హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Special Surgery: 13 ఏళ్ల బాలికకు విమ్స్ లో అరుదైన చికిత్స.. గత యాభై ఏళ్లలో 68వ చికిత్స ఇదే

Special Surgery: 13 ఏళ్ల బాలికకు విమ్స్ లో అరుదైన చికిత్స.. గత యాభై ఏళ్లలో 68వ చికిత్స ఇదే

విశాఖ డాక్టర్లు అరుదైన ఘనత

విశాఖ డాక్టర్లు అరుదైన ఘనత

Mass of Hair Removed: ఈ చిన్నారి వయసు 13 ఏళ్లు.. భరించలేని కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడేది.. ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా వేలకు వేలు ఖర్చు అవ్వడం తప్ప.. ఆమె సమస్య తీరడం లేదు. తాజాగా ఆ బాలిక సమస్యను గుర్తించిన విమ్స్ వైద్యులు.. అరుదైన చికిత్స ద్వారా ఆ బాలికకు కడుపు నొప్పి నుంచి విముక్తి కలిగించారు.

ఇంకా చదవండి ...

P Anand Mohan, Visakhapatnam, News18.

Mass of hair Removed: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. తాజాగా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Visakha Institute of Medical Science )ఈ అరుదైన చికిత్సకు వేదిక అయింది. గత కొన్ని నెలలు గా విమ్స్ ఆస్పత్రిలో అనేక అత్యాధునిక అరుదైన చికిత్సలు చేస్తూ ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రాణదాతగా నిలుస్తోంది. అయితే విమ్స్ లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అత్యాధునిక అరుదైన వైద్య సేవలు అందిస్తున్నారనే..  విషయం తెలుసుకుంటున్న ప్రజలు విమ్స్ ఆస్పత్రికి వస్తున్నారు. తాజాగా  రాజమండ్రికి చెందిన ఒక బాలిక తల్లిదండ్రులు వారి 13 ఏళ్ల కుమార్తె గత కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది.  అనేక ఆస్పత్రిలకు బాలికను తీసుకొని వెళ్లిన  రోగాన్ని కనిపెట్టడం గాని సరైన వైద్యం అందించడం గానీ జరగలేదు. విమ్స్ హాస్పటల్లో (Vims Hospital) లో ఆరోగ్యశ్రీ (Arogya Sri) ద్వారా ఉచితంగా అరుదైన వ్యాధులకు చికిత్సలు చేస్తారని తెలుసుకున్నా వారు విమ్స్ లో వైద్యులను సంప్రదించగా వారు రోగాన్ని గుర్తించి అరుదైన చికిత్స అందించి బాలికకు కడుపు నొప్పి నుంచి విముక్తి కలిగించారు.

అనేక ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా బాలిక తల్లిదండ్రులకు ఎక్కడ తమ కుమార్తె కడుపు నొప్పి గల కారణం తెలియలేదు. చివరగా విమ్స్ హాస్పిటల్ వైద్యులను సంప్రదించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు బాలికకు ఎండోస్కోపీ ద్వారా  పరీక్షలు నిర్వహించారు. చాలా అరుదైన ట్రైకోబెజార్ ( వెంట్రుకలతో  కూడుకొని ఉన్న  పదార్థాలు) తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి  వ్యాధులను గుర్తించటం చాలా కష్టమని అని వైద్యులు అంటున్నారు. ఇటువంటి ఈ సమస్యతో  గత 50 సంవత్సరాల్లో 68 మందికి మాత్రమే ఈ వ్యాధి నీ గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి : బ్రహ్మదేవుడి ఆలయాన్ని ఎప్పుడైనా చూశారా? కోనేరు మధ్యలో వెలిసిన సృష్టికర్త.. ప్రత్యేకత ఏంటంటే?

లాప్రోస్కోపీ తో వైద్యం   ట్రైకోబెజార్ తో బాధపడుతున్న వారికి మూడు విధాలుగా చికిత్సలు చేసి దానిని తొలిగిస్తామని వైద్యులు చెబుతున్నారు.  అందులో మొదటిది ఓపెన్ సర్జరీ  ద్వారా పొట్ట మొత్తం కోసి అందులో ఉన్న వెంట్రుకలతో కూడుకొని ఉన్న పదార్థాలను తొలగిస్తారు. రెండవది ఎండోస్కోపీ వెంట్రుకలతో కూడుకొని ఉన్న పదార్థాలు 20 గ్రాములు లోపు ఉంటే ఎండోస్కోపీ ద్వారా వాటిని తొలగిస్తారు. మూడోది అత్యాధునిక చికిత్సా లాప్రోస్కోపీ. అధిక మొత్తంలో ఉన్న పదార్థాలను వెలికితీయడానికి లాప్రోస్కోపీ ని ఉపయోగిస్తారు. బాలిక పొట్టలో అధిక మొత్తంలో వెంట్రుకలతో కూడుకొని ఉన్న పదార్థాలు ఉండటం వల్ల లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి వాటిని తొలగించారు.

ఇదీ చదవండి : పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లు.. అధికార పార్టీకి వార్నింగ్ లు.. టీడీపీ యువ నేతల జోష్ కారణం ఇదే?

ఈ బాలికకు సంబంధించి లాప్రోస్కోపీ ద్వారా  పొట్టలో ఉన్న 300 గ్రాముల ట్రైకోబెజార్ ( వెంట్రుకలతో కూడుకొని ఉన్న పదార్థాలు) తొలగించారు. ఇంత మొత్తంలో తొలగించడం చాలా అరుదని వైద్యులు తెలిపారు.

ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అత్యాధునిక చికిత్సలు అందిస్తున్నామని విమ్స్ డైరెక్టర్  డాక్టర్ కె రాంబాబు అన్నారు. విమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా అత్యాధునికమైన అరుదైన చికిత్సలు ఉచితంగా చేస్తున్నామన్నారు.  ఉచితంగా చికిత్స చేసి.. తమ కూతురు వ్యాధిని నయం చేసిన వైద్యులకు ధన్యవాదాలు చెప్పారు తల్లిదండ్రులు..

First published:

Tags: Andhra Pradesh, AP News, Vizag

ఉత్తమ కథలు