Rama Navami) వేడుకలను అంత్యంత వైభవంగా జరుపుకుంటారు. గత రెండేళ్లూ కరోనా పరిస్థితుల కారణంగా నవమి వేడుకలకు భక్తులు దూరమయ్యారు. ఈ ఏడాది కరోనా రిలీఫ్ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అయితే సీతారాముల కళ్యాణం జరుగుతున్న సమయంలో ఓ వానరం వచ్చి ఏం చేసిందో తెలుసా..?

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఇటీవల జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఒక ఇంట్లోకి కోతి ప్రవేశించింది. అలా రావడమే కాదు.. అక్కడ కళ్యాణం జరుగుతుంటే.. స్వామి వారి కళ్యాణం అయ్యేంతవరకు అక్కేడే ఉండి కళ్యాణం మొత్తాన్ని తిలకించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా (Vizianagaram) బొబ్బిలి (Bobbili) ఇందిరమ్మ కాలనీలో అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆంజనేయస్వామివారే వచ్చి కళ్యాణం తిలకించారని పలువురు భక్తులు భావిస్తున్నారు. ఆ ఇంటి యజమానులు కూడా స్వయంగా హనుమంతుడే తమ ఇంటికి వచ్చాడని సంబరపడ్డారు..

  అందుకే కోతి ఇంట్లో తిరుగుతున్నా ఎవరూ ఇబ్బంది పడలేదు.. పైగా మరింత ఆప్యాయంగా ఆ వానరాన్ని చూసుకున్నారు. కోతి వచ్చిందనే భయం లేకుండా.. ఆ ఇంటి యజమానులు కళ్యాణం ఆపకుండా, కోతిని తరిమి కొట్టకుండా కళ్యాణం కొనసాగించారు. శ్రీరామనవమి రోజు ఈఘటన జరగటంతో అందరూ సాక్షాత్తు హనుమంతుడే స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. అయితే ఇదే తొలిసారి కాదు.. గతంలో కొన్ని చోట్ల ఇలా సీతారాముల కళ్యాణం జరుగుతున్నప్పుడు వానరాలు వచ్చాయి.. స్వామి వారి సేవలో కూడా పాల్గొన్నాయి. చాలామంది భక్తులు వాటిని హనుమంతుడే వచ్చాడని ఫీలవుతూ ఉంటారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Sri Rama Navami 2022, Vizianagaram

  ఉత్తమ కథలు