Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM LIGHT HOUSE IN VISAKHAPATNAM ATTRACTING TOURISTS AS BUT LOSING ITS IDENTITY FULL DETAILS HERE PRN VSJ NJ

Vizag News: విశాఖకే తలమానికం ఆ ప్రాంతం.. కానీ ఇప్పుడు శిథిలావస్థలో..

విశాఖలో

విశాఖలో శిథిలావస్థకు చేరుకున్న లైట్ హౌస్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో టూరిజం, ఐటీ, పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ విశాఖపట్నం (Visakhapatnam). విశాఖ ఎన్నో వారసత్వ సంపదలకు నెలవు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న కట్టడాల్లో లైట్ హౌస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వారసత్వ సంపదగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఇంకా చదవండి ...
  Setti Jagadeesh, News18, Visakhapatnam

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో టూరిజం, ఐటీ, పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ విశాఖపట్నం (Visakhapatnam). విశాఖ ఎన్నో వారసత్వ సంపదలకు నెలవు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న కట్టడాల్లో లైట్ హౌస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వారసత్వ సంపదగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చూట్టూ అందమైన కొండలు..సుందర సాగర తీరంతో అలరారే వైజాగ్‌ సిటీ (Vizag City).. నౌకా వాణిజ్యానికి ప్రధాన కేంద్రం. బ్రిటీష్‌ కాలంలో కూడా ఇక్కడ నుంచే పెద్ద సంఖ్యలో వర్తక వాణిజ్యాలు జరిగేవి. బంగాళాఖాతం తుఫానులకు ప్రసిద్ధి చెందింది. మరియు వైజాగ్ బీచ్ (Vizag Beach) ప్రమాదకరమైన అలలు వస్తుంటాయి. దీంతో నౌకాశ్రయానికి వచ్చిపోయే నౌకలకు దారి చూపడం కోసం బ్రిటీష్‌ ప్రభుత్వం ఇక్కడ లైట్‌ హౌస్‌ నిర్మించింది.

  అదిరిపోయే వ్యూపాయింట్‌
  ఈ లైట్‌ హౌస్‌ నాలుగు అంతస్తులతో ఉంటుంది. ప్రతి ఫ్లోర్‌కు కిటీకీ ఉంటుంది. లోపల చిన్న చిన్న మెట్లతో రౌండ్‌గా ఏర్పాటు చేశారు. ఫోర్త్‌ ఫ్లోర్‌ కు వెళ్లి చూస్తే..అక్కడ నుంచి బీచ్‌ వ్యూ పాయింట్‌ అద్భుతంగా ఉంటుంది. అంత ఎత్తు నుంచి సముద్రాన్ని చూస్తుంటే వారేవా రెండు కళ్లు సరిపోతాయా అనిపిస్తుంది. వైజాగ్‌ సిటీ అందాలు చూసేందుకు వచ్చే పర్యాటకులు తప్పకుండా ఈ పాత లైట్‌ హౌస్‌ దగ్గరకు వెళ్తారు.

  ఇది చదవండి: సిలంబం నేర్చుకుంటే శివంగిలా దూసుకుపోతారు.. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే..!


  ఎన్నో సినిమాల్లో లైట్‌హౌస్‌
  స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన జులాయి సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. అందులో ముఖ్యంగా క్లైమాక్స్‌..అంత పెద్ద వైజాగ్‌ సిటీలో హీరో తన చెల్లి ఎక్కడుందో కనిపెట్టే సీన్‌ సినిమాకే హైలెట్‌. వైజాగ్‌లో సాయంత్రం వెలిగే ఫస్ట్‌ దీపం..లైట్‌హౌస్‌…అంటూ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో లైట్‌హౌస్‌ను చూపించే విజువల్‌ అందరికి గుర్తుండే ఉంటుంది. అంతేకాదు మరెన్నో టాలివుడ్‌ సినిమాల్లో, షార్ట్‌ఫిల్మ్‌లలో లైట్‌ హౌస్‌ బ్యాక్‌గ్రౌండ్‌గా ఎన్నో సీన్స్‌ తీస్తుంటారు. ఇక్కడ జనసంద్రత కూడా తక్కువగా ఉండటంతో సినిమా షూటింగ్‌లు జరుగుతుంటాయ్‌.

  ఇది చదవండి: ఆ ఇల్లే ఓ మాయాద్వీపం.. అంతకంటే పెద్ద మ్యూజియం.. అక్కడ అద్భుతాలెన్నో..!


  1959లో లైట్‌ టవర్‌ నిర్మాణం
  పాత పుస్తకాలలో వాల్తేర్‌ పాయింట్‌గా పేర్కొనబడిన ఈ లైట్‌హౌస్ విశాఖపట్నం పట్టణానికి ఈశాన్యంగా నాలుగు మైళ్ల దూరంలో ఉంది. ఈ లైట్ టవర్‌ 1959లో నిర్మించబడింది. ఇది ఎగువ-గది బంగళా (మేసన్ బంగళా) సమీపంలో ఉంది. ఈ లైట్‌హైస్‌ను ఇసుక, రాతి నిర్మాణంతో పామ్‌బీచ్‌ ఒడ్డున కట్టారు. ఎత్తు తక్కువ ఉన్నా కానీ..దీని పై నుంచి చూస్తే సమీపంలోని ఎర్రటి కొండలు కొన్నిసార్లు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 8 ఫాథమ్‌ల లోతు ఉండటంతో…నాళాలు బిందువు దగ్గర లంగరు వేయడానికి ప్రయత్నించకూడదు. వైజాగ్‌లోని అన్ని లైట్‌హౌస్‌లలో, ఇది సులభంగా చేరుకోవచ్చు.  ప్రస్తుతం శిథిలావస్థ స్థితిలో…
  బ్రిటీష్‌ కాలం నాటి లైట్‌ హౌస్‌ కావడంతో ప్రస్తుతం శిథిలావస్థ స్థితిలోకి వెళ్లింది. పై వరకు వెళ్లే మెట్లు దాదాపు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు ప్రస్తుతం దీని ప్రధాన ద్వారాలు మూసేశారు.

  Visakhapatnam Light House

  ఎలా వెళ్లాలి?
  పామ్‌ బీచ్‌ (Palm Beach) ఏరియాలో ఉన్న ఈ లైట్ హౌస్‌కు బైపాస్‌ నుంచి వెళ్లాలంటే ది పార్క్‌ హోటల్‌ వెనకగా కూడా వెళ్లొచ్చు. విశాఖపట్నం బస్ స్టేషన్ నుండి అయితే వుడా పార్క్ వద్దకు చేరుకోవాలి. బస్‌, ఆటో సౌకర్యం ఉంటుంది. వుడా పార్క్ మరియు పార్క్ హోటల్ వెనక బీచ్ లో ఇది ఉంటుంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  తదుపరి వార్తలు