VISAKHAPATNAM MEGA FANS CELEBRATE RAM CHARAN BIRTH DAY IN DIFFERENT WAY IN EAST GODAVARI DISTRICT NGS
Happy Birthday Ram Charan: ఏపీలో రామ్ చరణ్ కి డిఫరెంట్‌గా శుభాకాంక్షలు చెప్పిన మెగా ఫ్యాన్స్..
హ్యాపీ బర్త్ డే టూ రామ్ చరణ్ (Twitter/Photo)
Happy Birthday Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదే శ్ లో మెగా అభిమానుల సందడికి అయితే హద్దే లేదు.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న మెగా అభిమానులు.. తమ స్టార్ హీరోకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
Happy Birthday Ram Charan: మెగాస్టార్ నట వారసుడిగా ‘చిరుత’ (Chirutha) గా అడుగుపెట్టి.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’ (Magadheera) తో టాలీవుడ్ (Tollywood) రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega power star Ram Charan) . ఓ వైపు మాస్ సినిమాల్లో నటిస్తూనే.. ధ్రువ (Dhruva), రంగస్థలం (Rangasthalam), ఆర్ఆర్ఆర్ (RRR) వంటి డిఫరెంట్ నేపధ్య సినిమాల్లో నటిస్తూ.. తన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు. పలు బ్లాక్ బస్టర్ హిట్స్ చేసిన చెర్రీ.. తాజాగా ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా అదరగొట్టి ఇండస్ట్రీ హిట్ లో భాగమవుతున్నాడు. ఇలా ఫుల్ జోష్ లో ఉన్న రామ్ చరణ్.. అదే ఉత్సాహంతో పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నారు. దీంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు చెర్రీకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇటు పుట్టినరోజు సందర్భంగా పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు చెర్రీకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా రామ్ రణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) రాజమ హేంద్రవరంలో అభిమానులు సందడి చేస్తున్నారు.
చెర్రీ ఫ్యాన్స్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలను చెబుతూ.. అభిమానులు నేలపై రంగులతో భారీ చిత్రాన్ని రూపొందించారు. అభిమానులే గంటల తరబడి శ్రమించి.. ఇలా తమ అభిమాన హీరో చిత్రాన్ని గీసి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. రాజమండ్రిలోని వి. ఎల్. పురంలోని కారు వాష్ షెడ్డు వెనుక ఖాళీ స్థలంలో చంటి, చరణ్ ఆర్ట్స్, చిన్నికోట అనే యువకులు తోటి అభిమానులతో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు.
అది కూడా 20 అడుగుల ఎత్తు, 16 అడు గుల వెడల్పు ఉండే ఈ చిత్రాన్ని నాలుగు రంగులతో రూపొందించారు వారు. చిత్రం పూర్తైన తరువాత రాం చరణ్ చిత్రం వేసిన ఆర్ట్ దగ్గర పెద్ద కేక్ తెప్పించి.. అక్కడే కట్ కోసి చరణ్ పుట్టినరోజు వేడుక నిర్వహించారు. తమ అభిమాన హీరోకి పుట్టిన రోజుకి RRR సినిమా విజయం సందర్బంగా ఈ చిత్రం రాంచరణ్ కు బహుమతి అని.. అందుకనే తాము ఈ చిత్రాన్ని రూపొందించామని అభిమానులు చెప్పారు.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. హీరోగా రామ్ చరణ్‌కు 15వ సినిమా. ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ పరిశీలన ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 14 యేళ్ల కెరీర్లో దాదాపు 14 చిత్రాల్లో నటించిన రామ్ చరణ్.. మరో మూడు చిత్రాలు లైన్లో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.