Vizag: తండ్రి కోసం స్వీపర్ గా మారిన కొడుకు.. చివరికి సీఎం జగన్ కు ట్వీట్? అసలేం జరిగింది?

స్వీపర్ గా మారిన కొడుకు కథలో ఎన్నో మలుపులు

మంచి ఉద్యోగం.. చదివింది ఎంబీఏ.. అయినా కన్న తండ్రిపై ప్రేమతో స్వీపర్ గా మారాలి అనుకున్నాడు. అయినా తన తండ్రిని చూసుకోలేపోయాడు. దీంతో ఆవేదనకు గురైన ఆ కొడుకు.. తనకు న్యాయం చేయాలి అంటూ సీఎం జగన్ కే నేరుగా ట్వీట్ చేశాడు. ఇంతకీ ఏం జరిగింది.

 • Share this:
  మధుకిషన్ ఎంబీఏ చదివాడు.. మంచి ఉద్యోగం ఉంది. అయినా స్వీపర్ గా మారాడు. అయితే కరోనా కష్ట కాలంలో కుటుంబాన్ని పోషించుకోడానికి కాదు.. తన తండ్రిపై ఉన్న ప్రేమతో ఇలా చదివిన చదువుకి సంబంధం లేకుండా ఆ పనికి సిద్ధమయ్యాడు. కానీ అతడి ఆశయం మాత్రం నెరవేరలేదు. ఇంతకీ ఏం జరిగింది.. సాధారణంగా కరోనా రోగుల దగ్గరకు.. బంధువులను.. వారితో పాటు వచ్చిన వారు ఎవరైనా లోపలికి అనుమతించరు.. కేవలం కింద మాత్రమే వెయిట్ చేయాలి.. దీంతో పైన ఏం జరుగుతోంది అనేది వారికి తెలిసే అవకాశం ఉండందు.. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడే అవకాశం ఇస్తారు. అయితే అలా ఫోన్ చేసినప్పుడు తనను ఎవరూ పట్టించుకోవడం లేదని.. బాత్ రూంకు కూడా వెళ్లనివ్వడం లేదని తండ్రి ఆవేదన చెందాడు. ఆ తండ్రి చెప్పిన మాటలతో కొడుకు మనసు కరిగిపోయింది. తన తండ్రి బాగోగులు తానే స్వయంగా చూసుకోవాలి అనుకున్నాడు.

  గత నెల 26న తండ్రి ఆరేపల్లి సుదర్శనరావుకు కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వారం రోజుల పాటు హోం ఐసోలేషన్ లో వున్న సుదర్శన రావు. పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారడంతో ఈనెల 2న ఆర్టీజీఎస్ 1902 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి.. కేజీహెచ్ సీఎస్ఆర్ కోవిడ్ ఎమెర్జెన్సీ వార్డులో జాయిన్ చేశాడు అతడి చిన్న కొడుకు మధు కిషన్. అయితే 3వ తేదీన అదే వార్డులో సుదర్శనరావు కాలు జారి పడిపోయాడు. దీంతో కాస్త గాయాలు అయ్యాయి. అతడికి గాయమైనా..‌ కనీసం పట్టించుకోలేదు నర్సింగ్ సిబ్బంది. దీంతో సిబ్బంది నిర్లక్ష్యం పైన, గాయాలకు ట్రీట్మెంట్ చేయకపోవడంపై కొడుకుకు ఫోన్ లో ఫిర్యాదు చేశాడు..

  తండ్రి ఆవేదనను విన్న కొడుకు.. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆర్టీజీఎస్ ద్వారా కేజీహెచ్ కోవిడ్ డాక్టర్లకు చెప్పించాడు కొడుకు మధు కిషన్. దీంతో సుదర్శన రావు గాయాలకు అక్కడి సిబ్బంది ట్రీట్మెంట్ చేశారు. కానీ తరువాత నుంచి సుదర్శన రావును అక్కడ సిబ్బంది వేధిస్తూ వచ్చారని కొడుకు ఆవేదన వ్యక్తం చేశాడు. ఫోన్ చేసినా ప్రతీసారీ సిబ్బంది నిర్లక్ష్యాన్ని కొడుకు ఫోన్ లో తండ్రి చెబుతూ వచ్చేవాడు. తండ్రి బాధలు విని తట్టుకోలేకపోయిన కొడుకు.. తన తండ్రిపై ఉన్న ప్రేమతో ఏదైనా చేయాలి అనుకున్నాడు. దగ్గరుండి తండ్రి బాగోగులు చూడాలి అనుకున్నాడు.

  బయట వారిని అనుమతించరని.. ఒక ప్లాన్ వేశాడు. పారిశుద్ధ్య కార్మికుడిగా ఆసుపత్రిలో చేరితే.. తండ్రి బాగోగులు చూసుకోవచ్చనుకున్నాడు. చాలా మందిని అడిగిన తర్వాత.. ఏకంగా స్వీపర్ గా అవతారమెత్తాడు. ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే పారిశుద్ధ్య కార్మికునిగా చేరాడు. ఈనెల 9న శానిటేషన్ కాంట్రాక్టర్ తో మాట్లాడి 10వ తేదీ రాత్రి స్లీపర్ విధుల్లో చేరాడు మధుకిషన్. అయితే విధుల్లో చేరేటప్పటికే తండ్రి విగత జీవిగా కనిపించడంతో ఆ యువకుడి గుండె బద్దలయింది.

  విధుల్లోకి చేరిన వెంటనే రాత్రి 10 గంటలకు ఆస్పత్రి వార్డు లోకి వెళ్లి.. తండ్రి చికిత్స పొందుతున్న పడక దగ్గరకు వెళ్లి చూశాడు. కానీ అక్కడ తండ్రి కనిపించలేదు అక్కడే ఉన్నమరొక స్వీపర్ ను తన తండ్రి గురించి అడిగితే బాత్ రూం లో పడి వున్నారంటూ సమాధానం చెప్పాడు. దీంతో అక్కడకు వెళ్లి చూడగా.. మరుగుదొడ్డి గది వరండాలో తండ్రి పడిపోయి ఉండడాన్ని గుర్తించాడు మధు కిషన్. ఆ దృశ్యం చూసి కొడుకు గుండె పగిలింది. అదే వార్డులో ఉన్న ఓ వ్యక్తి వచ్చి ఆయన ఎప్పుడో రెండున్నర గంటల ముందే బాత్ రూం లో చనిపోయాడని చెప్పడంతో బోరున కన్నీరు పెట్టుకున్నాడు. తండ్రి చూసుకుందామని స్వీపర్ గా మారినా.. ఫలితం లేకపోయిందని కన్నీరు మున్నీరు అయ్యాడు.

  తన తండ్రి మరణానికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆవేదన చెందాడు. ఆ ఆసుపత్రి నాలుగో ఫ్లోర్‌ సూపర్‌వైజర్‌, అక్కడి పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రి చనిపోయారని ఆరోపించాడు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌, సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ ఇన్‌ఛార్జి, కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌కు మధుకిషన్‌ ఫిర్యాదు చేశాడు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో తన తండ్రి మరుగుదొడ్డి వరండాలో పడిపోతే ఎవరూ పట్టించుకోలేదని ఫిర్యాదు చేశాడు. అయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

  ప్రస్తుతం తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఇలాంటి సమయంలో తన తల్లిని కాపాడుకోవడం కోసం ఎటూ వెళ్లలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వమే తనకు న్యాయం చేయాలని అని కోరుతున్న మధు కిషన్ తనకు జరిగిన అన్యాయంపై సీఎం జగన్ కు సైతం ట్వీట్ చేశారు. అయినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని.. తన తండ్రి   మరణానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోకుండా.. సాధరణ మరణంగా ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారని..వ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరాడక చనిపోయారంటూ  రిపోర్ట్ ఇవ్వడంపై ఆదేవన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే తనకు న్యాయం చేయాలని మధుకిషన్ ఫిర్యాదు డిమాండ్ చేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: