హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Affair: డెడ్ బాడీకి అల్లంపేస్ట్, కారం పూసి తప్పించుకున్నారు.. కానీ ఆరు నెలల తర్వాత ఇలా దొరికారు

Affair: డెడ్ బాడీకి అల్లంపేస్ట్, కారం పూసి తప్పించుకున్నారు.. కానీ ఆరు నెలల తర్వాత ఇలా దొరికారు

Affair: ఓ వివాహితతో సహజీవనం చేస్తున్న యువకుడు.. ఆమె స్నేహితురాలితో ఎఫైర్ పెట్టుకున్నాడు. అంతేకాదు ఆమెను తీసుకెళ్లి మరో కాపురం పెట్టాడు. కట్ చేస్తే కొన్నాళ్ల తర్వాత కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ఈ స్టోరీ అనూహ్య మలుపులు తిరిగింది.

Affair: ఓ వివాహితతో సహజీవనం చేస్తున్న యువకుడు.. ఆమె స్నేహితురాలితో ఎఫైర్ పెట్టుకున్నాడు. అంతేకాదు ఆమెను తీసుకెళ్లి మరో కాపురం పెట్టాడు. కట్ చేస్తే కొన్నాళ్ల తర్వాత కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ఈ స్టోరీ అనూహ్య మలుపులు తిరిగింది.

Affair: ఓ వివాహితతో సహజీవనం చేస్తున్న యువకుడు.. ఆమె స్నేహితురాలితో ఎఫైర్ పెట్టుకున్నాడు. అంతేకాదు ఆమెను తీసుకెళ్లి మరో కాపురం పెట్టాడు. కట్ చేస్తే కొన్నాళ్ల తర్వాత కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ఈ స్టోరీ అనూహ్య మలుపులు తిరిగింది.

  ఈ రోజుల్లో జరిగే చాలా నేరాలకు అక్రమ సంబంధాలే కారణమవుతున్నాయి. ఎవరితో ఎవరు సంబంధం పెట్టుకున్నా దాని క్లైమాక్స్ ఖచ్చితంగా క్రైమ్ అవుతోంది. తాజాగా ఓ వివాహితతో సహజీవనం చేస్తున్న యువకుడు.. ఆమె స్నేహితురాలితో ఎఫైర్ పెట్టుకున్నాడు. అంతేకాదు ఆమెను తీసుకెళ్లి మరో కాపురం పెట్టాడు. కట్ చేస్తే కొన్నాళ్ల తర్వాత కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ఈ స్టోరీ అనూహ్య మలుపులు తిరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా పరవాడ మడలం నాయుడుపాలెం శివారు వెంకటపతిపాలెం గ్రామానికి చెందిన వియ్యపు అఖిలేష్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. రెండేళ్ల క్రితం స్వాతి అనే వివాహితను తీసుకొని గాజుకావ సమీంలోని రామచంద్రానగర్ లో కాపు పెట్టాడు.

  ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మరో వివాహిత సంతోషితో స్వాతికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకే డ్వాక్రా గ్రూపులో సభ్యులు కావడంతో తరచూ ఇంటికి వచ్చి వెళ్తుండేది. దీంతో అఖిలేష్ కూడా సంతోషితో పరియచం పెంచుకున్నాడు. క్రమంగా అది వివాహేతర సంబంధానికి దారితీసింది. గత ఏడాది మార్చిలో అఖిలేష్.. సంతోషిని తీసుకొని అనకాపల్లి.. అక్కడి నుంచి పద్మనాభం వెళ్లిపోయి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. మరోవైప సంతోషి కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపేశారు.

  ఇది చదవండి: లాయర్ అంటూ పోలీసులనే బురిడీ కొట్టించాడు.. ఈ జాదూగాడు మామూలోడు కాదు..


  ఇదిలా ఉంటే సంతోషి బావ సనా వాసు, అతడి స్నేహితులు వంశీ, సందీప్ రెడ్డి.. అఖిలేష్ ను కలిసి పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. అఖిల్ చేసిన పనికి మనస్తాపానికి గురైన స్వాతి పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజులకు అఖిలేష్ అదృశ్యమయ్యాడు. నెలలు గడుస్తున్న కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో అతడి తండ్రి ముత్యాలనాయుడు.. గత ఏడాది నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు గతంలో జరిగిన ఘటనల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో వాసు, వంశీ, సందీప్ రెడ్డిపై అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకోని విచారించగా అఖిలేష్ ను తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

  ఇది చదవండి: అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఇదే.. వీళ్ల తెలివి మామూలుగా లేదు..


  డెడ్ బాడీకి కారం, అల్లంపేస్ట్

  పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా అఖిలేష్ తీరులో మార్పు రాలేదు. కొన్నాళ్లకే సంతోషిని తీసుకొని మళ్లీ వెళ్లిపోవడం వాసు అతడ్ని నిలదీశాడు. ఆమె గురించి తనకు తెలియదని అఖిలేష్ వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఐతే పక్కకెళ్లి మాట్లాడుకుందాం రమ్మంటూ అఖిలేష్ ను పద్మనాభం సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు.. అతడి తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. డెడ్ బాడీ నుంచి రక్తం, దుర్వాసన రాకుండా ఉండేందుకు శరీరానికి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పూసి దానిని పొదల్లో పడేశి వెళ్లిపోయారు. విచారణలో భాగంగా నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లగా అక్కడ అఖిలేష్ దుస్తులు, పుర్రె, ఎముకలు లభ్యమయ్యాయి. ఘటన జరిగి ఆరు నెలలైనా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Andhra Pradesh, Extramarital affairs, Visakhapatnam

  ఉత్తమ కథలు