P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18
ఇష్టపడ్డానంటే సిగ్గుపడింది.. ప్రేమించానంటే పొంగిపోయింది. ఒకే చోట జాబ్.. అతడ్ని పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామనుకుంది. కానీ వాడు మాత్రం ఆమెను ఆటబొమ్మగానే చూశాడు. ప్రేమ పేరుతో వంచించాడు. పెళ్లి చేసుకుంటానని దగ్గరయ్యాడు. అవసరం తీరిన తర్వాత అసలు రంగు బయటపెట్టాడు. యువతిని నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. ఆ మృగాడి వేధింపులు భరించలేని యువతి పోలీసులను ఆశ్రచింయించింది. అయినా న్యాయం జరగకపోవడంతో ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం 104 ఏరియా అశోక్ పార్క్ ప్రాంతానికి చెందిన యువతి అక్కయ్యపాలెంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. అదే సంస్థలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన జగదేశ్వరరావుతో పరిచయమైంది. నిన్ను ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానంటూ యువతిని నమ్మించాడు. గత ఏడాది ఆగస్టులో ఆమెను బలవంతం చేసి శారీరకంగా అనుభవించాడు. ఆ సమయంలో యువతిని నగ్నంగా వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి తరచూ అత్యాచారానికి పాల్పడుతుండేవాడు.
ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు. యువతి గట్టిగా మాట్లాడిన ప్రతిసారి నగ్నవీడియోలు ఇంటర్నెట్లో పెడతానని బెదిరించేవాడు. తల్లి చనిపోవడం, తండ్రి అనారోగ్యంతో మంచంపై ఉండటంతో యువతి కూడా భయంతో అతడు చెప్పినట్లు వినేది. ఓ రోజు తనను పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిలదీయగా రూ.7 లక్షలు కట్నంగా ఇస్తేనే తాళికడతానని లేదంటే లేదని తెగేసి చెప్పాడు. తనను ఎవరూ ఏమీ చేయలేరని.. పోలీసులతో రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయని ఆమెను భయభ్రాంతులకు గురిచేసేవాడు.
చివరకు ఈ ఏడాది మే 23న ధైర్యం తెచ్చుకొని ఎండాడ సమీపంలోని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అక్కడి సీఐకి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించగా... కనీసం జీరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని ఉచిత సలహా ఇచ్చారు. ఆ తర్వాత యువతి ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ అక్కడి పోలీసులు కూడా ఆమెను ఫిర్యాదు పేరుతో నెలరోజులు తిప్పించుకొని వేధించారు. దీంతో చేసేది లేక అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా సీపీకి వాట్సాప్ ద్వారా పంపింది.
ఈ విషయం తెలుసుకున్న జగదీశ్వరరావు ఆమెపై దాడి చేసి మరోసారి లైంగికదాడి జరిపాడు. సీపీ ఆదేశాల మేరకు యువతిని మరోసారి పోలీస్ స్టేషన్ కు పిలిచిన సీఐ.. రాత్రి వరకు అక్కడే ఉంచి పంపేశారు. లాక్ డౌన్ సమయంలో అర్ధరాత్రి 5 కిలోమీటర్ల నడుచుకుంటూ ఆమె ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అదే రోజు జగదేశ్వరరావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐతే బాధితురాలు అనారోగ్యానికి గురికావడంతో సొంతఖర్చులతో జీజీహెచ్ కు వెళ్లాలని పోలీసులు సూచించారు. కానిస్టేబుల్ సాయంతో కేజీహెచ్ లో జాయిన్ చేయగా ఆమెకు మరోసారి అబార్షన్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం యువతికి కేజీహెచ్ లోనే చికిత్స పొందుతోంది. తనకు అన్యాయం చేసిన వాడిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని ఆమె పోలీసులను వేడుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Love cheating, RAPE