Vizag Pharmacity Blast: విశాఖ ఫార్మా సిటీలో పేలుడు... ఎగసిపడిన మంటలు... ఆరుగురికి గాయాలు

Vizag Pharmacity Blast | ఒక్కసారిగా మంటలు రావడంతో... ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. పేలుడు శబ్దాలు స్థానికులను హడలెత్తించాయి.

news18-telugu
Updated: July 14, 2020, 6:08 AM IST
Vizag Pharmacity Blast: విశాఖ ఫార్మా సిటీలో పేలుడు... ఎగసిపడిన మంటలు... ఆరుగురికి గాయాలు
విశాఖ ఫార్మా సిటీలో పేలుడు... ఎగసిపడిన మంటలు... ఆరుగురికి గాయాలు
  • Share this:
విశాఖపట్నం పరవాడ లకెలపాలెం దగ్గరున్న రాంకీ ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ సీఈటీపీ సాల్వెంట్ లిమిటెడ్ కంపెనీలో ట్యాంకర్ పేలడంతో ఈ మంటలు వచ్చాయి. అవి క్రమంగా పెద్దవి అవుతూ... పేలుడు శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలకు స్థానికులు, కంపెనీ ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కంపెనీకి చెందిన ఆరుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫార్మాసిటీలో మందులు తయారు చేసేటప్పుడు వృథా ఆయిల్‌ను రీసైక్లింగ్ చేస్తారు. అలా చేస్తున్నప్పుడు... రాత్రి 10కి నైట్ షిఫ్ట్ మొదలైన కాసేపటికే ఇలా జరిగింది. మొన్న రసాయన వాయువులు లీకై ఇద్దరు చనిపోయిన సాయినాథ్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీకి దగ్గర్లోనే ఈ సాల్వెంట్ కంపెనీ ఉంది.

మొత్తం 17సార్లు పేలుడు శబ్దాలు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. ఆ శబ్దాలు... దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించాయని తెలిసింది. ఘటనా స్థలానికి చేరిన ఫైర్ ఇంజిన్ల సిబ్బంది... పేలుళ్ల వల్ల మొదట మంటల్ని ఆర్పేందుకు దగ్గరకు వెళ్లలేకపోయారు. ఆ తర్వాత ధైర్యంగా ముందుకు వెళ్లి మంటల్ని అదుపుచేసే పని ప్రారంభించారు. అదే సమయంలో సిటీలో భారీ వర్షం కురిసింది. దాంతో... మంటలు అదుపులోకి వచ్చాయి. ఎల్జీ పాలిమర్స్‌, సాయినార్‌ ఫార్మా ఘటనలు మరువకముందే మరోసారి ఇలా జరగడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది.


పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీ వ్యర్థాలను సేకరించి శుద్ధి చేస్తుంది. సాల్వెంట్స్‌ను పంపిణీ చేస్తుంది. ఒక రియాక్టర్‌లో సాల్వెంట్స్‌ వేస్తుండగా పేలుడు సంభవించిందని అంటున్నారు. ప్రస్తుతం స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటనా స్థలంలో చెడు రసాయనాల వాసనలు ఏవీ లేవని అధికారులు అంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 14, 2020, 6:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading