Anandaiah Sensational Comments: ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు... పొలిటికల్ ఎంట్రీ ఖాయమా..?

విజయనగరంలో మాట్లాడుతున్న ఆనందయ్య

ఐతే మరోసారి ఆనందయ్య (Krishnapatnam Anandaiah) వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వంపై (AP Government) ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య వ్యాఖ్యలు.., ఆయుర్వేద మందుపైన కాకుండా రాజకీయాలను (AP Poliics) టచ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కృష్ణపట్నం ఆనందయ్య (Krishnapatnam Anandaiah) అంటే తెలియవారుండరు. కరోనాకు ఆయుర్వేద మందు (Corona Ayurveda Medicine) తయారు చేయడంతో ఆనందయ్య పేరు ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆరు నెలల క్రితం ఆనందయ్య మందు పంపిణీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. మందు పంపిణీ కోర్టు వరకు వెళ్లడంతో దీనిపై రాజకీయ దుమారం కూడా రేగింది. చివరకు మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు... కంట్లో వేసే చుక్కలమందుపై మాత్రం స్టే విధించింది. ఆ మందుపై ల్యాబ్ ల్లో పరీక్షలు జరుపుతున్నట్లు అప్పట్లో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆ తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో ఆనందయ్య మందుపైనా ప్రచారం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆనందయ్య మందు తయారీ కొనసాగుతున్నా... వ్యాక్సినేషన్ ఊపందుకోవడం, కేసులు తగ్గుతుండటంతో కృష్ణపట్నం, ఆనందయ్య టాపిక్ పక్కకు వెళ్లిపోయింది.

    ఐతే మరోసారి ఆనందయ్య వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విజయనగరం పట్టణంలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ సమీక్షా సమావేశానికి హాజరైన రాజకీయ వ్యాఖ్యలు చేయడం దుమారం రేగుతోంది. ప్రభుత్వం తనను అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు. తన మీద కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయించడానికి కూడా ప్రభుత్వం యత్నించిందని ఆయన అన్నారు. కృష్ణపట్నం గ్రామస్తుల మద్దతుతోనే నిలబడగలిగానని.. ప్రజల్లో తనకున్న ఆదరణ చూసి పోలీసులు కూడాభయపడ్డారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఇది చదవండి: షర్మిల విషయంలో జగన్ అంత కఠినంగా వ్యవహరించారా..? అసలు నిజం ఇదేనా..?


    “నేను కనిపెట్టిన మందును ఆపేయాలని ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికీ నేను తయారుచేసిన మందు.. కరోనాని తగ్గిస్తుందని బలంగా నమ్ముతున్నాను. ఎంతోమంది కరోనా రోగులను ప్రాణాపాయం నుండి రక్షించాను. ఉచితంగా అందరికి కరోనా మందు ని అందించాను. నా కుటుంబ వారసత్వం నేను కొనసాగిస్తూ ఆయుర్వేదం నేర్చుకొని కరోనాకి మందు కనిపెట్టి ప్రజలకు పంపిణీ చేశాను. లక్షలు మంది నమ్మకాన్ని ప్రభుత్వం చెడగొట్టే విదంగా ప్రయత్నం చేసింది ఆయుర్వేదం తో ఎలాంటి రోగాన్ని అయినా తగ్గించవచ్చు.” అని ఆనందయ్య అన్నారు.

    ఇది చదవండి: ఏపీ కేబినెట్ లో ఉండేది ఎవరంటే..! మంత్రి కీలక వ్యాఖ్యలు...


    ఈ సందర్భంగా ఆనందయ్య కులాలు, రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. యాదవ కులస్తులకి సరైన రాజకీయ ప్రాధాన్యత లేకపోవడమే ప్రభుత్వం తనను టార్గెట్చేయడానికి కారణమని ఆనందయ్య వ్యాఖ్యానించారు. యాదవ కులస్తులు రాజ్యాధికారం కోసం చేస్తున్న యాత్ర లో నేను భాగస్వామ్యం అవుతానని స్పష్టం చేశారు. యాదవ కులస్తులకి రాజ్యాధికారం వచ్చేవరకు పోరాడతానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది.

    ఇది చదవండి: నువ్వు మాగాడివైతే పోటీ చేయ్.. సొంతపార్టీ నేతకు ఎమ్మెల్యే రోజా సవాల్..

    కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆనంయ్య మందుకు రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు కరోనాను నివారిస్తుందన్న ప్రచారంతో వేలాది మంది కృష్ణపట్నంకు పరుగులు పెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఆనందయ్య మందును తయారు చేయించి పంపిణీ చేశారు. దీనిపై ఆయుష్ శాఖ అధికారులు కూడా పరిశోధనలు జరిపి హానికారకం కాదని నిర్ధారించారు.
    Published by:Purna Chandra
    First published: