Setti Jagadeesh, News 18, Visakhapatnam
ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత కనక మహాలక్ష్మి (Kanaka Mahalakshmi) అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు రంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శారదా పీఠాదీపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీ (Swarupanandendra Sarsavathi Swamy) , స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ (Vasupalli Ganesh Kumar) జ్యోతి ప్రజ్వలన చేసే ఉత్సవాలు ప్రారంభించారు. వేద పారాయణ, సప్తశతీపారాయణ, లక్ష్మీ హోమం నిర్వహించారు. త్రికాలార్చన, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మత్య్సకార కార్పొరేషన్ చైర్మన్ గోదా గురువులు, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
సాధారణంగా అమావాస్య వెళ్లిన మరుసటి రోజు నుంచి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది అమవాస్య వెళ్లిన కొద్ది గంటలకే మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులతో ఆలయం కిటకిటలా డింది. ఆలయ సంప్రదాయం ప్రకారం వేదమంత్రా లు. నాదస్వరాలతో గణపతి పూజ, అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేశారు.
తరువాత పసుపు, ప్రత్యేక పూజల తరువాత అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించారు. గంటపాటు అమ్మవారు స్వర్ణాభరణ అలంకరణలోనే దర్శన మిచ్చారు. అనంతరం వెండి కవచం తొడిగారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నారు.
ఇదీ చదవండి : ముద్రగడ మళ్లీ యాక్టివ్ అవుతున్నారా.. వైసీపీ ఇచ్చిన ఓపెన్ ఆఫర్ ఏంటి..?
కిలోమీటర్లు మేర పొడుగునా ఉన్న భక్తులకు మంచినీరు మంచినీడ వస్తువులు కల్పించారు. ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తులు నిర్వహిస్తూ ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఏర్పాటు చేశారు. మార్గశిర మాసం అంతా కూడ ఇదే ఇదే విధంగా భక్తులు వస్తూ ఉంటారు. కార్తీక మాసం తరువాత మార్గశిర మాసం ప్రారంభం కావడంతో పెద్దఎత్తున ఈ కనకమహాలక్ష్మి అమ్మవారి వద్దకు భక్తులు వచ్చి మొక్కలు చెల్లించుకుంటారు.
ఇదీ చదవండి : రైతులకు అదిరిపోయే శుభవార్త.. డబుల్ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్ .. నేరుగా అకౌంట్లలోకి డబ్బు జమ
ప్రతి ఏట ఇదే మాదిరిగా వస్తున్నడంతో కాంప్లెక్స్ నుండి ఆలయం వరకు ఎటువంటి ట్రాఫిక్ లేకుండా భక్తులకు ఈజీగా తెలిసే విధంగా ఎప్పటికప్పుడు రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు త్వరగా దర్శనం అయ్యే విధంగా కూడా ఆలయ అధికారులు చూసుకుంటున్నారు.
ఇదీ చదవండి : ఏపీకి మూడు రాజధానుల ఫార్ములా వర్కౌట్ కాదా..? కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన లెక్క ఇదే
విశాఖలో కనకమహా లక్ష్మీ ఆలయానికి ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని మొక్కుకుంటే.. ఎలాంటి సమస్యలు అయినా తీరుపోతాయి అనేది భక్తుల నమ్మకం.. ఇక మార్గశిర మాసంలో అమ్మవారికి పూజలు చేస్తే.. ఆర్థిక పరమైన సమస్యలు.. ఉన్నా.. లేక ఇతర కోరికలు ఏవైనా తీరుతాయని భక్తులు నమ్ముతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Visakhapatnam