Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM LOCAL NEWS CHICKEN VARIETIES IN AMBASSADOR CAR SMOKED OUT BBQ IN VIZAG VSJ NJ NGS

Vizag: ఐడియా అంటే ఇది.. అంబాసిడర్ కారులో టేస్టీ చికెన్.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

అంబాసిడర్

అంబాసిడర్ లో చికెన్

Vizag: నిజంగా ఐడియా అంటే ఇదే.. ఎందుకు పనికిరాని కారును ఫేమస్ చేశాడు. తనకు వచ్చిన ఐడియాతో లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంతకీ అతడి ఐడియా ఏంటి.. కారుని రెస్టారెంట్ గా ఎలా మార్చాడు..?

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  Setti Jagadeesh, News18, Visakhapatnam.

  Car Restaurant: పర్యాటక ప్రాంతమైన విశాఖనగరం (Visakha CIty) ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా కొందరు కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వస్తూ సక్సెస్ అవుతున్నారు. కొందరికి వచ్చిన సరికొత్త ఆలోచనలు కొత్త కొత్త అనుభూతులను నగరవాసులకు అందిస్తున్నాయి. తాజాగా ఓ కుర్రాడి ఆలోచన విశాఖ వాసులను చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది. అటు వైపు వెళ్తే.. ఎవరైనా అటు చూడకుండా వెళ్లలేరు.. సమయం ఉంటే అక్కడి వెళ్లి తమకు కావాల్సింది తీసుకుంటారు కూడా.. అంతలా ఆకట్టుకుంటోంది.  అదే విశాఖ జైల్ రోడ్డు (Visakha Jail Road) లో ఏర్పాటు చేసిన అంబాసిడర్ కారులో బార్బిక్యూ (Ambassador Car Barbecue Restaurant) .. ప్రస్తుతం నగరంలోని ఫుడ్‌లవర్స్‌ను (Food Lovers) విపరీతంగా ఆకర్షిస్తోంది. వాట్‌ యాన్‌ ఐడియా సర్‌ జీ అంటూ కొనియాడుతున్నారు.

  కాలనుగుణంగా విశాఖ యువత ఆలోచన తీరు మారుతోంది. ఎంత పనికి అంత ప్రతిఫలం అన్నదిశగా వారి ఆలోచనలు సాగుతున్నాయి. దీంతో ఎదుగు బొదుగులేని ఉద్యోగాలకన్నా.. తమలోని ప్రతిభను వాడుకుని సరికొత్త పంథాలో ముందుకెళ్తున్నారు. అలాంటి కోవకు చెందిన వాడే విశాఖకు చెందిన కిషోర్ అనే యువకుడు. ఓ సరి కొత్త ఆలోచనతో ముందుకొచ్చి.. నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందేలా చేస్తున్నాడు.  ఎంబీఏ పూర్తి చేసుకున్న యువకుడు గవర్నమెంట్‌ కొలువుల కోసం ప్రయత్నం చేశాడు. కానీ తన ప్రయత్నం సఫలం కాకపోవడంతో..అక్కడితో ఆగిపోకుండా తనకు చిన్ననాటి నుంచి ఆసక్తి ఉన్న బిజినెస్‌పై దృష్టిపెట్టాడు. ఏ ఉద్యోగం రాకపోతే ఏంటి… తానే సొంతంగా ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందిరిలా సాధారణంగా ఒక గది తీసుకుని రెస్టారెంట్ పెట్టడం కాదని..ఏదైనా థీమ్‌డ్‌ రెస్టారెంట్‌ ప్లాన్‌ చేశాడు. ఈ సమయంలో తనకు తట్టిన ఓ ఐడియా ఇప్పుడు అతన్ని మరింత ఫేమస్‌ చేశాయి.

  ఇదీ చదవండి : జస్ట్ రూ. 650 పెట్టుబడి.. రోజుకు 10వేలకు పైగా ఆదాయం..? బీటెక్ కుర్రోడి సక్సెస్ స్టోరీ

  ట్రక్‌లలో రెస్టారెంట్‌లు నడపడాన్ని చూసిన కిషోర్‌కు కూడా ఓ ఐడియా వచ్చింది. వాహనాలపై వంటలు తయారు చేయాలని ఆలోచించాడు. ఇప్పటికే సైకిల్‌, బుల్లెట్ బైక్‌, జీప్ వంటి వాహనాలపై స్మోకుడ్ ఔట్ బి.బి.క్యూ (Smoked out BBQ) అని తనకంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. కొద్దిరోజుల్లో తన బిజినెస్‌ సక్సెస్‌ కావడంతో.. ఆ బ్రాండ్‌తో దేశవ్యాప్తంగా 125 వరకు ఫ్రాంచైజెస్ స్టార్ట్ చేశాడు. ఈ కొత్త ఆలోచనతో ఎంతోమందికి ఉపాధి కల్పించడంతో పాటు లక్షలు సంపాదిస్తున్నాడు.

  ఇదీ చదవండి : గాడిదలు కాస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..? ఆ పాలతో ఉపయోగాలెన్నో..?

  రెండు నెలలు క్రితం విశాఖ జైల్ రోడ్డులో మరో సరికొత్త ఐడియాతో ముందుకొచ్చాడు. అంబాసిడర్ కారులో బార్బెక్యూ వంటకాలు చేసేందుకు అనుగుణంగా పాత కారును కొత్త రీతిలో తీర్చిదిద్దాడు. కారుకు రంగులు వేసి… ముందు ఇంజన్ బాగం తీసి బార్బెక్యూ కాల్చి తయారు చేసుకునే విధంగా ఈ కారును రూపుదిద్దాడు. కిషోర్‌ ఐడియాకే అందరూ సలాం కొడుతున్నారు. అంతేకాదు అక్కడ తయారయ్యే అన్ని రకాల చికెన్ ఐటమ్స్‌ను టేస్ట్ చేస్తున్నారు. ఐడియాతో పాటు ఫుడ్‌ టేస్ట్‌ కూడా అదుర్స్‌ అంటున్నారు నగరవాసులు.

  ఇదీ చదవండి : వరి నాట్లు నాటి.. కౌలు రైతుగా మారిన జేడీ.. సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం.. రైతుగా మారడానికి కారణం ఏంటంటే?

  తన ఐడియా నచ్చి ఎవరైనా సొంతంగా వ్యాపారం పెట్టాలని అనుకుంటే తమను సంప్రదించొచ్చని కిషోర్‌ చెబుతున్నాడు. రూ. 1,50,000 పెట్టుబడి పెట్టుకోగలిగిన వారికి తమ ప్రాంఛైజీ తరుపున ఐడియాలను ఇస్తానంటున్నాడు. వీటితో పాటు విమానంలో కూడా సరికొత్త వంటకాలు చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నట్లు కిషోర్ తెలిపారు.  అడ్రస్‌: జైలు రోడ్డు, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌- 530007.
  ఎలావెళ్లాలి?
  విశాఖపట్నం కాంప్లెక్స్ నుండి 100 మీటర్ల దూరంలో సెంట్రల్ పార్క్ వెనక జైలు రోడ్డులో ఉంది. అక్కడ నుంచి నడిచి వెళ్లేందుకు వీలైనంత దూరంలోనే ఈ అంబాసిడర్‌ బార్బిక్యూ ఉంటుంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు