Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM MAN ARRESTED FOR THEFT MANY HOUSES BY OPENING DOORS THROUGH WINDOWS IN VISAKHAPATNAM FULL DETAILS HERE PRN VSP

Window Theft: కిటికీలో చేయిపెట్టి దోచేస్తాడు.. ఈ దొంగ రూటే సపరేటు..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Visakhapatnam: మీరు చాలా రకాల దొంగలు (Thefts) గురించి చదివే ఉంటారు. కొందరు దొంగలు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం ప్రత్యేకంగా ఉంటారు. అలాంటి వారిలో ఒక దొంగని పోలీసులు పట్టుకున్నారు. దొంగ చాలా ప్రత్యేకమైన వాడు.

ఇంకా చదవండి ...
    P. Anand Mohan, Visakhapatnam, News18

    64 కళల్లో చోర కళ కూడా ఒకటి. ఎవరికీ అనుమానం రాకుండా.. తెలియకుండా లాఘవంగా వస్తువులను దోచేయడం ఈ కళకు ఉన్న స్పెషాలిటీ. ఈ కళనే ఒకడు వృత్తిగా మార్చుకున్నాడు. అంతేకాదు రికార్డులు సృష్టించాడు కూడా. మీరు చాలా రకాల దొంగలు (Thefts) గురించి చదివే ఉంటారు. కొందరు దొంగలు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం ప్రత్యేకంగా ఉంటారు. అలాంటి వారిలో ఒక దొంగని పోలీసులు పట్టుకున్నారు. దొంగ చాలా ప్రత్యేకమైన వాడు. ఈ దొంగ ప్రత్యేకించి కిటికీలు మాత్రమే ఓపెన్ చేసి దొంగతనం చేస్తాడట‌. మరే విధమైన పద్ధతిని ఉపయోగించడని పోలీసులు తెలిపారు అయితే ఇప్పటిదాకా ఆయన దాదాపు యాభై ఇదే విధంగా చేశాడని చెప్పడం గమనార్హంకిటికీల్లోంచి చేతులు పెట్టి తలుపులు తీసి దొంగతనాలకు పాల్పడే దొంగను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పెద్దమొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.

    ఇటీవల విశాఖపట్నం (Visakhapatnam) లోని పాత గాజువాక పరిధిలో ఎల్‌.వి.నగర్‌లో మూడు, డ్రైవర్స్‌కాలనీ, జగ్గవానిపాలెం తదితర ప్రాంతాల్లో ఇటీవల దొంగతనాలు జరిగాయి. మొత్తం 284 గ్రాముల బంగారు ఆభరణాలు, 800 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.5.33 లక్షల నగదు చోరీకి గురయినట్లు బాధితులు విడివిడిగా ఫిర్యాదు చేశారు. కంప్లైంట్స్ అందుకున్న పోలీసులు పాత నేరస్తుడైన తోట శివభవానీ అలియాస్‌ శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. దొంగతనాలు తానే చేసినట్లు ఒప్పుకున్నాడు.

    ఇది చదవండి: ప్రియుడి కోసం యువకుడి ఆందోళన... దుబాయ్ లో తెలుగు యువకుల పెళ్లి... ఏపీలో రచ్చ రచ్చ...!


    అతనికి సహకరించిన పాత గాజువాక టి.వి.ఎన్‌.కాలనీకి చెందిన సిహెచ్‌ పురుషోత్తమ్‌, ఒక బాలుడితో పాటు దొంగతనం సొత్తును తీసుకున్న శివభవాని భార్య తోట వరలక్ష్మీ, తూ.గో. జిల్లా ధవళేశ్వరం దరి కొత్తపేటకు చెందిన ఎం.మహేశ్వరదుర్గాప్రసాద్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి 253 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.600 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.5.46 లక్షలు వరకు ఉంటుందని అంచనా.

    ఇది చదవండి: పెళ్లై 16 రోజులైనా కాలేదు... ఆమె ఊహించింది ఒకటి.. జరిగింది మరొకటి...


    పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన తోట శివభవానీ 2018 నుంచి సుమారు 250కు పైగా దొంగతనాలు చేసినట్లుగా కేసులు నమోదయ్యాయని.. కేవలం ఇళ్లలో మాత్రమే దొంగతనాలు చేస్తుంటాడని ఏసీపీ శ్రావణ్‌ తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ రూరల్‌, విజయవాడల్లోనూ పలు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కిటికీలోంచి చేయి పెట్టి తలుపులు తీయటం, తాళాలు బద్దలు కొట్టి ఇళ్లల్లోకి ప్రవేశించటంలో ఇతను సిద్ధహస్తుడన్నారు. నాలుగు కేసులకు సంబంధించిన చోరీ సొత్తు మాత్రమే స్వాధీనం చేసుకున్నామని, ఇంకా రికవరీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Theft, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు