Minster Comments: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజధాని (Capital) రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. విపక్షాలు అన్నీ అమరావతి (Amaravathi) నే రాజధాని (Capital)గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యమాల్లో కూడా పాల్గొంటున్నాయి. ఇటు వైసీపీ (YCP) మాత్రం మూడు రాజధానులే తమ లక్ష్యం అంటోంది. ఉత్తరాంధ్ర (North Andhra), రాయలసీమ (Rayalaseema) ల్లో ప్రత్యేక ఉద్యమాలు కూడా చేస్తోంది. ఈ విషయంలో మంత్రి ధర్మాన ప్రసాద రావు (Minister Dharmana Prasada Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం (Srikakulam) సిల్వర్ జుబ్లీ హాల్ ఆర్ట్స్ కాలేజీలో సిక్కోలు స్వచ్చంద సంస్దల సారధ్యంలో మన రాజధాని–మన విశాఖ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనకు మంత్రి పదవి కంటే.. ఉత్తరాంధ్ర ప్రాంతమే ముఖ్యమన్నారు.
ఏపీ విభజన చట్టంలో పదేళ్ళు రాజధానిగా హైదరాబాద్ ఉంది. అది వదిలేసి చంద్రబాబు ముడు నెలల్లో వచ్చేసారని.. శివరామకృష్ణ కమిటీ పెద్ద క్యాపిటల్ వద్దని సలహా ఇస్తే ..చంద్రబాబు తాబేదారులు చెప్పే విజయవాడ- గుంటూరు లో రాజధానే వద్దన్నారు.
అసలు ఒక్కచోట అభివృద్ది వద్దని శ్రీబాగ్ ఒడంబడిక నాడే అభిప్రాయాలు వచ్చాయి. దేశంలో చాలా రాష్ర్టాలలో హైకోర్ట్ ఒక దగ్గర , పరిపాలనా రాజధాని ఒకదగ్గర ఉన్నాయి. మంత్రి ఉద్యోగం కంటే తనకు ఈ స్దితికి తీసుకువచ్చిన ప్రజలే ముఖ్యం అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
అభివృద్ధిలో హెచ్చుతగ్గులు ఉండకూడదని ఒక సూత్రం నేడు ప్రపంచం పాటిస్తోంది అన్నారు. రాజ్యాంగం చెబుతున్నా , కమిటీలు చెబుతున్న చంద్రబాబు ఎందుకు పెద్ద క్యాపిటల్ చేసారు అని ప్రశ్నించారు. చంద్రబాబు వేసిన నారాయణ కమిటీ ఎవరితో చర్చించింది. రియల్ ఎస్టేట్ కోసం అమరావతి చుట్టూ ఉన్న భూములు బాబు, వారి బంధువులు కొనుగోలు చేసారన్నారు. ఐదుకోట్ల ప్రజల తలకాయలు బలి ఇవ్వడానికి బాబు సిద్దపడ్డారు అని నిలదీశారు.
ఇదీ చదవండి : కార్తీక మాసంలో తప్పక చూడాల్సిన ప్రాంతం.. ఎందుకంత ప్రత్యేకతో తెలుసా..?
చంద్రబాబుకి ఒక్క రియల్ ఎస్టేట్ తప్ప ఏం పట్టదన్నారు. రాష్ర్టంలో ఉన్న ఏకైక పెద్ద పట్టణం విశాఖ అని.. రాజధానికి అవకాశం ఉన్న ఒకే పట్టణం విశాఖే అన్నారు. చంద్రబాబు హైదరాబాద్ వదిలి రారన్నారు. కానీ ఇక్కడ ఉన్ననేతలకు ఏం అయ్యింది. చంద్రబాబు కు అనుగుణంగా మాటాడటానికి సిగ్గు లజ్జా ఉందా అన్నారు..? మూడు రాజధానులు అనేది కేవలం పేరుకు మాత్రమే అని.. ప్రధానమైన పరిపాలనా రాజధాని విశాఖ ఒక్కటి మాత్రమే అన్నారు.
ఇదీ చదవండి : వరుస వివాదాల్లో కాణిపాకం సిబ్బంది.. శ్రీవారి దర్శన టిక్కెట్లలోనూ చేతివాటం..
మీరు యజమానులు , మేం కూలీలుగా గేట్ కాపలాదారుగా ఉన్నాం. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్ల తరువాత ఇలా ఉండటం అన్యాయం కాదా అంటూ ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మాత్రమే అడకపోయినా క్యాపిటల్ ప్రకటించారని.. అందుకే మనం విశాఖ రాజధానిని చప్పట్లు కొట్టి ఆహ్వానించాలన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, AP Three Capitals, Srikakulam