AP – Odisha Boarder: ఏపీ-ఒడిశా సరిహద్దు వివాదంలో కీలక పరిణామం.. గిరిజనుల సంచలన నిర్ణయం.. కలెక్టర్ సన్మానం

కొటియా ప్రజలను సన్మించిన కలెక్టర్

దశాబ్ధాలుగా కొనసాగుతున్న కొటియా గ్రామాల వివాదంలో (Kotia Villages controversy) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అధికారులకు కొంత ఊరట లభించింది.

 • Share this:
  P.Bhanu Prasad, Vizianagaram, News18

  దశాబ్ధాలుగా కొనసాగుతున్న కొటియా గ్రామాల వివాదంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అధికారులకు కొంత ఊరట లభించింది. ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దులోని (AP-Odisha Boarder) కొఠియా గ్రామాల్లో గ‌త కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న సంఘ‌ట‌న‌లు, జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆందోళన కలిగిస్తున్న నేప‌థ్యంలో తామంతా ఏపీలోనే కొనసాగుతామంటూ కొన్ని కొఠియా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ మేరకు గ్రామమంతా కలిసి నిర్ణయం తీసుకొని తీర్మానాలు చేసి జిల్లా అధికారులకు అందజేశారు. గత 50 ఏళ్లుగా ఆంధ్రా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన తాము.. ఏపీ పౌరులుగానే కొనసాగుతామంటూ నినాదాలు చేశారు. గత కొన్ని నెలలుగా ఒడిశా అధికారులు, పోలీసులు తమను వేధిస్తున్నారంటూ వారిపై తిరగబడ్డారు. అక్కడి రేషన్‌కార్డు, ఓటర్‌ ఐడీ కార్డులను విసిరికొట్టారు. విజయనగరం జిల్లా అధికారులను కలిసి తాము చేసిన తీర్మానాలను జిల్లా అధికారులకు అందజేశారు. దీంతో ఏపీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  కొన్నాళ్లుగా విజయనగరం జిల్లా (Vizianagaram District) కొటియా గ్రామాల మధ్య సరిహద్దు వివాదం నివురు గప్పినా నిప్పులా తయారైంది. కొటియా గ్రామాలపై ఏపీకి ఎటువంటి సంబంధం లేదంటూ.. ఆయా గ్రామాలలో ఉన్న తెలుగు బోర్డులను ఒడిశా అధికారులు తొలగిస్తూ వస్తున్నారు. ఇది నచ్చని స్థానికులు వాటిని తిరిగి పెట్టేవారు. ఈ విషయంలోనే అక్కడి గిరిజనులు, ఒడిశా అధికారులు మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఒడిశా అధికారులు, పోలీసులు పెద్దయెత్తున అక్కడి చేరుకోవడంతో కొటియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తెలుగు బోర్డులు పెడుతున్న గిరిజనులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఒడిశా పోలీసులు, అధికారుల ఓవరాక్షన్‌పై స్థానిక గిరిజనులు తిరగబడ్డారు. పగులుచెన్నూరు, డోలియాంబల దగ్గర ఒడిశా పోలీసులతో బాహాబాహీకి సిద్ధమవ్వడంతో యుద్ధ వాతావరణం కనిపించింది.

  ఇది చదవండి: త్వరలోనే పాపికొండలు టూర్ ప్రారంభం.. ఇలా ప్లాన్ చేసుకోండి.. టికెట్ ధర ఎంతంటే..!  ఇక నాలుగు రోజుల క్రితం.. వైఎస్ఆర్ ఆసరా పథకం (YSR Asara Scheme) అమలు సమావేశానికి వెళ్లిన ఆంధ్రా అధికారులను, ఒడిశా అధికారులు పోలీసుల బలగాలతో వచ్చి అడ్డుకున్నారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఇది తమ గ్రామమని.. ఇక్కడికి మరోసారి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. ఆంధ్రాలో ఉండే సంక్షేమ పథకాలు, ఇక్కడి పాలన స్థానిక గిరిజనులను ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో ఒడిశా రేషన్‌, ఓటర్‌ కార్డులు వద్దని.. తాము ఆంధ్రా పౌరులేమనని గిరిజనులు చెబుతున్నారు.

  ఇది చదవండి: ఆ కీలక నేతకు ఎమ్మెల్సీ పదవి గ్యారెంటీ..? సీఎం జగన్ మాట నిలబెట్టుకుంటారా..!  కొటియా గ్రామాల్లో గ‌త కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న సంఘ‌ట‌న‌లు, జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో.. ఏపీలోనే ఉండేందుకు కొటియా గిరిజన గ్రామాల ప్రజలు నిర్ణయించుకుని, తీర్మానాలు చేసి.. స్ధానిక సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరను కలిసి ఏపీలోనే కొనసాగుతామని అంగీకారపత్రం ఇచ్చారు. ఇక నుండి ఒడిశాతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొటియా ప్రజలను ఎమ్మెల్యే రాజన్నదొర అభినందించారు.

  ఇది చదవండి: ఏడు వింతలన్నీ విశాఖలోనే… ప్రభుత్వం వినూత్న ఆలోచన..  ఈ నేపథ్యంలో స్థానిక గిరిజనుల ధైర్యసాహసాలకు ముగ్థులైన విజయనగరం జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి.. కొటియా ప్రజలను కలెక్టరేట్‌కి పిలిపించారు. గంజాయిభ‌ద్ర‌, ప‌ట్టుచెన్నూరు, ప‌గులుచెన్నూరు పంచాయ‌తీల‌కు చెందిన స‌ర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక ప్ర‌జ‌లు స్‌సచ్ఛందంగా వ‌చ్చి జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారిని, అధికారుల‌ను కలిశారు. మేమంతా ఆంధ్రాలోనే ఉంటామ‌ని చేసిన తీర్మాన‌ ప‌త్రాల‌ను సమ‌ర్పించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నుంచి మాకు అన్ని విధాలుగా స‌హాయ‌, స‌హ‌కారాలు అందాల‌ని, సంక్షేమ ప‌థ‌కాలు కొన‌సాగించాల‌ని కోరుతూ అంద‌రి అధికారుల స‌మ‌క్షంలో విన‌తి ప‌త్రం స‌మూహంగా అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్ కు విచ్చేసిన కొఠియా గ్రామాల ప్ర‌జ‌ల‌ను జిల్లా అధికారులు వారికి మేళ, తాళాలతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. కొటియా వివాదం చాలా సన్నితమైన అంశమైమని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపి అక్కడి ప్రజలకు న్యాయం చేస్తామని కలెక్టర్ తెలిపారు.
  Published by:Purna Chandra
  First published: