Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM LIQUOR BOTTLES SMASHED WITH ROAD ROLLER IN ANAKAPALLI DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSJ NJ

Vizag: మందు బాబుల గుండె పగిలే దృశ్యాలు..! మద్యం బాటిళ్లను రోడ్డురోలర్‌తో తొక్కించిన పోలీసులు..!

అనకాపల్లిలో

అనకాపల్లిలో భారీగా అక్రమ మద్యం ధ్వంసం

Anakapalli: ఈ దృశ్యాలు చూస్తే గబుక్కున మందుబాబుల గుండెలు గుబేళ్‌మంటాయేమో..జర జాగ్రత్త.. గత నాలుగేళ్లుగా స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు. రోడ్డు రోలర్‌తో తొక్కించి మద్యం సీసాలన్నిటిని నాశనం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Anakapalle, India
    Setti Jagadeesh, News 18, Visakhapatnam ఈ దృశ్యాలు చూస్తే గబుక్కున మందుబాబుల గుండెలు గుబేళ్‌మంటాయేమో..జర జాగ్రత్త.. గత నాలుగేళ్లుగా స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేశారు. రోడ్డు రోలర్‌తో తొక్కించి మద్యం సీసాలన్నిటిని నాశనం చేశారు. అనకాపల్లి జిల్లా (Anakapalli District) వ్యాప్తంగా ఆపరేషన్ పరివర్తన-2లో భాగంగా మత్తు పదార్థాల విక్రయాలపై ముక్కు పాదం మోపారు. నాలుగేళ్లుగా స్వాధీనం చేసుకుంటున్న అక్రమ మద్యం, నాటు సారాలను న్యాయస్థానం అనుమతితో పోలీసులు ధ్వంసం చేశారు. నర్సీపట్నం పరవాడ, అనకాపల్లి డివిజన్ల వారీగా పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్లతో తొక్కించారు. అనకాపల్లి. పరవాడ సబ్ డివిజన్లకు సంబంధించి మద్యాన్ని కశింకోట శివారులోని ఒక ప్రైవేటు టౌన్ షిప్ వద్ద, నర్సీపట్నం డివిజన్ పరిధిలోని మద్యాన్ని నర్సీప ట్నం బలిఘట్టం డంపింగ్ యార్డ్ వద్ద ధ్వంసం చేశారు. అనకాపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాడులు చేసి స్వాధీనం చేసుకున్న రూ.73 లక్షల విలువైన మద్యాన్ని ధ్వంసం చేసినట్లు ఎస్పీ గౌతమి సాలి పేర్కొన్నారు. కశింకోట శివారులోని ఒక ప్రైవేటు టౌన్ షిప్ వద్ద అక్రమ మద్యం సీసాలను రోడ్డుపై పేర్చి రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ దగ్గర ఉండి పర్యవేక్షించారు. జిల్లాలోని పోలీసు స్టేషన్లలో గత ఐదేళ్లలో 2,315 ఎక్సైజ్ కేసులు నమోదవ్వగా.., వీటిలో 8,114 లీటర్ల 37,674 మద్యం సీసాలు పట్టుకున్నారు. వీటిని కశింకోట, నర్సీపట్నంలలో ధ్వంసం చేసినట్లు తెలిపారు.

    ఇది చదవండి: శ్మశానాల కబ్జా వెనక ఆ ఎమ్మెల్యే హస్తముందా..? కబ్జారాయుళ్లు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం..!

    జిల్లాలో నాటు సారా, మద్యం అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై నిరంతరం దాడులు చేసి కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు కంటే ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉంటే వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశామన్నారు. నాటు సారా తయారీదారులకు నల్ల బెల్లం విక్రయించే వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.

    ఇది చదవండి: భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసిన భార్య.. ముగ్గురూ కలిసి కాపురం..! మరో ట్విస్ట్ ఏంటంటే..!

    సాటు సారా తయారీకి నల్ల బెల్లం విక్రయించే వ్యాపారులను కేసుల్లో చేరుస్తున్నామన్నారు. జిల్లాలో బెల్టు షాపులు అరికట్టడానికి, నాటు సారా నియంత్రణకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది ఆగస్టులో జిల్లాలోనే 1391 కేసుల్లో పట్టుకున్న 8,665 లీటర్ల నాటు సారా ఇప్పటికే ధ్వంసం చేశామన్నారు.

    ఇది చదవండి: ఆస్పత్రి సూపర్‌వైజర్‌కే వైద్యం అందలేదు.. ఇంతకంటే దారణం ఏమైనా ఉంటుందా..?

    జిల్లాలో నాటు సారా, మద్యం అక్రమ రవాణా నియంత్రణకు పోలీసులకు సమాచారం అందించి ప్రజలు సహకరించాలన్నారు. ఇందుకోసం వాట్సప్ నెంబర్ 9505200100, ట్రోల్ ఫ్రీ నెంబర్ 14500, 100, స్థానిక పోలీసు స్టేషన్లకు సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో సారాయి తయారు చేస్తున్న వారిపై శాంతి భద్రతలు, ఎస్ఈబీ పోలీసులు కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. సారాయి తయారు చేస్తూ.. విక్రయిస్తూ.. రవాణా చేస్తూ పట్టుబడిన వారు పదేపదే పోలీసులకు చిక్కితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సహాయంతో ఎస్ఈబీ పోలీసులు సారాయి తయారు చేసే గ్రామాలలో పర్యటిస్తూ అక్కడ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కేసుల్లో ఒక్కసారి ఇరుక్కుంటే జరిగే పరిణామాలు, కుటుంబ జీవితం, పరువు ప్రతిష్టలను కోల్పోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు