హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: ఆ గార్డెన్స్ లో దొరకని మొబైల్ ఉండదు.. ఇంకా ప్రత్యేకత ఏంటంటే?

Vizag: ఆ గార్డెన్స్ లో దొరకని మొబైల్ ఉండదు.. ఇంకా ప్రత్యేకత ఏంటంటే?

X
ఇక్కడ

ఇక్కడ దొరకని మొబైల్ ఉండదు

Vizag: విశాఖ మహానగరంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.. అలాగే మరో ప్లేస్ ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రధాన వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటో తెలుసా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhaptnam

Vizag: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అందాల నగరం ఏదైనా ఉంది అంటే.. అది విశాఖ మహానగరమే అనడంలో ఎలాంటి సందేహం అవపరం లేదు. అయితే  విశాఖపట్నం (Visakhapatnam) మహానగరంలో మొబైల్‌ కొనాలనుకునే ఎవ్వరికైనా ఠక్కున గుర్తువచ్చేది ముందుగా డాబాగార్డెన్స్‌ (Dabagardens) అని చెప్పాలి.. అవును, డాబా గార్డెన్స్ విశాఖపట్నం నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతం. విశాఖలో ఏ స్మార్ట్ ఫోన్ (Smart Phone) కావాలన్నా డాబా గార్డెన్స్ ఏరియాకి వెళ్లాల్సిందే. మార్కెట్‌లో కొత్తగా రిలీజ్ అయిన పోన్‌ కావాలన్నా, సెకెండ్ హ్యాండ్‌ ఫోన్ అయినా ఇక్కడ దొరుకుతాయి.

దేశంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్‌ ఫోన్ల వాడకం కూడా పెరుగుతోంది. మరీముఖ్యంగా నేటి యువత ఫోన్లు లేకుండా ఒక వారం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సెల్‌ఫోన్‌లు మనిషి జీవితంలో ఒక భాగమైపోయాయి. ఇంకా చెప్పాలంటే శరీరంలో ఒక భాగమైపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర రెండు లేదా మూడు సెల్‌ఫోన్లు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు.

మార్కెట్లో అతి తక్కువ ధరకే సెల్‌ఫోన్లు లభించడంతో ధనిక, పేద తేడా లేకుండా అందరి వద్ద సెల్‌ఫోన్‌ అనేది సర్వసాధారణ వస్తువుగా అయిపోయింది. కొందరిలో అయితే తమ చేతిలో సెల్‌ఫోన్‌ లేకుంటే ఎక్కడ జనాలు చిన్నచూపు చూస్తారో అనే ఆత్మన్యూనత భావం కూడా ఉంటుంది. చేతిలో స్మార్ట్ ఫోన్‌ అనేది ఒక స్టేటస్‌ సింబల్‌గా మారింది.

ఇదీ చదవండి : ఛీఛీ మీరు మనుషులేనా..? ఫీజులు కట్టలేదని అలా చేస్తారా..?

స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే పెద్ద పెద్ద నగరాల్లో ఏకంగా కిలోమీటర్ల పొడుగునా ఒకే ఏరియాలో అన్ని మొబైల్ ఫోన్లు లభిస్తున్నాయి. యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్‌కు అలవాటు అవడంతో మార్కెట్‌లో ఏ కొత్త ఫోన్ రిలీజ్ అయినా ఇట్టే కొనేస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో అన్నిచోట్ల తిరగకుండా ఒకే దగ్గర సెల్‌ఫోన్‌లు అందుబాటులో ఉంచేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి : రోడ్డుపై చెత్త ఊడుస్తున్న సర్పంచ్‌..! ఎందుకిలా చేస్తోందా తెలుసా?

విశాఖలో మొబైల్స్‌కి అడ్డా దాబా గార్డెన్స్..!                               దాబా గార్డెన్స్.. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు అతి సమీపంలో ఈ దాబా గార్డెన్స్ ఏరియా ఉంటుంది. మొబైల్ ఫోన్స్‌కి అడ్డాగా మారిన ఈ దాబా గార్డెన్స్‌లో వందకు పైగా సెల్ షాపులు మీకు దర్శనం ఇస్తాయి. రోడ్డు ప్రారంభం నుండి చివరి వరకు మా దగ్గర కొత్త ఫీచర్స్‌తో సరికొత్త డిజైన్‌ ఫోన్లు ఉన్నాయి రండి అంటూ బయట ఆహ్వానం పలుకుతూ ఉంటారు.

ఇదీ చదవండి : మాజీ ఎంపీ.. బీజేపీ నేత అరెస్ట్.. కారణం ఏంటో తెలుసా..?

ఇక్కడ అన్ని రకాల సెల్ ఫోన్స్‌తో పాటు, రిపేర్ వాటికి తగ్గ అదనపు సామాన్లు కూడా అందుబాటులో ఉంటాయి. డాబా గార్డెన్స్ అంటే ఎక్కువగా మొబైల్స్ కొనడానికి వస్తూ ఉంటారని అధిక శాతం ఇక్కడే పెట్టుబడి పెట్టి సెల్‌ఫోన్‌ బ్రాంచ్‌లు పెడుతున్నామని స్థానిక సెల్ పాయింట్ నిర్వాహకులు మోహన్ అంటున్నారు.

ఇదీ చదవండి: తనిఖీల్లో భాగంగా ఆటోను ఆపిన పోలీసులు..! తీరా అందులో ఉన్నది చూసి షాక్..!

ఒకే చోట అన్ని మోడల్స్ ఉండడంతో యువత ఎక్కువగా అక్కడకు వెళ్తుంటారు. యువత ఎక్కువగా అక్కడకు వెళ్తుండటంతో దాబా గార్డెన్స్ కాస్తా సెల్‌ఫోన్‌ అడ్డాగా ఫేమస్ అయింది. మీ మొబైల్‌కు కావాల్సినవన్నీ A టు Z అన్ని అక్కడ దొరుకుతాయి.

అడ్రస్‌: దాబా గార్డెన్‌ రోడ్‌, దాబా గార్డెన్స్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌- 530020.

ఎలా వెళ్లాలి..?  విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌కి 100 మీటర్లు దూరంలో ఇది ఉంటుంది. బస్సు, ఆటో సౌకర్యం కలదు. ఇది జగదాంబ సెంటర్‌కు, ఆర్.టి.సి.కాంప్లెక్స్ మధ్యలోనే ఉంటుంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Local News, Mobile, Vizag