• Home
 • »
 • News
 • »
 • andhra-pradesh
 • »
 • VISAKHAPATNAM MEGASTAR CHIRANJEEVI SENSATIONAL TWEET FOR SUPPORT FIRE ON UNION GOVERNMENT NGS

Andhra Pradesh: అందరికీ ప్రాణం పోస్తుంటే? మీరు ప్రాణం తీస్తారా? కేంద్రంపై చిరంజీవి ఫైర్

కేంద్రంపై చిరంజీవి ఫైర్ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా ట్వీట్

కేంద్రాన్ని పెద్దగా ఎప్పుడూ విమర్శించని చిరంజీవి.. ఇప్పుడు రూటు మార్చారా. నేరుగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారా? అయితే చిరంజీవి చేసిన ట్వీట్ మాత్రం వందకు వంద శాతం నిజమే అంటున్నారు నిపుణులు. చిరంజీవి లాంటి వారు గట్టిగా గళం విప్పితే కేంద్రం తప్పక తమ మనసు మార్చుకుంటుంది అంటున్నారు.

 • Share this:
  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న చిరంజీవి.. ఇటీవల ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. ప్రభుత్వాల తీరును ప్రశ్నిస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన స్టీల్ ప్లాంట్ కు మద్దతు తెలుపుతూ సంచలన ట్వీట్ చేశారు.  గతంలో కూడా ఆయన స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు పలుకుతూ ట్వీట్ చేశారు.

  ప్రస్తతం ఏపీని కరోనా కేసులు భయపెడుతున్నాయి.  ఒక్కరోజులో నమోదయ్యే కేసుల సంఖ్య పది వేల మార్కును దాటుతోంది. దీంతో అంతా భయం భయంగా గడుపుతున్నారు. ఇలాంటి సమయంలోనూ విశాఖ కార్మిక సంఘాలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. అందుకే కారణం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే దిశగా కేంద్రం వడివడిగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.

  ఇలా కేంద్రంపై నిరసనలు తెలియజేస్తున్నా విశాఖ ఉక్కు కార్మికులు అదే సమయంలో ఉత్పత్తిని పెంచడంతో పాటు, విశాఖను లాభాల బాట పట్టించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనుకన్న ఫలితాలను సాధిస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి భయపెడుతోంది. 24 గంటల్లోనే 3 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులోనే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంది. చాలాచోట్ల కరోనా రోగులకు సరిపడ ఆక్సిజన్ లేక మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సమయంలో నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్. ఏపీ, తెలంగాణ ఒడిశాలతో పాటు పలు రాష్ట్రాలకు అవసరమైన ఆక్సిజన్ సప్లై చేస్తూ ప్రాణ దాతగా నిలుస్తోంది. అటు తీవ్ర ప్రభావం ఉన్న మహారాష్ట్రకు కూడా ప్రాణ వాయువును అందిస్తోంది. విశాఖ నుంచి ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్ ను రవాణ చేసేందుకు కేంద్రం ప్రత్యేక ట్రైన్ ను కూడా ఏర్పాటు చేసింది.

  కేంద్రం ఓవైపు నష్టాల సాకుతో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలి అనుకుంటుంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం కేంద్రం అడిగిన దానికి నో చెప్పకుండా ఆక్సిజన్ సరఫారా చేస్తూ కాలర్ ఎగురేస్తోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మెగా స్టార్ చిరంజీవి  ట్వీట్ చేశారు.  దేశమంతా ఆక్సిజన్ దొరకక కరోనా పేషెంట్స్ అల్లాడి పోతున్నారని.  ఈ రోజు ఓ స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారినికి వచ్చిదంటూ ట్వీట్ లో గుర్తు చేశారు. అక్కడ నుంచి 150 టన్నుల ఆక్సిజన్ ని మహారాష్ట్ర తీసుకెళ్తోంది అని.. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకు సుమారు 100 టన్నులకు పైగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తోంది అన్నారు. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి లక్షల మందికి ప్రాణాలని నిలబెడుతోంది అన్నారు. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేటు పరం చేయడం ఎంత వరకు సమంజసం మీరే ఆలోచించండి అంటూ స్వీట్ వార్నింగ్ లాంటి ఓ ట్వీట్ చేశారు.  చిరంజీవి ట్విట్ లో నిజంగానే అర్థం ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండం చేస్తుంటే.. ప్రాణ దాతగా నిలుస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్. అవసరమైతే ప్రతి రోజూ 500 టన్నుల ఆక్సిజన్ ను కూడా ఉత్పత్తి సామర్థ్యం ఉందని చెబుతోంది. ఇలాంటి సంస్థలు ప్రభుత్వం దగ్గరే ఉండడం మంచింది. నిజంగా ప్రైవేటీకరణ జరిగితే.. ఇప్పుడు ఆక్సిజన్ రేట్లు ఆకాశాన్ని అంటేవి.. కచ్చితంగా ఇలాంటి విపత్కర పరిస్థితులను ప్రైవేటు యాజమాన్యాలు తాము క్యాష్ చేసుకోడానికే ప్రయత్నిస్తాయి. ఆక్సిజన్ సరఫరా అనే కాదు. ప్రస్తుతం విశాఖ భారీగా లాభాలు కూడా గడిస్తోంది. అలాంటి ప్లాంట్ ను ప్రైవేటీకరించండంపై కేంద్రం పనరాలోచన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: