హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

లోంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు.. ఎవరో తెలుసా..?

లోంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు.. ఎవరో తెలుసా..?

పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు

పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు

చింతూరు మన్యంలో మావోయిస్టు దళ సభ్యుడు శుక్రవారం అల్లూరి చింతూ సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, రంపచోడవరం ఓఎసీజి. క్రిష్ణకాంత్, చింతూరు అదనపు ఎస్పీ మహేశ్వర రెడ్డి ఎదుట లొంగిపోయాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

చింతూరు మన్యంలో మావోయిస్టు దళ సభ్యుడు శుక్రవారం అల్లూరి చింతూ సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, రంపచోడవరం ఓఎసీజి. క్రిష్ణకాంత్, చింతూరు అదనపు ఎస్పీ మహేశ్వర రెడ్డి ఎదుట లొంగిపోయాడు. ఈ సందర్భంగా చింతూరు ఐటీడీఏ కార్యాలయ సమావేశపు మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ దళ సభ్యుడి వివరాలను వెల్లడించారు. ఆంధ్రా సరిహద్దు రాష్ట్రమైన చత్తీష్ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా గాదిరాస్ పోలీస్టేషన్ పరిధిలోని మరొకి గ్రామ పంచాయతీలో గల గాడెమ్ గ్రామానికి చెందిన మడకం బామన్ , మరొకి పంచాయతీ చైతన్య నాట్య మంచెకు అధ్యక్షుడు అయిన మడివి లచ్చ మాటలకు, పాటలకు ఆకర్షితుడై 2015 సంవత్సరంలో దళంలో చేరాడని అన్నారు.

మలగేర్ ఎల్వోఎస్ కమాండర్ దొడ్డి అయిత ప్రోద్బలంతో పూర్తి కాలం మావోయిస్ట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎస్సీఎమ్ సరఫరా బృందంలో పార్టీ సభ్యునిగా చేరి 2019 వరకు ఎన్జీఎస్ కటే కళ్యాణ్ సభ్యునిగా పని చేశాడని తెలిపారు. ఈ పని చేసిన కాలంలో ఇతను 303 తుపాకీ కలిగి ఉన్నాడని అన్నారు. దళ సభ్యు డిగా పని చేసిన కాలంలో అనేక హింసాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నాడని తెలిపారు.

ఇది చదవండి: రోడ్డెక్కితే నిర్లక్ష్యం వద్దు.. ఇక్కడ చూడండి ఏం జరిగిందో..!

ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి, పోలీస్ పరివర్తన కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనలతో పోలీసులు గిరిజనలకు చేరువుతుండటంతో పాటు ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధిని చూసి జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రశాంత జీవితం గడప డానికి లొంగిపోయాడని తెలిపారు. అంతేకాకుండా పార్టీలో పనిచేసినప్పుడు ఆదివాసీయేతర నాయకుల నుండి వివక్షత, మావోయిస్టుల అగ్రనేతల వ్యక్తిగత పనులు చేయడం ఇష్టంలేక ఈ నిర్ణయం తీసుకున్నాడని అన్నారు. దళసభ్యుడిగా పని చేసిన అడమయ్యకు ప్రభుత్వం పరంగా రావాల్సిన అన్ని రాయితీలను సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. దళ సభ్యుడు లొంగుబాటుకు కృషి చేసిన రంపచోడవరం ఓఎసీజి క్రిష్ణకాంత్, చింతూరు అదనపు ఎస్పీ మహేశ్వర రెడ్డి, చింతూరు సీఐ అప్పలనాయుడు, ఎస్సై యాదగిరిలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

మావోయిస్టులరా జనజీవన స్రవంతిలో కలవండి

మావోయిస్టులారా అడవులలో ఉండి సాధించేది ఏమి లేదని జనజీవన స్రవంతిలోకి కలిసి ప్రశాంత జీవనం సాగిం చాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. మావోయిస్టులు మనసుతో ఆలోచించి జనజీవన స్రవంతిలో కలసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ప్రజల్లోకి వచ్చి ప్రజ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

జన జీవన స్రవంతిలో కలసిన మావోలకు పోలీసు శాఖ, ప్రభుత్వం తరుపున పారితోషికాలు ఇస్తామని అలాగే మావోయిస్టుల పై ఉన్న రివార్డును సైతం అందిస్తామని పేర్కొన్నారు. అడవుల్లో ఉండి సాధించేదేమి లేదని మీ ఊర్లలలో ఉండి సాధించుకోవాలని అలా చేస్తే మీ ప్రశాంత జీవనానికి పోలీస్ శాఖ బాటలు వేసి తోడ్పాటును అందిస్తామన్నారు.

First published:

Tags: Local News, Maoists, Visakhapatnam

ఉత్తమ కథలు