హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Miriyalu panta new: కొత్త రకాల మిరియాల మొక్కల పంపిణీ! అత్యధిక దిగుబడినిచ్చే మేలిజాతి

Miriyalu panta new: కొత్త రకాల మిరియాల మొక్కల పంపిణీ! అత్యధిక దిగుబడినిచ్చే మేలిజాతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మన్యం జిల్లాలో ఏడు రకాల కొత్త మిరియా పంటలు..? రైతులకు పంపిణీ చేయనున్న ఐటిడీఏ..! కాఫీ పంటలాగే మిరియాలు కూడా..? అధిక దిగుబడి కోసం ఐటిడిఏ ప్లాన్..? కార్యాచరణ రెడీ..!

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నేడలన యఉమ్మడి విశాఖ ఏజెన్సీలో ఇప్పుడు కాఫీ ఫేమస్. అయితే పాడేరు, అరకు కాఫీ తరహాలో మిరియాల సాగును విస్తరించేందుకు పాడేరు ఐటీడీఏ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గిరిజన రైతులకు కేరళ స్పైస్‌ బోర్డు అభివృద్ధి చేసిన ఏడు రకాల మేలిజాతి మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఈ మొక్కలు తెగుళ్లను తట్టుకోవడంతో పాటు ఒక్కొక్క మొక్క నుంచి 3-4 కిలోల దిగుబడినిస్తుంది. మిరియాల సాగుకు అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతం అత్యంత అనుకూలమని ఉద్యాన శాస్త్రవేత్తలు ఏళ్ల కిందట ప్రయోగాత్మకంగా నిరూపించారు.

కాఫీ పంటలాగే మిరియాలు కూడా:

పాడేరు గిరిజన రైతులు సుమారు 25 ఏళ్ల కిందట నుంచి కాఫీతో పాటు అంతర పంటగా మిరియాల పంటను సాగు చేస్తున్నారు. జిల్లాలో కాఫీ తరహాలో మిరియాల సాగును విస్తరించేందుకు పాడేరు ఐటీడీఏ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గిరిజన రైతులకు కేరళ స్పైస్‌ బోర్డు అభివృద్ధి చేసిన ఏడు రకాల మేలిజాతి మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఈ మొక్కలు తెగుళ్లను తట్టుకోవడంతో పాటు ఒక్కొక్క మొక్క నుంచి 3-4 కిలోల దిగుబడినిస్తుంది. మిరియాల సాగుకు అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతం అత్యంత అనుకూలమని ఉద్యాన శాస్త్రవేత్తలు ఏళ్ల కిందట ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈ మేరకు జిల్లాలో గిరిజన రైతులు సుమారు 25 ఏళ్ల కిందట నుంచి కాఫీతో పాటు అంతర పంటగా మిరియాల పంటను సాగు చేస్తున్నారు.

మొక్కల పంపిణీ ప్రారంభం:

మిరియాలకు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఉంది. కిలో రూ.500లకుపైగా ధర లభిస్తుంది. దీంతో గిరిజన ప్రాంతాల్లో మిరియాల సాగు విస్తీర్ణం పెంపునకు ఐటీడీఏ దృష్టి సారించింది. గిరిజన రైతులకు అత్యధిక దిగుబడినిచ్చే మేలిజాతి మొక్కలను పంపిణీ చేయాలని ఐటీడీఏ కేరళ కాలికట్‌ సుగంధ ద్రవ్య పంట బోర్డు నుంచి ఏడు రకాల మొక్కలను 2018లో దిగుమతి చేసుకుంది. చింతపల్లి హెచ్‌ఎన్‌టీసీ(ఉద్యాన క్షేత్రం, శిక్షణ కేంద్రానికి)లో ఈ మొక్కలపై మూడేళ్ల పాటు అధ్యయనం చేశారు. మొక్కలు ఏపుగా పెరగడంతో ఐటీడీఏ అధికారులు మొక్కల పంపిణీని ప్రారంభించారు.

అధిక దిగుబడినిచ్చేలా ప్లాన్:

ఆదివాసీ రైతులు రెండు లక్షల ఎకరాల్లో కాఫీని సాగు చేస్తున్నారు. ఈ కాఫీ తోటల్లో రైతులు 1.3 లక్షల ఎకరాల్లో మిరియాల సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది 4,540 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుంది. అయితే ఆదివాసీలు పన్నీయూర్‌ రకం మిరియాలను సాగు చేసుకుంటున్నారు. దీంతో ఒక్కొక్క మొక్క నుంచి గరిష్ఠంగా 1.5 నుంచి 2 కిలోల దిగుబడి మాత్రమే వస్తుంది. ఈ మొక్కలకు తెగుళ్ల తాకిడి కూడా అధికంగా ఉంది. దీంతో గిరిజన రైతులకు తెగుళ్లను తట్టుకునే అధిక దిగుబడినిచ్చే మొక్కల పంపిణీకి ఐటీడీఏ అధికారులు శ్రీకారం చుట్టారు.

గిరిజన రైతులకు ఐటీడీఏ అధికారులు ఏడు కొత్త రకాల మిరియాల మొక్కలను పంపిణీ చేస్తున్నారు. కేరళ కాలికట్‌ సుగంధ ద్రవ్య పంట బోర్డు నుంచి గిరిముండ, శక్తి, శ్రీకర, పంచమి, పౌర్ణమి, మలబార్‌ ఎక్సెల్‌, సుబ్కర రకాల 2307 మొక్కలను చింతపల్లి ఉద్యాన క్షేత్రం, శిక్షణ కేంద్రానికి దిగుమతి చేసుకున్నారు. ఈ ఏడు రకాల మొక్కలను చింతపల్లి ఉద్యాన క్షేత్రం, శిక్షణ కేంద్రంలో షేడ్‌నెట్‌ నర్సరీలో అభివృద్ధి చేస్తున్నారు. గిరిజన రైతులకు మిరియాల సాగులో మెలకువలపై ఐటీడీఏ ఉద్యానశాఖ అధికారులు సాంకేతిక శిక్షణ ఇస్తున్నారు. వివిధ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు హార్టీకల్చర్‌ అసిస్టెంట్ల ద్వారా రైతులకు తెలియజేస్తున్నారు. నాట్లు, చెట్లకు మొక్కలు పాకించే విధానం, ప్రూనింగ్‌, సేకరణపై రైతులకు ఐటీడీఏ ఉద్యానశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

First published:

Tags: Local News, Visakhapatnam

ఉత్తమ కథలు