Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM METEOROLOGICAL DEPARTMENT SAYS RAIN IN BOTH TELUGU STATES PAH

Rain fall: రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rain fall: రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.   దీని ప్రభావంతో ఇరు రాష్ట్రాలలో తేలికపాటి వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.

Rain In AP: రానున్న మూడు రోజుల్లో ఇరు రాష్ట్రాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాాతావరణ శాఖ తెలిపింది. దీంతో భానుడి ప్రతాపం నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది.

బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. ఇరు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా  మారిపోయింది. దీంతో ఆకాశం మేఘావృతం అయి ఇప్పటికే పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. అదే విధంగా తీర ప్రాంతాలలో తేలికపాటి వర్షం నమోదైంది. బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. దీనికి ఆసానీగా వాతావరణ శాఖ నామకరణం చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో తీర ప్రాంతాలలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

దీని ప్రభావంతో రానున్న మూడురోజులలో  తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే  తెలంగాణ లో గడిచిన మూడు రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. దీంతో ఎండ వేడిమికి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ప్రజలు కూడా.. ఎండ నుంచి ఉపశమనం కోసం శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటుండటంతో వాటికి గిరాకీ పెరిగింది.

గత శనివారం సాయంత్రం  పలు చోట్ల వర్షం పడటంతో నగరం ఒక్కసారిగా చల్లబడింది. ఇక మార్చిలోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే మధ్యాహ్నం అయ్యేసరికి ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడిపోతున్నారు. ఎండ నుంచి తప్పించుకోవడానికి ఇతర  ప్రత్యామ్నాయాలు పాటిస్తున్నారు. ఇటు ఎండలు ఇప్పుడు ఇలా ఉంటే.. ఏప్రిల్,మే నెలలో మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు భయపడిపోతున్నారు. ఇక గత వారం.. తేలికపాటి వర్షాలు కురవడంతో ప్రజలు కాస్త ఉపశమనం లభించినట్లైంది.

ఇక తీర ప్రాంతాలలో పలు చోట్ల కూడ ఈదురు గాలులు కురుస్తాయిని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తుపాను ప్రభావంతో తీర ప్రాంతాలతో పాటు, ఇతర ప్రాంతాలలో కూడా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, వీటితో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Andhra Pradesh, Rain alert, Visakhapatnam

తదుపరి వార్తలు