హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vinayaka Chavithi-2022: ఈ సారి వినాయకచవితి చాలా కాస్ట్లీ..! ధరలు తెలిస్తే హడలిపోతారు..! కారణం ఇదే..!

Vinayaka Chavithi-2022: ఈ సారి వినాయకచవితి చాలా కాస్ట్లీ..! ధరలు తెలిస్తే హడలిపోతారు..! కారణం ఇదే..!

చవితికి

చవితికి సిద్ధమవుతున్న గణపతి విగ్రహాలు

వినాయక చవితి (Vinayaka Chavithi 2022) కోసం తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఎక్కడిక్కకడ గణనాథుడి విగ్రహాలు రెడీ అవుతున్నాయి. తొమ్మిరోజుల పాటు పూజలందుకునేందుకు బొజ్జ గణపయ్య ముస్తాబవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhaptnam) లో వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News18, Visakhapatnam


  వినాయక చవితి (Vinayaka Chavithi 2022) కోసం తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఎక్కడిక్కకడ గణనాథుడి విగ్రహాలు రెడీ అవుతున్నాయి. తొమ్మిరోజుల పాటు పూజలందుకునేందుకు బొజ్జ గణపయ్య ముస్తాబవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhaptnam) లో వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా వినాయక చవితి ఉత్సవాలను భక్షలు నిర్వహించుకోలేక పోయారు. ఈ ఏడాది ఆంక్షలు లేకపోవడంతో ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు ప్రజలు సిద్ధ మవుతున్నారు. అందుకు అనుగుణంగా వినాయక విగ్రహాల తయారీ ప్రక్రియ విశాఖ నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. భక్తుల మనసు దోచు కునే ఆకృతుల్లో కొలువుదీరేందుకు బొజ్జగణపయ్యలు సిద్ధమవుతున్నారు.


  వినాయక చవితికి తక్కువ గడువుండడంతో విశాఖపట్నంలోని వాల్తేర్ ఆర్టీసీ డిపో దగ్గర మార్కెట్‌, అక్కయ్యపాలెం, దొండపర్తి, గాజువాక జూ పార్కు సమీపంలో, మధురవాడ, తరితర ప్రాంతాల్లో విగ్రహాల తయారీలో బిజీ అయ్యారు కళాకారులు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరగడంతో ఎక్కువ మంది నిర్వాహకులు తాము ఏర్పాటు చేసిన మండపాలలో పెట్టేందుకు మట్టి విగ్రహాలనే తయారు చేయించుకుంటున్నారు.


  ఇది చదవండి: పోలీసుల కోసం స్పెషల్ షోరూమ్.. అక్కడ దొరికేవన్నీ వారి కోసమే.. యువకుడి సక్సెస్ స్టోరీ..


  గణేష్‌ ఉత్సవాల్లో సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ ఏడాది ట్రెండింగ్‌లో ఉన్న సినిమాలకు తగ్గట్లుగా విఘ్నేశ్వరుని ప్రతిమలను తీర్చిదిద్దుతుంటారు. ఏటా విభిన్న రూపాల్లో దర్శనమిచ్చే గణేశులు ఈ ఏడాది కూడా ట్రెండీ ఆకృతుల్లో ముస్తాబవుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ఇంటర్వెల్‌ సీన్‌కు బేస్‌ చేసుకుని గణనాథుని విగ్రహాలను తయారుచేస్తున్నారు. అంతేకాదు ఆ సినిమాలో ఎన్టీఆర్‌ పోషించిన కొమరం భీం క్యారెక్టర్‌ దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్‌ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ కొమరం భీం గణేష్‌ విగ్రహాలు కూడా సిద్ధమవతున్నాయి.


  ఇది చదవండి: ఏపీలో వన్ అండ్ ఓన్లీ పశువుల హాస్టల్.. కానీ పట్టించుకునే నాథుడేడీ..?  వీటితోపాటు ఆర్డర్‌ల ప్రకారం ట్రెండింగ్‌లో ఉన్న బాహుబలి, మోదీ, బుద్ధావతార, మహాత్మాగాంధీ, సెల్ఫీ గణేశులు..ఇలా ఒకటేంటి ఎన్నో రకాలుగా గణనాథులను రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం తయారైన విగ్రహాల్లో కొవిడ్‌పై విజయం సాధించిన వినాయకుడు, స్కూల్‌కి వెళ్తున్న గణనాథుడు, డాక్టర్‌గా, సాయి గణేశునిగా, విష్ణుమూర్తి, శివుని రూపాలు, తదితర ఆకృతుల్లో ఆకట్టుకుంటున్నాయి.


  ఇది చదవండి: బేతంచెర్ల బండలు చాలా ఫేమస్.. విదేశాల్లో వాటి క్రేజే వేరు.. ఎందుకంత స్పెషల్ అంటే..!


  పర్యావరణ పరిరక్షణపై వైజాగ్‌ ప్రజలు మొగ్గుచూపుతున్నారు. అందుకే ఈ గణేష్‌ ఉత్సవాల్లోనూ ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ వద్దు మట్టి విగ్రహాలే ముద్దు అంటూ ముందుకెళ్తున్నారు. విశాఖ మహానగరంలో దాదాపు మట్టి విగ్రహాలే కనువిందు చేయనున్నాయి. ఒకప్పుడు ఎక్కువ ఎత్తు వినాయకుడు కావాలంటే మట్టితో కుదరదు…ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌తోనే చేయించుకోవాలనే అపోహ ఉండేది. కానీ ఇప్పుడు ఎంత ఎత్తు వినాయకుడినైనా మట్టితో తీర్చిదిద్దొచ్చని కళాకారులు నిరూపిస్తున్నారు.


  ఇది చదవండి: ఏపీలోనూ ఓ తాజ్ మహల్ ఉందని మీకు తెలుసా..? దాని హిస్టరీ ఇదే.. ఇంతకీ ఎక్కడుందంటే..!


  ఇలా మట్టితో విగ్రహాలను తయారుచేసేందుకు నిష్ణాతులైన కళాకారులను బెంగాల్ నుండి తీసుకొస్తుంటారు వ్యాపారులు. వినాయకచవితి సీజన్ అయిపోయే వరకు వాళ్లంతా ఇక్కడే ఉంటారు. ఇలా మట్టి విగ్రహాలు తయారు చేసే సంస్థలు విశాఖలో మూడు నాలుగు ఉండగా.. ఒక్కో దుకాణానికి వివిధ సైజుల్లో 10వేలకు పైగా ఆర్దర్లు వచ్చినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఒక్క బెంగాల్‌ నుంచే కాదు మహారాష్ట్ర, గుజరాత్, కోలకతా, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన కళాకారులు గత కొన్ని నెలలుగా వినాయక ప్రతిమను తయారు చేస్తున్నారు.


  ఇది చదవండి: వనవాసంలో ఈ ఎత్తైన కొండపై సీతారాములు ఊయల ఊగారాట.. ఎక్కడో మీకు తెలుసా..!


  కొండెక్కిన ధరలతో..!
  గత మూడేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం విగ్రహాల ధరలు బారీగా పెరిగాయి. నాలుగు అడుగుల విగ్రహం గతంలో నాలుగైదు వేలు ఉంటే.. ఇప్పుడు రూ. తొమ్మిది వేల నుంచి రూ.పది వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ధరల భారంతో విగ్రహం ఎత్తు గురించి ఆలోచించడం లేదని, కేవలం డిఫరెంట్‌గా మంచి ఆకృతిలో ఉన్న లంబోధరుడిని ఎంపిక చేసుకున్నట్లు మండపం నిర్వాహకులు చెబుతున్నారు.  ఆర్డర్‌ను బట్టి ఎన్ని అడుగుల విగ్రహాన్ని అయినా రూపొందిస్తామని తయారీదారులు చెబుతుండగా.. ప్రస్తుతం మార్కెట్లో నాలుగు నుంచి పది అడుగుల వరకు విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఎత్తును బట్టి వాటి ధరలు మూడు వేల నుంచి 60 వేల వరకు పలుకుతున్నాయి. ప్రత్యేకంగా తయారుచేసిన విగ్రహాలు లక్షల రూపాయల్లో ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు జరగనందున ఈ ఏడాది విగ్రహాల విక్రయాలు భారీగా ఉంటాయని, వ్యాపారులు ఆశిస్తున్నప్పటికీ బుకింగ్స్ మాత్రం ఆ స్థాయిలో లేకపోవడంతో తయారీదారులు కొంత కలవరానికి గురవుతున్నాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Vinayaka chavathi, Visakhapatnam

  ఉత్తమ కథలు