హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Maha Shivarathri 2023: బ్రహ్మ ప్రతిష్టించిన శివాలయం గురించి తెలుసా..? శివరాత్రి రోజు దర్శించుకుంటే ఏ కోరికైనా తీరినట్టే..

Maha Shivarathri 2023: బ్రహ్మ ప్రతిష్టించిన శివాలయం గురించి తెలుసా..? శివరాత్రి రోజు దర్శించుకుంటే ఏ కోరికైనా తీరినట్టే..

బ్రహ్మ ప్రతిష్టించిన శివలింగం

బ్రహ్మ ప్రతిష్టించిన శివలింగం

Maha Shivaratri 2023: శివుడికి అత్యంత ప్రీతికరమైన దినం శివరాత్రి.. అలాంటి పర్వదినం రోజున ఈ శివాలయాన్ని దర్శించుకుంటే కోరిక ఏదైనా తీరిపోతుందని నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడి శివలింగాన్ని స్వయంగా బ్రహ్మ ప్రతిష్టించాడని అంటారు.. ఈ శివాలయం ఎక్కడ ఉందో తెలుసా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Famous Temple in Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో శివ రాత్రి శోభ అప్పుడే మొదలైంది. భక్తులంతా ఓం నమశివ్వాయ అంటూ పులకించి పోతున్నారు. ప్రముఖ శివలాయాలు (Lord Shiva Temple).. ముందు రోజు నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి అంటే పరమ శివుడికి చాలా ప్రీతికరమైంది.. ఇలాంటి పర్వదినం రోజున.. తప్పక దర్శించుకోవాల్సిన శివాలయం ఒకటి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) లో ఉంది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ దేవాలయాలలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం ప్రత్యేకత తెలిస్తే షాక్ అవుతారు. ఇక్కడి శివలింగాన్ని స్వయంగా బ్రహ్మే ప్రతిష్టించాడని చెబుతారు. అందుకే ఈ ఆలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది.

బ్రహ్మలింగేశ్వర ఆలయం విశాఖ జిల్లా నర్సీపట్నానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బలిఘట్టంలో ఉంది. ఈ దేవాలయం అతి పురాతనమైనది. కృతయుగంలో రాక్షస రాజైన 'బలిచక్రవర్తి' అనేక యజ్ఞ యాగాదులు చేసినట్టు పురాణములు చెబుతున్నాయి. ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉండి పక్కన ఉన్న వరహానది ఉత్తరంగా ప్రవహించడంతో దక్షిణకాశీగా ఈ క్షేత్రంగా కూడా గుర్తింపు పొందింది.

ఇదీ చదవండి: కన్నా వర్సెస్ బీజేపీ.. రాజీనామాను ముందే పార్టీ పసిగట్టిందా..? కౌంటర్ ప్లాన్ ఇదే

ఆలయ స్థల పురాణం

లోక కళ్యాణార్ధం తలపెట్టిన యజ్ఞానికి శివారాధన నిమిత్తం బలిచక్రవర్తి బ్రహ్మను ప్రార్ధించి శివలింగాన్ని భువికి రప్పించారు. ఈ కొండ మీద బలిచక్రవర్తి తన ఇష్ట దైవమైన పరమేశ్వరుని ప్రతిష్టించ తలపెట్టి... సృష్టి విధాత అయిన బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు.  బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడే వచ్చి శివలింగ ప్రతిష్ట చేశారని పూర్వీకులు చెప్పిన మాట. బ్రహ్మ ప్రతిష్టించడంతో  శ్రీ స్వామి వారికి  బ్రహ్మలింగేశ్వర స్వామి  అనే పేరు వచ్చింది. ఈ పర్వత శ్రేణిలోని మూడు పర్వతము త్రిశూల ఆకృతిలో వరుసగా ఉంటాయి. శివలింగాన్ని త్రిశూల పర్వతములకు అభిముఖముగా అంటే పశ్చిమ ముఖముగా ప్రతిష్టించారు.

సహజ సిద్ధమైన విభూతి గనులు…!

బలిచక్రవర్తి యజ్ఞ్నము చేసినట్లు ఆధారంగా ఇక్కడ సహజ సిద్ధమైన విభూతి గనులు ఉన్నాయని చెబుతారు. ఇవి ఆనాటి హోమ గుండములుగా చెబుతుంటారు. బలిచక్రవర్తి యజ్ఞం చేసిన ప్రాంతం కావడంతో బలిఘట్ట అను గ్రామము ఈ పర్వత ప్రాంతములో ఏర్పడింది. ఘటము అనగా యజ్ఞం.

ఇదీ చదవండి : ఏపీ బీజేపీలో మరో వివాదం.. ఎంపీ జీవీఎల్ కు పురందేశ్వరి కౌంటర్

వరాహా నది

ఆలయానికి సమీపంలో వరహానది ఉత్తర వాహినిగా పేరుపొంది విష్ణుదేవుని ప్రసాదంగా వినుతి కెక్కింది. హిరాణ్యాక్షుని వెంటాడుతూ విష్ణువు వరాహారూపంలో భూమిని చేరుకుని పయనించడం వల్ల ఆ సమయంలో బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రసాదించిన శివలింగానికి అభిషేకం నిమిత్తం నీరు కావాలని విష్ణుమూర్తిని కోరగా వరాహా రూపంలో ఉన్న విష్ణు ఈ మార్గం గుండా నదిని ఏర్పరడటంతో వరహానదిగా పేరుగాంచినట్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి : జనసేన అన్నారు.. టీడీపీ వైపు వెళ్తున్నారా..? అసలు కారణం ఇదే..?

దక్షిణ కాశీగా పేరు ఎలా వచ్చింది?

ఇక్కడ వరాహి నది ఉత్తర దిక్కుగా ప్రవహించడంతో ఉత్తరవాహినిగానూ.. ఇక్కడ శివలింగం పశ్చిమ ముఖంగానూ ఉండటం వల్ల ఈ ప్రాంతం దక్షిణ కాశీగానూ చరిత్రలో నిలిచింది. ఉత్తర భారతదేశములో కాశీ (వారణాసి) శ్రీ విశ్వశ్వరస్వామి వారి ఆలయంలోలాగే ఇక్కడ కూడా శివుడు పశ్చిమాభిముఖముగా ఉన్నందున బలిఘట్నం ఆలయాం దక్షిణ కాశీగా పేరుగాంచినది. ఇచ్చలు శివలింగము స్పటిక శిలతో ఉండటం వల్ల స్వామి బహు శోభాయమానంగా కనబడుతుంది.

ఇదీ చదవండి: శివరాత్రి రోజు ఈ శివాలయాన్ని దర్శించుకుంటే చాలు.. ఎన్నో జన్మల పుణ్యం

ఇక శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే రుద్రాభిషేకాలు, ఏకవారాభిషేకాలు కూడా నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: లోకేష్ అన్నది నిజమే..? ఏ కలర్‌ చీర కావాలో చెబితే పంపిస్తానన్న రోజా

టైమింగ్స్‌: భక్తుల సందర్శనార్థం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటుంది. తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 07:30 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ సమయంలో ఈ ఆలయానికి వెళ్తే..అటు స్వామి దర్శనంతో పాటు ప్రకృతి కూడా రమణీయంగా ఉంటుంది.

ఇదీ చదవండి : టీడీపీ నేతకు.. వైసీపీ బంపర్ ఆఫర్.. చంద్రబాబుకు సీఎం జగన్ మాస్టర్ స్ట్రోక్

ఎలా వెళ్లాలి?

విశాఖపట్నం నుంచి 75కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రోడ్డు మార్గం ద్వారా వెళ్లొచ్చు. బలిఘట్టానికి రైలు మార్గం లేదు. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ వరకు వెళ్లి అక్కడ నుంచి రోడ్డుమార్గం ద్వారా వెళ్లాల్సిందే..

First published:

Tags: Andhra Pradesh, AP News, Hindu Temples, Lord Shiva, Maha Shivaratri 2023, Visakhapatnam

ఉత్తమ కథలు