Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM LOCAL NEWS WALKERS FEAR TO GO FOR WALKING IN RK BEACH IN VISAKHAPATNAM VSJ NJ NGS

Vizag: తెల్లవారుజామున వాకింగ్ వెళ్తున్నారా..? బీకేర్ ఫుల్ అంటున్న వాకర్స్..? అక్కడ ఏం జరుగుతోంది?

మార్నింక్

మార్నింక్ వాకింగ్ వెళ్లాలి అంటే భయపడుతున్న వాకర్స్

సుందర సాగరతీం ఇప్పుడు మందుబాబులకు అడ్డాగా మారింది. రాత్రి అయితే చాలు బీచ్‌లో తప్పతాగి ఆ సీసాలను అక్కడే పగలకొట్టి వెళ్తున్నారు. ఉదయాన్నే బీచ్‌కు వెళ్లే వాకర్స్‌కు చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. బీచ్‌ను శుభ్రం చేయడానికి వెళ్లే కార్మికులు గాయపడుతున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  Setti Jagadeesh, News18, Visakhapatnam.

  Vizag:  సాగర సోయగాలు.. ప్రశాంత వాతావరణానికి కేరాఫ్‌ అడ్రస్‌ సుందర తీరం మన విశాఖపట్నం (Visakhapatnam) . పర్యాటకుల మదిలో ముగ్థమనోహరమైన ముద్ర చేసుకున్న వైజాగ్ బీచ్‌ (Vizag Beach) అందాలు ఇప్పుడు మసక బారుతున్నాయి. పొద్దున్నే వాకింగ్‌కు (Early Morning Walk) వెళ్తున్న నగరవాసులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జనసంచారం తక్కువగా ఉన్న సమయం.. అంటే తెల్లవారు జామున అటు వాకింగ్ కు వెళ్లాలి అంటే బీకేర్ ఫుల్ అని తెలిసిన వాళ్లు హెచ్చరించేలా పరిస్థితి ఉంది. ఉదయాన్నే సముద్రంలో నుంచి వస్తున్న ఆ సూర్యుడిని చూసేందుకు వచ్చే పర్యాటకులు సైతం కాస్త ఇబ్బందిగానే పీల్‌ అవుతున్నారు.. ఎందుకో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.. !

  సుందరమైన సాగరతీరం..ప్రశాంతమైన వాతావరణం.. ప్రకృతి గీసిన అందమైన చిత్రంలాంటి సాగరతీరం..నీలిసంద్రపు అందాలు.. ఉవ్వెతున ఎగసిపడే అలలు ఎవరి మదినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. పర్యాటక రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న విశాఖ బీచ్‌..మందుబాబులకు అడ్డాగా మారుతుంది. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగకూడదు అంటూ ఇప్పటికే పలుమార్లు పోలీసులు హెచ్చరించిన వారి ఆగడాలు మాత్రం తగ్గడం లేదు.  చికాకులతో కాస్త ఆటవిడుపు కోరుకునేవారంతా అలా విశాఖ సాగరతీరానికి వెళ్తుంటారు. ఆర్కే బీచ్ నుండి వుడా పార్క్ కొరకు ఉదయం సాయంత్రం అధిక సంఖ్యలో నగరవాసులు వ్యాయామం చేసుకోవడానికి, వాకింగ్‌, జాగింగ్‌కు వస్తూ ఉంటారు. రోడ్డుమీద చేసే వ్యాయామంతో పాటు బీచ్ ఇసుక తిన్నులపై చెప్పులు లేకుండా వాకర్స్ నడుస్తూ ఉంటారు.

  ఇదీ చదవండి : ఐడియా అంటే ఇది.. అంబాసిడర్ కారులో టేస్టీ చికెన్.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

  అయితే కొందమంది యువకులు, మందుబాబులు రాత్రి అయితే చాలు విశాఖ సాగర తీరంలో తప్పతాగి బాటిల్స్‌ను అక్కడే పగలకొట్టి వెళ్తున్నారు. దీని వల్ల ఉదయాన్నే వస్తున్న వాకర్స్‌కు చాలా ఇబ్బంది అవుతోంది. అంతేకాదు ఉదయాన్నే బీచ్‌ను క్లీన్‌ చేయడానికి వచ్చే పారిశుద్ధ్య కార్మికులు..వాళ్ల చేతులతోనే పగిలిన సీసా ముక్కలను తీస్తుంటారు. అలా తీస్తున్నప్పుడు, ఇసుకలో పగిలి ఉన్న గాజు సీసా ముక్కల వల్ల ఇప్పటికీ చాలామంది కార్మికులు గాయపడ్డారు.

  ఇదీ చదవండి : బాలయ్యను కలిసిన మంత్రి విడదల రజని.. అసలు ట్వీస్ట్ ఏంటంటే..?

  కొంతకాలంగా పోలీసులు పర్యవేక్షణ లోపం కారణంగా ఎక్కడ చూసినా మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయని వాకర్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకటి పడితే చాలు మందుబాబులు బీచ్‌లో దర్జాగా తాగి అక్కడే బాటిల్ పడేసి వెళ్తున్నారని…. మద్యం మత్తులో కొంతమంది ఆ మద్యం సీసాలు పగలగొడుతున్నారని తెలిపారు.

  ఇదీ చదవండి : జాతీయ స్థాయిలో రోజాకి క్రేజ్.. సంతోషాన్ని షేర్ చేసుకున్న మంత్రి

  దీంతో ప్రతిరోజు ఉదయం శుభ్రం చేసే పారిశుధ్యం కార్మికులకు, బీచ్ లో వాకింగ్ చేసే నగరవాసులకు సీసాల ముక్కలు గుచ్చుకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి సమయాల్లో విచ్చలవిడిగా మద్యం సేవించడంతో ఆర్కే బీచ్ నుండి వై.ఎం.సి వరకు ఎక్కడ చూసినా మద్యం బాటిళ్లే దర్శనమివ్వడం వల్ల… బీచ్ కి వచ్చే సందర్శకులు, ఉదయం సాయంత్రం నడిచే వాకర్స్ వాటిని చూసి భయపడుతున్నారు.  ఇది వరకే ఈ పగిలిన మద్యం సీసాలు గుచ్చుకొని అనేకమంది పారిశుద్ధ్య కార్మికులు గాయాల బారిన పడిన వారున్నారు.. పగలగొట్టిన మద్యం సీసాలను తీస్తున్నప్పుడు… అవి గుచ్చ్చుకొని తమకు గాయాలవుతున్నాయని కార్మికులు వాపోతున్నారు.

  ఇదీ చదవండి : మాజీ మంత్రిపై కుట్ర జరుగుతోందా? వాళ్ల చిట్టా అనిల్ బయటపెడతారా? ఎవరు వారు..?

  చెప్పులు లేకుండా నడిచే వాకర్స్‌కి సైతం గాయాలు అవుతుండటం వల్ల అధిక శాతం బీచ్‌కి వచ్చేవాళ్లు రాకుండా రోడ్డుపైన వాకింగ్ చేస్తున్నారు. పోలీసులు రాత్రి సమయంలో బీచ్‌లో కాస్త నిఘా పెట్టాలని…ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నగరవాసులు కోరుతున్నారు
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు